...

...

8, ఏప్రిల్ 2025, మంగళవారం

గణేష్ పత్రికలో నా అనువాద కవిత!

 కర్నూలు పట్టణం నుండి వెలువడే సమగ్ర తెలుగు దినపత్రిక గణేష్‌ 8 ఏప్రిల్ 2025 సంచికలో నేను కన్నడ నుండి అనువదించిన కు.స.మధుసూదన రంగేనహళ్ళి గారి బెంగాల్ బార్ డ్యాన్సర్ ప్రచురితమయ్యింది. దానిని ఈ క్రింద చదవండి. మీ సౌలభ్యం కోసం కన్నడ మూల పాఠం కూడా ఇస్తున్నాను. 

ಬಂಗಾಳದ ಬಾರ್ ಡಾನ್ಸರ್

ಅವಳು ತನ್ನ ಸುತ್ತಲೇ 
ಸುತ್ತುತ್ತಿದ್ದಾಳೆ ಬುಗುರಿಯಂತೆ
ಸುತ್ತಣದ ಪರಿವೆಯಿರದೆ

ಯಾರೊ ಬಂದರು
ಯಾರೋ ಕೇಕೆ ಹಾಕಿದರು
ಮತ್ತಿನ್ಯಾರೋ ಕುಣಿದರು
ಅರಿವಿಲ್ಲ ಅವಳಿಗೆ

ಡಾನ್ಸ್ ಬಾರಿನಾ ವೇದಿಕೆಯ
ಹತ್ತು ಹತ್ತು ಅಳತೆಯ
ಚೌಕಾಕೃತಿಯ ಒಳಗೆ
ಕಿವಿಗಡಚಿಕ್ಕುವ ಸಂಗೀತದಬ್ಬರಕೆ
ಸುಮ್ಮನೆ ಕುಣಿಯುವುದಷ್ಟೇ ಕೆಲಸ

ನಡುನಡುವೆ ಕೇಳಿಬರುವ
ಪ್ರೇಕ್ಷಕರ ಕಿರುಚಾಟಗಳು
ಕಾಮೋದ್ರಿಕ್ತ ಕೊಳಕು 
ಮನಸುಗಳ ಕೇಕೆಗಳು

ಅರಚಾಟಗಳ ಲೆಕ್ಕಕ್ಕೆ 
ತೆಗೆದುಕೊಳ್ಳದವಳ ಏಕಾಗ್ರತೆಗೆ
ಎಂತಾ ಋಷಿಮುನಿಗಳೂ ನಾಚಬೇಕು

ಕೊಟ್ಟ ಅವಧಿ ಮುಗಿದ ಮೇಲೆ
ಕುಣಿತ ಮಣಿತಗಳಿಗೆ
ವಿರಾಮವನಿಟ್ಟು
ನೆಲದ ಮೇಲೆ ಬಿದ್ದ 
ನೋಟುಗಳನ್ನಾರಿಸಿಕೊಳ್ಳುವಾಗ ಮಾತ್ರ
ಬಂಗಾಳದ ಹಳ್ಳಿಯಲ್ಲಿರುವ
ಅಮ್ಮ ಅಪ್ಪನ ಅಕ್ಕತಂಗಿಯರ ಮುಖಗಳು
ಕಣ್ಮುಂದೆ ಕುಣಿಯುತ್ತವೆ
ಸಂಗೀತದ ಹಂಗಿರದೆ!

- ಕು.ಸ.ಮಧುಸೂದನ ರಂಗೇನಹಳ್ಳಿ


3, డిసెంబర్ 2022, శనివారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 

ఈ గ్రంథాన్ని కొనుగోలు చేయడానికి బొమ్మపై క్లిక్ చేయండి.

31, ఆగస్టు 2022, బుధవారం

సినిమా సమీక్ష నాడు - నేడు

 

[ఆ మధ్య మేము (నేనూ, నాగసూరి వేణుగోపాల్) సంకలనం చేసిన జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకం కోసం సేకరించిన విషయసామాగ్రిలో కొంత మాత్రమే ఆ పుస్తకంలో వినియోగించుకోగలిగాము. ఆ గ్రంథంలో చోటు చేసుకోని రచనలను అడపాదడపా తురుపుముక్క పాఠకులతో పంచుకొంటాను. 1990 ఆగష్టు 27వ తేదీ వెలువడిన ఆంధ్రపత్రికలో సినిమా విమర్శ నాడు- నేడు అనే పేరుతో  ప్రచురితమైన రచనను ఇక్కడ చదవండి.] 

"సాహితి" (జూలై 2)లో "బాపు రమణీయం" పుస్తక సమీక్ష చదివితిని. అందు బాపు 1950 నుండి వ్రాసిన సినిమా రివ్యూల గురించి చదివితిని. సినిమా కూడా నాటకం వలె ఒక కళ కాబట్టి, సినిమా విమర్శ, కళా విమర్శ క్రిందికి వస్తుంది. పాశ్చాత్య దేశాలలో సినిమా, నాటక విమర్శలకు గౌరవస్థానమిస్తారు. బెర్నార్డ్ షా, సంగీత నాటకాల సమీక్షకునిగానే మొదట పరిచయమయినాడు. అమెరికాలో 1940లలో జేమ్స్ ఆగీ గొప్ప సినిమా విమర్శకునిగా ప్రసిద్ధి పొందినాడు. ఈయన చార్లీ చాప్లిన్ సినిమాలమీది విమర్శ (1949) చాలా గొప్పది. ఇక మన దేశానికి వస్తే, సినిమా చరిత్ర మధ్య దశలో (అనగా 1937-50) ఉత్తమ సినిమా కళా విమర్శ వచ్చింది. "ఫిల్మిండియా" సంపాదకుడు బాబూరావు పటేల్ వ్రాసే సినిమా రివ్యూలు చాలా ప్రభావం కలిగి ఉండేవి. ఉదా: 1950లలో దేవకీ బోసు "భోనాల్ సన్యాసి కేసు" ఆధారంగా "రత్నదీప్" అనే సినిమా తీసెను. దేవకీ బోసు, ఆనాడు మన దేశంలోని శ్రేష్ఠ సినిమా దర్శకత్రయంలో ఒకడు. ఇది బాబూరావు పటేల్ నిర్ధారణే. తక్కిన ఇద్దరు శాంతారాం, బి.ఎన్.రెడ్డిలు. "రత్నదీప్" సినిమాలోని ముగింపును బాబూరావు "ఫిల్మిండియా"లో విమర్శించెను. అట్లు కాదు - ఇట్లుండవలెను (వివరాలు ఇచ్చేందుకిట స్థలం చాలదు) అప్పుడే సామంజస్యం అని వ్రాసెను. ఇది చదివిన దేవకీబోసు రిలీజయిన కాపీలను వెనక్కు రప్పించుకొని, ముగింపు భాగాన్ని మళ్లీ షూటింగు చేసి సినిమాను రిలీజు చేసెను. "రత్నదీప్"కు రాష్ట్రపతి స్వర్ణపతకం రావడం కొంచెపు సంఘటనే కానీ దర్శక విమర్శకులకుండే సయోధ్య మార్గదర్శకమని చెప్పుటే నా ఉద్దేశం. 1946-47లో ఉదయశంకర్ "కల్పన" అనే సినిమా తీసెను. అందలి ఫోటోగ్రఫీ,సంగీతం, దర్శకత్వాలు అనితరసాధ్యాలు. ఈ సినిమాను చూచిన బాబూరావు పటేలు "సినిమా దర్శకత్వాన్ని దేవకీబోసు శాంతారాములు, ఉదయశంకర్ నుండి నేర్చుకోవలసివుంటుంది" అన్నాడు. "కల్పన" బాక్సాఫీసు దగ్గర విఫలమైనా, కళా విజయస్తంభం లాగ నిల్చిపోయింది. ఆంధ్రదేశంలో 50 ఏండ్ల క్రింద "రూపవాణి", "ఢంకా" మున్నగు పత్రికలలో ఆసక్తికరమైన సినిమా విమర్శ వస్తుండేది. పోతన పాత్రకు నాగయ్యగారా లేక శ్రీరంగం నారాయణబాబుగారా ఎవరు సరిపోతారు. పోతన వేషం వైదీకిగానా లేక నియోగిగానా (సినిమాలో పోతన వైదీకిగానే కనిపిస్తాడు, కానీ పోతన కవి నియోగి కేసన మంత్రి కొడుకు) అనే చర్చలు వచ్చేవి. పోతన సినిమాలో పోతన దానధర్మాలు చేయడాన్ని శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి లాంటి వాడే విమర్శించినాడు (చూ."కథలు-గాథలు") 1937 ప్రాంతంలో వచ్చిన "బాలయోగిని" సినిమాలో ఉండే "రియలిజం" మరే చిత్రంలో ఉంది?  రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇటలీలో డిసీకా సృష్టించిన "నియోరియలిజం"ను పోలే వాస్తవికత ఆ సినిమాలో ఉంది. రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ఆత్రేయగారి "ఎన్‌జివో" నాటికలోని రియలిజం ఆ సినిమాముందు దిగదుడుపే. ఆనాటి సినిమాలైన కృష్ణలీలలు, మాలపిల్ల, మళ్లీపెళ్లి, విశ్వమోహిని, రైతుబిడ్డ, జీవన్ముక్తి, ఇల్లాలు, చెంచులక్ష్మి వంటి సినిమాలలోని బాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యొక్క మార్దవం, మాధుర్యం నేటి సినిమాలలో విన్పించదే!శాంతారాం తీసిన "సంత్ తుకారాం" సినిమాలోని ఫోటోగ్రఫీని మించినదుందా? "పడోసి"(1941) సినిమాలోని ఆనకట్ట స్ఫోటన దృశ్యం మరువగలమా? "మల్లీశ్వరి" సినిమాలో ఒక ఫొటోగ్రఫీ దోషం మూలాన దానికి రాష్ట్రపతి స్వర్ణపతకం రాలేదంటారు. ఇక సినిమా ఇతివృత్తంకు వస్తాము. బెంగాలీలు ఈశ్వరచంద్ర విద్యాసాగరునిమీద సినిమా తీసిరి. ఆ విద్యాసాగరులచే సన్మానితుడైన, కందుకూరి వీరేశలింగం ఉనికైనా తెలుసా మన సినిమా ఆర్యులకు? మనం "పథేర్ పాంచాలి"ని తెగమెచ్చు కొంటున్నామా! మనకొక సత్యజిత్‌రాయ్ లేడుకానీ విశ్వనాథవారి నవల "మాబాబు"ను సినిమాగా తీస్తే "పథేర్ పాంచాలి"ని తలదన్నగలదని నా విశ్వాసం. కిషన్‌చందర్ వ్రాసినదానిని గౌతం ఘోషే తెలుగులో తీయవలెనా? తెలుగులో "మా భూమి" (వాసిరెడ్డి, సుంకర)లేదా? ఏమి ఈ అంధానుకరణ!ఏమి ఈ ఆత్మవిశ్వాసరాహిత్యం!! మనకు నేడు సినిమా పత్రికలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అందులో సినిమా కళా విమర్శ కనబడటం లేదు. తెలుగు సినిమాకు ఇంతవరకు రాష్ట్రపతి స్వర్ణపతకం రాక పోవడానికి కారణాలను ఉత్తమ సినిమా కాంక్షులందరు వెదుకవలసిన తరుణం ఆసన్నమైంది.  

- సర్దేశాయి తిరుమలరావు