...

...

30, సెప్టెంబర్ 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 29 సమాధానాలు!


అడ్డం: 

1.  దాశరథి 'అగ్నిధార'ను తొలిసారి ప్రచురించిన నల్లగొండ జిల్లాలోని ప్రఖ్యాత సాహిత్య సంస్థ. - సాహితీ మేఖల 
3. చెరసాల, కారాగారం, జైలు! - బందిఖానా
5. సర్వసాధారణంగా తెలుగు సినిమా హీరోలకు తగిలించ తగిన రెండు విశేషణాలు :) (4,3) - ఆకతాయి, చిలిపి
7. వనం కాని వనం!. - యవ్వనం
9. మనకు తెలిసిన మీసరగండ విశ్వరూపాచారి! - విద్వాన్ విశ్వం.
10. అడ్డం9 ఆయన మీటినది! - మాణిక్యవీణ (ఆంధ్రప్రభలో నిర్వహించిన శీర్షిక)   11. తన్విని విడదీస్తే అదో తృప్తి! - తనివి 
14. అటునుంచి నైట్రోజన్! - వుయువానిజత్రన
15. అర్జునుడు అటునుంచే! - డుయుజవి
16. శృంగార జంట. తస్సాగొయ్యా వీరూ అటునుంచే! - లుథున్మమతీర
నిలువు:
1. తెలుగు సింపతీ! - సానుభూతి
2. తెలంగాణా పోరాటమార్గము అనుకోవచ్చా? - లడాయి తొవ్వ
4. మహతి. - నారదుని వీణ
5.  ప్రాణవాయువు! - ఆక్సిజన్ వాయువు
6. శ్రీరామచంద్రునిలో స్వీకరించదగిన ఉత్తమ గుణము! - పితృవాక్యపాలన
7. ఈ సిన్హాగారు విదేశీవ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఒకప్పటి భాజపా నేత! - యశ్వంత (సిన్హా)
8. ఏరోప్లేను తలక్రిందలయ్యింది. - నంమావి 
9. స్వర్ణకారుడు! - విశ్వబ్రాహ్మణుడు
12. సత్యాసత్యాలు!? - నిజానిజాలు
13. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన కావ్యం! -  విశ్వంభర 

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 29




ఆధారాలు: 
అడ్డం: 

1.  దాశరథి 'అగ్నిధార'ను తొలిసారి ప్రచురించిన నల్లగొండ జిల్లాలోని ప్రఖ్యాత సాహిత్య సంస్థ.
3. చెరసాల, కారాగారం, జైలు!
5. సర్వసాధారణంగా తెలుగు సినిమా హీరోలకు తగిలించ తగిన రెండు విశేషణాలు :) (4,3)
7. వనం కాని వనం!.
9. మనకు తెలిసిన మీసరగండ విశ్వరూపాచారి!
10. అడ్డం9 ఆయన మీటినది!
11. తన్విని విడదీస్తే అదో తృప్తి!
14. అటునుంచి నైట్రోజన్!

15. అర్జునుడు అటునుంచే!
16. శృంగార జంట. తస్సాగొయ్యా వీరూ అటునుంచే!.
నిలువు:
1. తెలుగు సింపతీ!
2. తెలంగాణా పోరాటమార్గము అనుకోవచ్చా?
4. మహతి.
5.  ప్రాణవాయువు!
6. శ్రీరామచంద్రునిలో స్వీకరించదగిన ఉత్తమ గుణము!
7. ఈ సిన్హాగారు విదేశీవ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఒకప్పటి భాజపా నేత!
8. ఏరోప్లేను తలక్రిందలయ్యింది.
9. స్వర్ణకారుడు!
12. సత్యాసత్యాలు!?
13. సింగిరెడ్డి నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన కావ్యం! 

27, సెప్టెంబర్ 2010, సోమవారం

అఫ్సర్ కథ

బయటికి అడుగుపెట్టగానే అడుక్కు తినేవాళ్ళు ఇద్దరో ముగ్గురో! ................................................................ ఒకావిడ ఒంటినిండా కప్పుకుని శరీరాన్ని కుప్పలా దగ్గరకు లాక్కుని కూర్చుని వుంది. అడుక్కుతినడానికి సిగ్గు కాబోలు. అడుక్కుతినేటప్పుడూ నా జాతికి బురఖా ఉండాలి"  అంటూ రచయిత పడుతున్న ఆవేదనలో పరమార్థం ఏమిటో కథాజగత్‌లో ప్రకటించిన ప్రముఖ కవి అఫ్సర్ గారి ప్రముఖ కథ గోరీమా చదివి తెలుసుకోండి. 

20, సెప్టెంబర్ 2010, సోమవారం

ఎ 'లిరిక్'

ప్రముఖ రచయిత్రి వి.ప్రతిమ గారి కథ ఎ 'లిరిక్' కథాజగత్‌లో ప్రకటింపబడింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. 

18, సెప్టెంబర్ 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 28


ఆధారాలు: 
అడ్డం: 
1. Human Computer అని ప్రసిద్ధికెక్కిన గణిత శాస్త్ర మాయా జాలము.
3. కాపరి శ్రమపడితే ఇండస్ట్రీ వస్తుందా?
5. వినమ్రపు మహజరు వినవిన సమయము లేదా?
7. హిమికలోనున్న తుహిరము.
9. జగపతిబాబు-ప్రియమణి-మదన్-కీరవాణిల కలయికలో వచ్చిన 2009 మూవీ!
10. లడ్లు విస్తృతరూపంలో!
11. సేద్యముచేయుటకై సహాయముగా నియ్యఁబడు సొమ్ము అని బహుజనపల్లి వారి శబ్దరత్నాకరము చెప్పుచున్నది.
14. పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిని పడవ నడుపుదాం అని పాడిన తమిళకవి.
15. ప్రభాకరుడే!
16. సర్వసంగ పరిత్యాగి అనగా సర్వమూ ________ __.
నిలువు:
1. అశరీరవాణి పలికిన విలుకాడు.
2. విషయమును గ్రహించువాడా?
4. బి.నరసింగరావు డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ట్ ఫిలిం. 1991నాటిది.
5.  ఛత్రపతి శివాజీకి గురువు!
6. ఈమధ్యే మనం జరుపుకున్నపండుగ!
7. శలభము.
8. కపిలవర్ణము కకావికలైంది.
9. ఆకాశవాణి + దూరదర్శన్ = ?
12. మెర్సీ కిల్లింగ్‌ను ఇలా తెలుగీకరించవచ్చా?
13.  రావాలి రావాలి రమ్మంటె రావాలి రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి - ఘంటశాల, జమునారాణిల డ్యూయెట్టు ఈ సినిమాలోనిదే!

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఇంజినీర్స్ డే!



భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్స్ డే గా ప్రతి యేటా సెప్టెంబరు 15న జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా యావత్తు అభియంతలకు శుభాకాంక్షలు!!! ఈ యేడాది సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజినీర్స్ అసోసియేషన్ (ఆల్ ఇండియా రైల్వే ఇంజినీర్స్ ఫెడరేషన్‌కు అనుబంధ సంస్థ) తమ హెడ్‌క్వార్టర్ సికిందరాబాదులో రైల్‌నిలయం ఆడిటోరియంలో ఇంజినీర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక సావినీరు విడుదల కానుంది. "రోల్ ఆఫ్ సబ్ఆర్డినేట్ ఇంజినీర్స్ ఇన్ సేఫ్టీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్" అనే అంశంపై ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు వీలైతే మరో టపాలో త్వరలో!

11, సెప్టెంబర్ 2010, శనివారం

శుభాకాంక్షలు!!!


వినాయక చవితి మరియు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాల సందర్భంగా తురుపుముక్క బ్లాగ్లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

Crossroadsలో కథాజగత్!

కంప్యూటర్లు మరియు అంతర్జాలానికి సంబంధించి తెలుగులో జరుగుతున్న వికాసము, పరిణామాలు మొదలైన విషయాలను ఇతర భాషల వారికి తెలియజెప్పే Crossroads లో కథాజగత్‌ను గురించి ఒక చిన్న వ్యాసం వచ్చింది. ఇక్కడ చదవండి.

మా నాన్న!

డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి కథ మానాన్న కథాజగత్‌లో ప్రకటింపబడింది. చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే త్వరలో ఈ క్రింది కథలు కథాజగత్‌లో రానున్నాయి. 1.గోరీమా - అఫ్సర్, 2.కథకుడి కథ - వి.వి.సుబ్బరాజు, 3.డామిట్ కథ అడ్డం తిరిగింది - పినిశెట్టి శ్రీనివాసరావు, 4.కలిసుందాం రా - సగ్గు రాజయ్య

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 27


ఆధారాలు: 
అడ్డం: 
1. ఏ,బి,సి,డి వర్గీకరణను కోరుతున్న ఉద్యమం.
3. కాకులు దూరనిది విరజాజి కాడలోనున్నదా?
5. కాలి బూడిద కావడం జామదగ్నికి ఇష్టమైనదేనా?
7. తిరోగమించిన కళాభినేత్రి!!!
9. తీర్థయాత్రలకు కాశీప్రయాగలతో పాటు ఇదీ ఎందుకో అని జమున అనుమానం.
10. మన్మథుని బాణము!
11. సంకరం కాదు ముంగురులు!
14. రచన తెలుగు వెండితెరకు పరిచయం అయిన సినిమా!
15. వరంగల్‌లో ఉన్న అతి పురాతన దేవాలయము ఈ దేవతదే!
16. అటునుండి శుకతరువు. సెదిరిన చెట్టు!
నిలువు:
1. ఉండవల్లికి లడ్డులాగా దొరికినది:)
2. గొల్లపూడి మారుతీరావుగారి ఒకానొక నాటిక!
4. గంగాభాగీరథీ సమానురాలు!
5.  పార్వతీ మాత ఇతడినే వివాహమాడాలని పట్టుపట్టి తండ్రి హిమవంతుడి అనుజ్ఞ తీసుకుని తపస్సుకు దిగింది. .
6. గిన్నీసు పుస్తకానికెక్కిన ఈ చెట్టు మా అనంతపురం జిల్లాలోనిదే!
7. పై స్థాయిలోనివారు కింది స్థాయిలోనివారికి పంపే ఫర్మానా!
8. మర్కటము!
9. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి అంటూ ఆరుద్ర కలవరించిన పాట ఈ సినిమాలోనిదే!
12. కమిట్టు చెడి విశ్వనాథ నవలగా మారింది!
13.  హీరాకుడ్ ఆనకట్ట అడ్డుకునే ఈ నది కమల్ సినిమా కాదా?

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

దేవరాజు మహారాజుగారి కథ!

డాక్టర్ దేవరాజు మహారాజు గారి కథ సోదా కథాజగత్‌ లో ప్రకటించాము. ఈ కథపై పాలపిట్ట మాసపత్రిక ఆగస్టు నెల సంచికలో వచ్చిన సగ్గురాజయ్యగారి అభిప్రాయం ఇక్కడ చదవండి. 

ఆనందింపజేసిన 'సోదా '
పోలీసు అంటే రాజ ప్రతినిధి. రాజుగారి చేత ఏర్పడిన చట్టాలను రక్షించేవాడు. అన్యాయం జరిగినప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకునేవాడు. కాని ఈ కాలంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పే కథ సోదా . నా లండన్‌కోటు కథల పుస్తకంలో 'దొంగ ఎవరు?' అనే నాటిక ఉంది. అది అపరాధ పరిశోధక ఇతివృత్తం. దానిలో దొంగను పట్టుకోడానికి పోలీసులు చేసే ప్రయత్నాలలో భాగంగా వాడిన తెలంగాణ పోలిసు భాష అతి స్వల్పము. డా.దేవరాజు మహారాజు తన కథ 'సోదా 'లో వాడిన భాషను చదివి, అమితానందభరితుడనైయ్యాను. ఎంత చక్కగా సందర్భాలను వివరిస్తూ రాశారో. వారికి భాష మీద, భావం మీద ఎంత అవగాహన ఉందో సోదా కథ చదివిన వారికి అవగతమౌతుంది. దేవరాజు మహారాజు కథలు అన్నీ బావున్నాయి. డా.దేవరాజు మహారాజుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. జంతుశాస్త్ర నిపుణులు. మొక్కలలో ఉండే నిమటోడ్ పరాన్న జీవులపై పరిశోధన చేశారు. వీరు చేసిన పరిశోధన వల్ల వ్యవసాయ రంగం రైతుల జీవనంలో వికాసం కలిగింది. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ప్రకటిచారు. రచయితగా మహారాజుగారి పరిధి విస్తృతమైనది. మానవ నైజాన్ని సుతిమెత్తగా ఎత్తి చూపిన వ్యంగ్య రచనలు మనిషి 'కత'లూ ఉన్నాయి.
- సగ్గు రాజయ్య, సికింద్రాబాద్.

గురుభ్యోన్నమః


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!!!

మా ప్రచురణ బుడ్డా వెంగళరెడ్డి పై ఈరోజు వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో పుస్తక సమీక్ష వచ్చింది. అది ఇక్కడ చదవండి.


3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వివాదంలో బుడ్డా వెంగళరెడ్డి!

అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ పక్షాన మేము ప్రకటించిన బుడ్డావెంగళరెడ్డి చారిత్రక నవల వివాదంలో చిక్కుకుంది. తన లిఖిత పూర్వకమైన అనుమతి లేకుండానే ఈ పుస్తకాన్ని మరొకరు ప్రచురించారని రచయిత శ్రీ ఎస్.డి.వి.అజీజ్ ఆరోపిస్తున్నారు. వివరాలు ఈ క్రింది వార్తాంశంలో చూడండి.




ఏదిఏమైనా ఇలా రచయిత అనుమతిగాని (లిఖితమైన అనుమతి లేదని రచయిత అంటున్నారు అంటే మౌఖికమైన అంగీకారం ఉందేమో!) మొదటి ప్రచురణకర్తలైన మాకు తగిన సమాచారం గాని లేకుండా ప్రచురించడం ఎంత వరకు సమంజసం? అన్ని హక్కులు రచయితవే అయినప్పటికినీ మొదటి ముద్రణ ప్రతులు పూర్తిగా అమ్ముడు పోకముందే రెండవ ముద్రణకు వేరే ప్రచురణ కర్తకు అనుమతి ఇవ్వడాన్ని కూడా (మౌఖికంగా ఇచ్చారనే మేం భావిస్తున్నాం) మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలు సాహిత్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీనిపై సాహిత్యాభిమానుల నుండి స్పందనలను, సూచనలను తురుపుముక్క ఆహ్వానిస్తున్నది.

1, సెప్టెంబర్ 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 26

బ్లాగ్మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!








ఆధారాలు: 
అడ్డం: 
1. హాస్యదర్బార్ బ్లాగరుదే ఈ బ్లాగు. అక్షరాభ్యాసానికి ఇవి అవసరమేనా?
3. కోవెల సుప్రసన్నాచార్య రచించిన కావ్యము. నల్లవావిలి. కుడినుంచి ఎడమకు.
5. నిండినది!
7. ప్రతివాద భయంకర శ్రీనివాస్‌గారిలో దాగున్న టాలెంట్!
9. చిన్నయసూరి గారి పంచతంత్రంలోని కపట శిష్యుడు.
10. రా అని పిలవవోయ్!
11. ప్రామీత్సము!
14. విజయచందర్ కరుణామయుడు దీనికి ఒక చక్కని తిరగబడిన ఉదాహరణ! 
15. శ్రీదేవి పాడిన పాట ఈ సినిమాలో వుంది.
16. నిరుపయోగము.
నిలువు:
1. యండమూరి వ్రాసిన ఈ నవలకు దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల పేరడీ ఏమాత్రం కాదు సుమా!!
2. పంచ కట్టిన పచ్చీసు!
4. రచన పత్రిక సంపాదకులు సాక్షాత్తు విష్ణుమూర్తియే!
5.  నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. ఇది శుక్రగ్రహ నక్షత్రమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
6. థియోసాఫికల్ సొసైటీ వారి తెలుగు పత్రిక 1910లో ప్రారంభమయ్యింది!
7. ఖండిత, పక్షి సంకలనాల కథారచయిత్రి!
8. విడిపోయిన భార్య పోషణ కోసం భర్త చెల్లించవలసిది అడ్డము 7,11లలో దాగింది!
9. ఈ మధ్య రాజకీయాల్లో చేస్తున్న బ్లాక్‌మెయిల్. అర్థంలేని దీక్ష!
12. జంట నగరాలలో నాటక కళా ప్రోత్సాహానికి నడుం బిగించిన ప్రముఖ రంగస్థల నాటక సంస్థ. మధ్యలో పూర్ణానుస్వారాన్ని కోల్పోయింది.
13.  అడ్డము 16లోని దూరము.