...

...

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

బుడ్డా వెంగళరెడ్డి పుస్తకావిష్కరణ!!!

మా అబ్జ క్రియేషన్స్ తరఫున నాల్గవ ప్రచురణగా వెలువరించిన శ్రీ ఎస్.డి.వి.అజీజ్ గారి చారిత్రక నవల 'బుడ్డా వెంగళరెడ్డి' గ్రంథాన్ని ప్రముఖ కవి శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు ఆవిష్కరించారు. తెలుగుభాషా వైభవ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రవితేజమ్ దినపత్రిక కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆవిష్కర్త శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తిగారు మాట్లాడుతూ మానవతావాది బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రను నవలా రూపంలో పాఠకులకు పరిచయం చేసిన రచయిత అజీజ్ గారిని అభినందించారు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కోడీహళ్లి మురళీమోహన్ మాట్లాడుతూ ఆకస్మికంగా దసరా కానుకగా ఈ ఆవిష్కరణను ఏర్పాటు చేసినందువలన గ్రంథ రచయిత శ్రీ అజీజ్‌గారు హాజరు కాలేక పోయారనీ త్వరలో ఇదే పుస్తకాన్ని కర్నూలు, ఆళ్ళగడ్డ పట్టణాలలో ఘనంగా ఆవిష్కరించ నున్నామని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో రవితేజం సంపాదకులు శ్రీ భూపతి రవీంద్రనాథ్, సాహిత్యకిరణం పత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, సాహితీ వేత్తలు శ్రీ గురజాడ అప్పారావు, శ్రీమతి గురజాడ విజయశ్రీ, శ్రీ ఎస్.వివేకానంద, శ్రీ టి.గోపాలరావు, శ్రీ గుంటూరు శివరామకృష్ణ, శ్రీ కె.రామకృష్ణ, శ్రీ ఎ.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆ సమావేశానికి చెందిన ఫోటోలు కొన్ని .







26, సెప్టెంబర్ 2009, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము! - కొన్ని హింట్స్

పజిల్ పూరించటానికి ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు. బహుశా ఇచ్చిన ఆధారాలకు మరో బ్లాగు(కథాజగత్)కు వెళ్ళి ఆ కథలను చదివి సమాధానం తెలుసుకునేందుకు కొంచెం కష్టంగా ఉన్నట్లు తోస్తున్నది. సరే ఈ ఆధారాలకు సంబంధించిన లింకులను ఇస్తున్నాను. ఎవరైనా పూరించగలరేమో చూద్దాం. మీ పూరణలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబరు 30. బెస్ట్ఆఫ్‌లక్!




ఆధారాలు:

అడ్డం :
1.ఏకాకి కథా రచయిత(6),
4.వింజమూరి వారి కథలో ఇంటావిడ పేరు వయసులో ఉన్నప్పుడా?(3),
6.దింపుడు కళ్ళం రచయిత కలగాపులగం అయ్యాడు (6),
10.సుందరం తన కూతుర్ని ఈ అంశంలో చాంపియన్ చేయాలని ఆశించాడు పాపం!(2),
11.దింపుడు కళ్ళం కథలో నాన్న ఇంటికి తెచ్చింది ఈవిడ్నే!(2),
12.యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే ____ పెడుతుంటే. నిజంగా ఒకటే!(3),
13.వైదేహి మనుమరాలు, మానస కూతురూను (3),
15.రాబోయే ప్రమాదం నుండి ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌ను కాపాడాలని పాపం ఈ గ్యాంగ్‌మ్యాన్ తడబడ్డాడు(3),
17.సూపర్‌వైజర్‌ని చూడగానే ఈ గేట్‌మాన్ విష్ చేశాడు అటునుంచి?!(4),
21.చిన్ని చిన్ని ఆశ కథకుడు (4),
23.బుడ్డ రాకాసి తల్లి కాబట్టే తడబడింది(4),
24.అటునుంచి ఏకాకి హీరో (4),
25.కథా రచయిత ఈశ్వర్ ఇంటిపేరు?(4),
28.రాధేయ గారి కథ తడబడటంతో ఒక అక్షరానికున్న సున్న మరో అక్షరానికి తగులుకుంది(4),
30.నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు ___, తమలపాకు ___, క్యాబేజీ ___, ఉల్లి ___ ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది(3),
32.నిలువు 4.రచయిత ఈ యేడాది ___శాంతి పురస్కారం మరో రచయితతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వెనుక నుండి చదవండి(3),
34.ఆకులేని అడవి అని దీన్ని వర్ణిస్తున్నారు ఓ కథకుడు(3),
37.రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద __ __గా దాడి!రెండు సార్లు చెప్పనక్కర లేదు(2),
38."__ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ (2),
40. కొందరు మాత్రమే ఏపరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే ______ అంటాం. కానీ పాపం చెల్లాచదురయ్యారు(6),
41.ఈ తిలకం పెట్టుకుంటాడో లేదో తెలియదు కాని పేరుముందు మాత్రం ఉంటుంది మన మురళీకృష్ణకి(3),
42.వానరాయుడి అసలు సిసలు పేరు?

నిలువు:
1.మృదుల తండ్రి, రాఘవకు మామయ్య కాలేక పోయాడు?(4),
2.సునీత నానిగాడి __?(2),
3.తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. ఈ పదానికి పర్యాయ పదం(3),
4.అడ్డం 34 రచయితే!(3),
5.అతనికి తల నరికి మధ్యలో గుడిలేకున్నా అర్థం మారదు కానీ తలక్రిందలయ్యింది(3),
7.మానస వీణ రచయిత ఇంటిపేరు లేకుండా? ఐతే నేం?(3),
8.పడమటి దేశానికి __ హిరణ్యుడు(2) చూడుము నిలువు 29.,
9.మానస మానసచోరుడు?(4),
12.సోమశంకర్ కొల్లూరిని ఇలా పొట్టిగా పిలవచ్చా?(2),
14.హసీనాను సమ్మోహితురాల్ని చేసిన నర్తకి(2),
16.ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు.ఈ పదానికి పర్యాయ పదం!(2),
18.ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రక___ చేపలు!(3),
19.ఇందిరాదేవిగారి కథలో పాత్రలు ప్రయాణించింది ఈ ఎక్స్‌ప్రెస్‌లో?(3),
20.అజీజ్‌గారి కథలో హీరోయిన్?(3),
22.మధుకర్ భారతిని ఇలా సంభోధిస్తాడు కానీ హ్రస్వంగా...(3),
25. ఇంటికి ____, పొరుక్కి శివాలక్ష్మి.కానీ అటూఇటూ అయ్యింది(4),
26. తలక్రిందలైన గంగాధర్ ఇంటిపేర్లో లేనివేం?(2),
27."అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ __నవమికి పందిరేస్తున్నా.."అరిపిరాల సత్యప్రసాద్ కథలో ఒక డైలాగు(2),
28.ముప్పైనాలుగు అడ్డమే పొట్టిగా(2),
29.పశ్చిమ దేశానికి రాజు____(4)చూడుము నిలువు 8.,
31.నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది... ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య. ఇద్దరివీ కలిపి(3),
32.స్వరహీనమైన బహుమానం రచయిత!(3),
33.ఈ కలం పేరుగల ఇద్దరి కథలు కథాజగత్‌లో ఉన్నాయి(3),
35. ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ___లై గోదాట్లో పారుతుంటాయ్(3),
36.తోక తెగిన 33నిలువు రచయిత?,
39.ఓంప్రకాశ్ కథ పేరులో చివరి రెండక్షరాలు(2).

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

కాస్త మోదం - కాస్త ఖేదం

మహమ్మారి స్వైన్‌ఫ్లూ విజృంభణ సంగతి అలా ఉంచితే మీడియాలో ఈ వ్యాధికి సంబంధించిన ప్రచారం మాత్రం విపరీతంగా ఉంది. ఏ పేపర్ చదివినా, ఏ న్యూస్ చానల్ చూసినా స్వైన్‌ఫ్లూకు చెందిన వార్తలే ఉంటున్నాయి. ఈ రోజు పేపర్లో రెండు వార్తలు ఆకట్టుకున్నాయి. మొదటిది ముద్దుల దినోత్సవం స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రేమికులకు నిరాశ పరిచింది అనే వార్త. మరొకటి ఈ వ్యాధి భయం వల్ల తిరుమలలో రద్దీ తగ్గిందనే వార్త.

ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా గురువారం 'ముద్దు' ముచ్చట తీర్చుకోవాలనుకున్న ప్రేమికులు స్వైన్ భయంతో వెనక్కు తగ్గారట! ఈ దినాల సంస్కృతి ఇటీవల బాగా పెరిగి యువతలో క్రమశిక్షణా రాహిత్యాన్ని, విచ్చలవిడి తత్వాన్ని, బరితెగింపును ప్రేరేపిస్తున్న ఈ తరుణంలో స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని ముద్దు కాస్త రద్దు కావటం చాదస్తులకు కాస్త మోదాన్ని కలిగించే విషయమే!

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనానికి విపరీతమైన రద్దీ వుండాల్సిన దసరా శెలవుల్లో రోజూ 50 వేలకు మించి భక్తులు కూడా దర్శించటానికి రావటం లేదంటే స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. తిరుమలలో స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా టి.టి.డి ముందస్తు ఏర్పాట్లు చేసినా భక్తుల్లో భయం తగ్గలేదట! ఈ స్వైన్‌ఫ్లూ ఎఫెక్ట్ వేంకటేశ్వర స్వామి పైన కూడా పడటం భక్తుల్లో కొంత ఖేదాన్ని కలిగించే విషయమేకదా!

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

ఈద్ ముబారక్!!!


రంజాన్ పండుగ సందర్భంగా ఇస్లామ్ ధర్మావలంబులందరికీ నా శుభాకాంక్షలు!!

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

దసరా బొమ్మలకొలువు!!!

దసరా పండుగ సందర్భంగా మా ఇంట్లో పెట్టిన బొమ్మలకొలువు చూడండి.










దసరా పండుగ సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
!

17, సెప్టెంబర్ 2009, గురువారం

ద్రౌపదీ భారతమ్

శ్రీమతి కొంపెల్ల లక్ష్మీసమీరజగారి కథానిక ద్రౌపదీ భారతమ్ నా కథాజగత్ బ్లాగులో ప్రకటింప బడింది. సుమారు నాలుగు నెలలు శ్రమించి వ్రాసిన ఈ కథ కథాజగత్ పాఠకుల కోసం ప్రత్యేకంగా రచించారు. ఈ కథను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

12, సెప్టెంబర్ 2009, శనివారం

నేనడిగిన సమస్య ఇంకా లైవ్‌గానే ఉందోచ్!

నేను ఏదైనా ఒక టపా రాస్తే దానిపై స్పందనలు వెల్లువెత్తుతాయని వాటితో నా బ్లాగు నిండిపోతుందనీ ఊహించుకుంటాను. కానీ ఆ టపాను చాలామంది(?) చదువుతారు కానీ కౌంటర్లు మాత్రం నేను ఆశించినంత రావు. దానితో ఆ టపాను మన బ్లాగ్మిత్రులకు ఆ టపా నచ్చలేదేమో అనిపిస్తుంది. బహుశా ఇదే అభిప్రాయం (వారి వారి టపాల విషయంలో) చాలామంది బ్లాగర్లకు ఉండిఉండవచ్చు. ఐతే ఆమధ్య నేనడిగిన ఒక పొడుపుకథ ఇప్పుడు కూడా కొన్ని బ్లాగులలో దర్శనమివ్వటం నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నది. ఆ వివరాలు....

నేను ఫిబ్రవరి 21,2009న ఈ క్రింది టపా రాశాను.

పొడుపు కథ!

మా అమ్మాయి ఏదో కావాలని అంటే వెతకడానికి పాత ట్రంకు పెట్టె తెరిచాను. అందులో అనుకోకుండా పొడుపుకథలు అనే పుస్తకం కనిపించింది. చల్లా రాధాకృష్ణ శర్మ గారు సంకలనం చేయగా పబ్లికేషన్ డివిజన్ వారు ప్రచురించారీ పుస్తకాన్ని. ఆరేడేళ్ళ క్రితం పిల్లల కోసం బుక్ ఎక్జిబిషన్‌లో కొన్నట్టున్నాను ఈ పుస్తకాన్ని. చాలా ఇంట్రెస్టింగ్‌గా చదివించిన ఈ పుస్తకాన్ని ఇంతవరకూ చదవకుండా ఎలా మిస్అయ్యానబ్బా! పొడుపు కథలూ వాటి జవాబులూ చదువుతూ ఉంటే చాలా సంతోషం వేసింది. కొన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. కానీ ఈ పొడుపు కథలు చాలా మందికి తెలిసే వుంటుందనే అనుమానం. ఈ పొడుపు కథల్లో చివరి పొడుపు కథ ఒకటి పద్య రూపంలో ఉంది. (అంటే అదొకటే పద్యరూపంలో ఉందని కాదు.180నుండి 205 సంఖ్య గల పొడుపులు పద్యాల్లో ఉన్నాయి.) ఎవరో ఒక నెరజాణ ఈ పొడుపు కథను పొడిచినట్లుంది. దీని జవాబుమాత్రం ఈ పుస్తకంలో లేదు. మీకెవరికైనా తెలిసి ఉంటే దయచేసి చెప్పండి. జవాబు నాకూ తెలియదు.
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.

కానీ ఏప్రిల్ 8 వరకూ ఎవరూ దీనిపై స్పందించ లేదు. ఊకదంపుడుగారు ఇలా కరుణించారు.

3 కౌంటర్లు:

ఊకదంపుడు చెప్పారు...
ఎవరండీ ఈ అనిలగురుడు

April 8, 2009 5:06 AM
కొడీహళ్లి మురళీ మోహన్ చెప్పారు...
ఊకదంపుడు గారూ!
ఇన్నాళ్లకు ఈ టపా వైపు ఒక్కరైనా చూసారు. సంతోషం.
అనిల గురుడు కాదండీ.
అనలుడు అగురయును అని విడదీసి చదవండి.

April 8, 2009 8:56 AM
ఊకదంపుడు చెప్పారు...
మురళి మోహన్ గారు.
మీరు ఇంకో మెలికె వేశారే..
ఐతే అనలుడి గురువు కాదా...
అగురయును అంటే - లైటు తీసుకోబడ్డది అని అర్ధమా

April 8, 2009 11:00 PM

నా సమస్యకు సమాధానం అంతటితో ఆగిపోయింది.

జులై నెలలో చింతా రామకృష్ణారావుగారు తమ ఆంధ్రామృతం బ్లాగులో చెప్పుకోండి చూద్దాం అంటూ ఈ క్రింది సమస్యనిచ్చారు.


చెప్పుకోండి చూద్దాం 1.

సమాధానం కనుక్కోండి చూద్దాం.
స్త్రీలు తమ భర్త పేరు నుచ్చరించరాదని ఒక లతాంగి తన భర్త పేరు చెప్పిన తీరు చూడండి.

చ:-
సరసిజ నేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న, యా
పరమ పతివ్రతా మణియు భావమునన్ ఘనమైన సిగ్గునన్
కరియును - రక్కసుండు - హరు కార్ముకమున్ - శర - మద్దమున్ - శుకం
బరయగ వీని లోని నడి యక్కరముల్ గణుతింప పేరగున్.


జైహింద్.

రాసింది చింతా రామకృష్ణారావు. AT WEDNESDAY, JULY 22, 2009

ఈ సమస్యకు సమాధానం ఇస్తూ జ్యోతి గారు మరొక సమస్యను ఇలా సంధించారు.



జ్యోతి చెప్పారు...
భర్త పేరు అడిగితే ఆ పత్రివ్రత సిగ్గుతో ఇలా చమత్కారంగా చెప్పింది..

కరి (ఏనుగు), రక్కసుడు, హరకార్ముకమున్ (శివధనుస్సు), శరం (బాణం), అద్దం, శుకం (చిలుక) వీటి నడుమ అక్షరాలు కలిపితే నా భర్త పేరు వస్తుంది అంటుంది. అది " రఘునాయకులు " కదా..

అంటే ..
(కరి) ద్వి ర దం - ర
(రాక్షసుదు) అ ఘు డు - ఘు
(హరకార్ముకం) పి నా కం - నా
(శరం) సా య కం - య
(అద్దం) ము కు రం - కు
(శుకం) చి లు క -లు

JULY 22, 2009 8:49 PM
చింతా రామకృష్ణారావు. చెప్పారు...
గీ:-
సాహితీ జ్ఞాన ముప్పొంగు సరస మతిరొ!
చక్కగా నిది పఠియించి ఠక్కుమని జ
వాబు వ్రాయగా నేర్చిన వనిత మణిరొ!
ధన్య వాదము జ్యోతి! విద్యా ప్రదీప్తి!

JULY 23, 2009 7:51 AM
జ్యోతి చెప్పారు...
అపారమైన తెలివితేటలుండి, పైకి అమాయకంగా ఉండే ఓ ఇల్లాలిని ఆమె భర్త పేరడిగితే ఏకంగా సవాలు విసిరింది..

విపులాక్షి ! "నీ విభు పేరేమి?" యన్నను
చాతుర్య మెసగ నా నాతిబలికె
నక్రంబు హేమంబు నగధాము పుప్పొడి
యబ్బురం బేనుగు యాజి పడవ
అన్నిటి మూడేసి అక్షరంబులు గల
మారు నామంబుల తీరు జూచి
నాధు పేరునకును నడిమ వర్ణంబులు
సరియని జెపితి నెరిగి కొనుము
యుచు నానాతి బల్కె, తా నతిశయముగ
ఇట్టి నామంబు గలవాడే యీతడనుచు
వంచనలులేక బుధులెరింగించిరేని
వారికే నాచరించెద వందనములు.

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???


JULY 23, 2009 12:13 PM
పై రెండు సమస్యలు చూసి నా ప్రశ్నకు సమాధానం దొరుకుంతుందేమో అనే ఆశ మళ్ళీ చిగురించింది. దానితో నేను ఆ టపాలో నా కామెంట్‌ను ఉంచాను ఇలా...


కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...
అచ్చంగా ఇలాంటి సమస్యనొకదానిని నా బ్లాగులో చాలా కాలం క్రితం ఉంచాను.కానీ ఇంతవరకూ సమాధానం తెలియలేదు. మీ టపాకు జ్యోతి గారి సమాధానం మరియు వారిచ్చిన మరొక సమస్య చదివాక మళ్లీ ఆ పొడుపుకథకు చెందిన లింకును ఇస్తున్నాను.

http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???

JULY 23, 2009 5:57 PM

జ్యోతి గారి సమస్యకు కంది శంకరయ్య గారు ఇలా సమాధానం చెప్పారు.

Kandi.Shankaraiah చెప్పారు...
నక్రంబు - మ(క)రి
హేమంబు - క(డా)ని
నగధాముడు - హ(రు)డు
పుప్పొడి - ర(జ)స్సు / పూ(పొ)డి
అబ్బురము - వె(ర)గు / అ(రు)దు
ఏనుగు - ఇ(భ)ము / నా(గ)ము
ఆజి - క(య్య)ము
పడవ - క(ప్ప)లి

ఆవిడ భర్త పేరు "కడారు జ(శ)రభయ్యప్ప" లేదా "కడారు పొరుగయ్యప్ప" కావచ్చు. నా అల్ప బుద్ధికి తోచింది ఇంతే. ఇందులో కొంత భాగమైనా సరిపోతే ధన్యుణ్ణి.

AUGUST 6, 2009 8:59 PM

ఊకదంపుడు గారు కంది శంకరయ్య గారిని ఇలా నా సమస్యను సాధించవలసినదిగా కోరారు.


vookadampudu చెప్పారు...
కలదు గాధ యొకటి గతమందు ఇట్టిదే
వివరమడిగి నారు విజ్ఞులొకరు
కోరెదమిము సులువు గోరంతనివ్వగా
సతిమనమునెరుగ శంకరార్య !
http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html

AUGUST 28, 2009 5:12 PM

తరువాత సెప్టెంబర్ 12వతేదీ అంటే నిన్న ఇదే సమస్యగురించి రాకెశ్వరరావుగారి అందం బ్లాగులో ఈ విధంగా చదివాను.

vookadampudu said...
కంది శంకరయ్య గారు,మీరు లయగ్రాహిని కూడా కందం చెప్పినంత తేలికగా ఆశువుగా చెప్పుతున్నారు.. సంతోషమండీ, మీ వంటి పెద్దల బ్లాగ్ప్రవేశం తో మాకు నేర్చుకోవటానికి మరింత వెసులుబాటు.
మీకోసం శ్రీ.చిం.రా.కృ.రా గారి బ్లాగులో ఓ వ్యాఖ్యనుంచాను. మీరు చూశినట్టు లేరు
http://andhraamrutham.blogspot.com/2009/07/blog-post_23.html
భవదీయుడు
ఊకదంపుడు

11:52 AM, September 11, 2009
Kandi.Shankaraiah said...
ఊకదంపుడు గారూ, తురుపుముక్కలో మీరు చెప్పిన పోస్ట్ ఎప్పుడో చూసి, రాసి పెట్టుకున్నాను. సమాధానం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నా పద్యాలు మీకు నచ్చుతున్నందుకు ధన్యుణ్ణి.

1:18 PM, September 11, 2009
Kandi.Shankaraiah said...
ఊకదంపుడు గారూ, మీరు చెప్పిన తురుపుముక్క బ్లాగులోని పద్యం ఇదే కదా...

సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు (డగురయు) నుపవనం బసియు నావ
అందు మూడేసి వర్ణంబు లమరు శబ్ద
మధ్యమాక్షరపంక్తి నా మగని పేరు.

ఇందులో రెండవ పాదం లోని బ్రాకెట్లో ఉన్న అక్షరాల విషయంలో నాకు సందేహం. అవి కరెక్టేనా?

6:17 PM, September 11, 2009
రాకేశ్వర రావు said...
శంకరయ్య గారు,
ఊకదంపుడు గారు న్మ ప్రాసతో లయగ్రాహి వ్రాద్దామనుకున్నట్టున్నారు, మీరు వారి ప్రాసాక్షరం దోచుకున్నారు :D
మా కోసం అలానే ఒక లయవిభాతి కూడా అందిస్తే సంతోషం.


సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.

7:59 PM, September 11, 2009

దీన్నిబట్టి నాకు తెలిసిందేమిటంటే నేనిచ్చిన ప్రశ్న ఊకదంపుడు, కందిశంకరయ్య, రాకేశ్వర రావు తదితర ప్రతిభాశాలుర మెదళ్ళలో ఇంకా మెదులుతోందనీ దాని సమాధానం అతిత్వరలో తెలుసుకునే అదృష్టం కలుగుతుందనీను!

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

బుడ్డా వెంగళరెడ్డి !!!

1866లో రాయలసీమలో తీవ్రమైన కాటకం వచ్చింది. ఇది ధాత నామ సంవత్సరంలో రావడంచే దీనిని ధాత కరవు అన్నారు. ఇది అనంతపురం మండలంలో వచ్చింది. ఈ కరవు కాలంలో బుడ్డా వెంగళరెడ్డి కరవు పీడితులైన ప్రజలకు మూడు నెలల పాటూ అన్న వస్త్రాలు ఇచ్చి కన్నతండ్రిలాగా కాపాడాడు. రాయలసీమలో పుట్టిన అపర దానకర్ణుడు వెంగళరెడ్డి. రాయలసీమ ప్రజలు ఇప్పటికి ఇతని దాతృత్వాన్ని గురించి చెప్పుకుంటారు. ఈ అపర దానకర్ణుని జీవిత చరిత్రను ఎంతో శ్రమకోర్చి పరిశోధించి చారిత్రకనవలా రూపంలో శ్రీ ఎస్.డి.వి.అజీజ్‌గారు నిక్షిప్తం చేయగా దానిని మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ అతి త్వరలో తమ నాల్గవ ప్రచురణగా పాఠకలోకానికి అందించనున్నది. ఆ వివరాలు అతి త్వరలో తెలియజేస్తాం!

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

పైశాచిక ఆనందం...!!!

మనుషుల నైజం వారివారి ప్రవర్తనలవల్ల తెలుస్తుంది అంటారు అది ముమ్మాటికీ నిజం.

ఒక రోజంతా అతని జాడ తెలీక మొత్తం రాష్ట్ర ప్రజలంతా టెన్షన్‌లో ఉన్న సమయమది. హెలికాప్టరు క్రాష్ ల్యాండ్ అయిందని కేంద్రం ప్రకటించింది. ఐనా ఆయన ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటారనే యావత్ ప్రజానీకం నమ్ముతూ వచ్చింది.ఆయన ఉనికి కోసం ప్రజలంతా టీవీలకు అతుక్కుని పొయారు. ఇంతలో హెలికాప్టరు శిథిలాలను కనుగొన్నట్టు అందులో ప్రయాణించిన ఐదుగురూ చనిపోయినట్టు వార్తలు. ఆ వార్తలను ఇంకా జీర్ణం చేసుకునే స్థితిలో ఎవరూ లేరు. నా హృదయంలో ఏదో వెలితి. ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, ఎన్‌టీయార్, పి.వి.నరసింహారావు లాంటి ప్రముఖుల మరణ వార్త విన్నప్పుడు కలిగిన అనుభూతే కానీ కాస్త ఎక్కువ మోతాదులో. మీడియా కవరేజి అందుకు కారణమేమో! ఇంకా అధికారికంగా మరణవార్తను ప్రకటించాల్సి వుంది.

సరిగ్గా ఆ సమయంలో నా మొబైల్ కు ఒక ఎస్.ఎం.ఎస్. వచ్చింది. అది చదవగానే ఆశ్చర్యమూ అసహ్యమూ రెండూ ఒకేసారి కలిగాయి.

ఆశ్చర్యం అంత తొందరగా స్పందించినందుకు.

అసహ్యం అందులోని విషయానికి.

మరో రెండు నిమిషాలకు అదే మెస్సేజి మరొకరు ఫార్వర్డు చేశారు!

ఇంతకీ ఆ ఎస్.ఎం.ఎస్‌లో ఉన్నది ఇది.

రోజా అబ్ ఫిర్ బాబుకే సాత్ సోజా.

ఈ మెస్సేజ్ అర్థం ఏమిటి?

అంటే అంత వరకూ రోజా వైఎస్సార్‌తో పడుకుందనా?

ఇది రోజాను అవమానించినట్టా లేక వైఎస్‌ను టార్గెట్ చేసినట్టా?

ఏదో పేద్ద జోక్ అన్నట్టు అందరికీ ఆ మెస్సేజ్‌పంపడం ఏమిటి? అదీ వైఎస్ మరణించాడని తెలిసిన కొన్ని క్షణాలకే..!?

ఆ పంపేదేదో రోజాకే పంప వచ్చుకదా? అంత గట్స్ ఉందా?

అసలు ఉద్దేశం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోతుందని కాబట్టి రోజాకు తెలుగుదేశం గూటిలోనే ఉండిపొమ్మని ఇచ్చిన సలహా కావచ్చు. కానీ అది చెప్పే విధానమూ సమయమూ సరియైనదేనా?

ఒక పక్క దుర్వార్త విని ఒక విధమైన వేదనలో ఉన్న సమయంలో ఇలాంటి కామెంట్లు చేసి రాక్షసానందం పొందే వారిని ఏమి చేయాలి?

ఆ మెస్సేజ్‌ను పంపిన ఇద్దరూ నా కొలీగ్స్ కావటం నా దురదృష్టం.

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము!

తురుపుముక్క పాఠకులకోసం ఒక క్రాస్‌వర్డ్ పజిల్. పూరించండి. మీ పూరణలు కామెంట్ల రూపంలో పంపండి. ఈ పజిల్ నా కథాజగత్ బ్లాగు ఆధారంగా నిర్మించడం జరిగింది. చాలామటుకు సమాధానాలు ఆ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది. మీ పూరణలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబరు 30. బెస్ట్ఆఫ్‌లక్!




ఆధారాలు:

అడ్డం :
1.ఏకాకి కథా రచయిత(6),
4.వింజమూరి వారి కథలో ఇంటావిడ పేరు వయసులో ఉన్నప్పుడా?(3),
6.దింపుడు కళ్ళం రచయిత కలగాపులగం అయ్యాడు (6),
10.సుందరం తన కూతుర్ని ఈ అంశంలో చాంపియన్ చేయాలని ఆశించాడు పాపం!(2),
11.దింపుడు కళ్ళం కథలో నాన్న ఇంటికి తెచ్చింది ఈవిడ్నే!(2),
12.యాడంట నీళ్ళు పొయ్యబోతే అమ్మో అయ్యో అంటూ ఒకటే ____ పెడుతుంటే. నిజంగా ఒకటే!(3),
13.వైదేహి మనుమరాలు, మానస కూతురూను (3),
15.రాబోయే ప్రమాదం నుండి ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌ను కాపాడాలని పాపం ఈ గ్యాంగ్‌మ్యాన్ తడబడ్డాడు(3),
17.సూపర్‌వైజర్‌ని చూడగానే ఈ గేట్‌మాన్ విష్ చేశాడు అటునుంచి?!(4),
21.చిన్ని చిన్ని ఆశ కథకుడు (4),
23.బుడ్డ రాకాసి తల్లి కాబట్టే తడబడింది(4),
24.అటునుంచి ఏకాకి హీరో (4),
25.కథా రచయిత ఈశ్వర్ ఇంటిపేరు?(4),
28.రాధేయ గారి కథ తడబడటంతో ఒక అక్షరానికున్న సున్న మరో అక్షరానికి తగులుకుంది(4),
30.నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు ___, తమలపాకు ___, క్యాబేజీ ___, ఉల్లి ___ ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది(3),
32.నిలువు 4.రచయిత ఈ యేడాది ___శాంతి పురస్కారం మరో రచయితతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వెనుక నుండి చదవండి(3),
34.ఆకులేని అడవి అని దీన్ని వర్ణిస్తున్నారు ఓ కథకుడు(3),
37.రాత్రుళ్లు పళ్లు పటపటలాడిస్తూ - మానస మీద __ __గా దాడి!రెండు సార్లు చెప్పనక్కర లేదు(2),
38."__ క్రాంతి!" బుగ్గలు తడిమాడు రాఘవ (2),
40. కొందరు మాత్రమే ఏపరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్లుగానే ఉంటారు. వాళ్లనే ______ అంటాం. కానీ పాపం చెల్లాచదురయ్యారు(6),
41.ఈ తిలకం పెట్టుకుంటాడో లేదో తెలియదు కాని పేరుముందు మాత్రం ఉంటుంది మన మురళీకృష్ణకి(3),
42.వానరాయుడి అసలు సిసలు పేరు?

నిలువు:
1.మృదుల తండ్రి, రాఘవకు మామయ్య కాలేక పోయాడు?(4),
2.సునీత నానిగాడి __?(2),
3.తర్వాత క్రాంతి "కమలాక్షు నర్చించు కరములు కరము.." అంటూ నెమ్మదిగా, అందులో లీనమై భక్తి,జ్ఞానాలు ప్రకాశించేట్లు చదివాడు. ఈ పదానికి పర్యాయ పదం(3),
4.అడ్డం 34 రచయితే!(3),
5.అతనికి తల నరికి మధ్యలో గుడిలేకున్నా అర్థం మారదు కానీ తలక్రిందలయ్యింది(3),
7.మానస వీణ రచయిత ఇంటిపేరు లేకుండా? ఐతే నేం?(3),
8.పడమటి దేశానికి __ హిరణ్యుడు(2),
9.మానస మానసచోరుడు?(4),
12.సోమశంకర్ కొల్లూరిని ఇలా పొట్టిగా పిలవచ్చా?(2),
14.హసీనాను సమ్మోహితురాల్ని చేసిన నర్తకి(2),
16.ఇన్నాళ్ళూ తన కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేక పోయినందుకు కొంచెం అపరాధ భావనకు లోనయ్యాడు.ఈ పదానికి పర్యాయ పదం!(2),
18.ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రక___ చేపలు!(3),
19.ఇందిరాదేవిగారి కథలో పాత్రలు ప్రయాణించింది ఈ ఎక్స్‌ప్రెస్‌లో?(3),
20.అజీజ్‌గారి కథలో హీరోయిన్?(3),
22.మధుకర్ భారతిని ఇలా సంభోధిస్తాడు కానీ హ్రస్వంగా...(3),
25. ఇంటికి ____, పొరుక్కి శివాలక్ష్మి.కానీ అటూఇటూ అయ్యింది(4),
26. తలక్రిందలైన గంగాధర్ ఇంటిపేర్లో లేనివేం?(2),
27."అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ __నవమికి పందిరేస్తున్నా.."అరిపిరాల సత్యప్రసాద్ కథలో ఒక డైలాగు(2),
28.ముప్పైనాలుగు అడ్డమే పొట్టిగా(2),
29.పశ్చిమ దేశానికి రాజు____(4),
31.నిలబడే గబగబా అన్నం తింటున్న ఈశ్వరమ్మ కోపంగా చెప్పింది... ఈశ్వరమ్మ వైపు కోపంగా చూస్తూ అన్నాడు నరసయ్య. ఇద్దరివీ కలిపి(3),
32.స్వరహీనమైన బహుమానం రచయిత!(3),
33.ఈ కలం పేరుగల ఇద్దరి కథలు కథాజగత్‌లో ఉన్నాయి(3),
35. ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ___లై గోదాట్లో పారుతుంటాయ్(3),
36.తోక తెగిన 33నిలువు రచయిత?,
39.ఓంప్రకాశ్ కథ పేరులో చివరి రెండక్షరాలు(2).

2, సెప్టెంబర్ 2009, బుధవారం

దావాద్రి

మంచికంటి రాసిన కథానిక దావాద్రి కథాజగత్ బ్లాగులో చేరింది. సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో జూన్2009 సంచికలో ప్రచురితమైన ఈ కథ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి.