కొల్లూరి సోమశంకర్ కథల సంపుటి దేవుడికి సాయంపై నా సమీక్ష సంచిక డైనమిక్ వెబ్ పత్రికలో ప్రచురింపబడింది.
కొల్లూరి సోమశంకర్ ఈ ఏడాది మొదట్లో వెలువరించిన కథల సంపుటి "దేవుడికి సాయం" పాఠకులను ఆకట్టుకుంటుంది. దీనిలో 16 కథలున్నాయి. మన చుట్టూ కనిపించే సమాజం ఇతని కథలలోని ముడిసరుకు.
ఈ కథలలో 8 కథలు ఆత్మాశ్రయపద్ధతిలో ప్రథమపురుషలో నడుస్తాయి. కొల్లూరి సోమశంకర్ కథలలో మనకు నిరాడంబరత కనిపిస్తుంది. పాత్రలు సాత్వికంగా ఉంటాయి. ఆదర్శాలను వల్లెవేసేవిగా కాకుండా వాటిని ఆచరించేవిగా ఉంటాయి ఇతని కథలలోని పాత్రలు. ఇతని కథలకు చకచకా చదివించే గుణం ఉంది. ఇతని కథలన్నీ ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా పాఠకులకు తెలియజేస్తాయి.
ఎదుటి వాడికి సహాయం చేసే అవకాశం లభించినప్పుడు అతడు బిచ్చగాడైనా, భగవంతుడైనా ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అని ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన కథ వివరిస్తుంది. బాహ్యసౌందర్యం కంటే మానసిక సౌందర్యం ముఖ్యమని ఒక కథ చాటితే, అందానికి సరియైన నిర్వచనం దయ, నిస్వార్థం, త్యాగం అని ఒక కథ, బాహ్య స్వరూపాన్ని బట్టి మనుష్యులను అంచనా వేయడం తప్పు మరో కథ తెలియజేస్తాయి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని ఒక కథ తెలిపితే, మరొక కథలో కలిసి కూర్చుని మాట్లాడడం ద్వారా అనేక అపోహలు తొలగి పోతాయని తెలుస్తుంది. హస్తకళలు, కుటీరపరిశ్రమలను ప్రోత్సాహించాల్సిన అవసరాన్ని ఒక కథ చెబితే, మన భారతీయ సమాజంలో అడుగంటిన కుటుంబ విలువలు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని మరో కథ చాటుతుంది.
ఈ సమీక్ష పూర్తి పాఠ్యం చదవాలంటే ఇక్కడ నొక్కండి.