...
9, సెప్టెంబర్ 2010, గురువారం
7, సెప్టెంబర్ 2010, మంగళవారం
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 27

ఆధారాలు:
అడ్డం:
1. ఏ,బి,సి,డి వర్గీకరణను కోరుతున్న ఉద్యమం.
3. కాకులు దూరనిది విరజాజి కాడలోనున్నదా?
5. కాలి బూడిద కావడం జామదగ్నికి ఇష్టమైనదేనా?
7. తిరోగమించిన కళాభినేత్రి!!!
9. తీర్థయాత్రలకు కాశీప్రయాగలతో పాటు ఇదీ ఎందుకో అని జమున అనుమానం.
10. మన్మథుని బాణము!
11. సంకరం కాదు ముంగురులు!
14. రచన తెలుగు వెండితెరకు పరిచయం అయిన సినిమా!
15. వరంగల్‌లో ఉన్న అతి పురాతన దేవాలయము ఈ దేవతదే!
16. అటునుండి శుకతరువు. సెదిరిన చెట్టు!
నిలువు:
1. ఉండవల్లికి లడ్డులాగా దొరికినది:)
2. గొల్లపూడి మారుతీరావుగారి ఒకానొక నాటిక!
4. గంగాభాగీరథీ సమానురాలు!
5. పార్వతీ మాత ఇతడినే వివాహమాడాలని పట్టుపట్టి తండ్రి హిమవంతుడి అనుజ్ఞ తీసుకుని తపస్సుకు దిగింది. .
6. గిన్నీసు పుస్తకానికెక్కిన ఈ చెట్టు మా అనంతపురం జిల్లాలోనిదే!
7. పై స్థాయిలోనివారు కింది స్థాయిలోనివారికి పంపే ఫర్మానా!
8. మర్కటము!
9. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి అంటూ ఆరుద్ర కలవరించిన పాట ఈ సినిమాలోనిదే!
12. కమిట్టు చెడి విశ్వనాథ నవలగా మారింది!
13. హీరాకుడ్ ఆనకట్ట అడ్డుకునే ఈ నది కమల్ సినిమా కాదా?
Labels:
క్రాస్‌వర్డు పజిల్,
పజిల్
5, సెప్టెంబర్ 2010, ఆదివారం
దేవరాజు మహారాజుగారి కథ!
డాక్టర్ దేవరాజు మహారాజు గారి కథ సోదా కథాజగత్ లో ప్రకటించాము. ఈ కథపై పాలపిట్ట మాసపత్రిక ఆగస్టు నెల సంచికలో వచ్చిన సగ్గురాజయ్యగారి అభిప్రాయం ఇక్కడ చదవండి.
ఆనందింపజేసిన 'సోదా '
పోలీసు అంటే రాజ ప్రతినిధి. రాజుగారి చేత ఏర్పడిన చట్టాలను రక్షించేవాడు. అన్యాయం జరిగినప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకునేవాడు. కాని ఈ కాలంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పే కథ సోదా .
నా లండన్‌కోటు కథల పుస్తకంలో 'దొంగ ఎవరు?' అనే నాటిక ఉంది. అది అపరాధ పరిశోధక ఇతివృత్తం. దానిలో దొంగను పట్టుకోడానికి పోలీసులు చేసే ప్రయత్నాలలో భాగంగా వాడిన తెలంగాణ పోలిసు భాష అతి స్వల్పము. డా.దేవరాజు మహారాజు తన కథ 'సోదా 'లో వాడిన భాషను చదివి, అమితానందభరితుడనైయ్యాను. ఎంత చక్కగా సందర్భాలను వివరిస్తూ రాశారో. వారికి భాష మీద, భావం మీద ఎంత అవగాహన ఉందో సోదా కథ చదివిన వారికి అవగతమౌతుంది. దేవరాజు మహారాజు కథలు అన్నీ బావున్నాయి. డా.దేవరాజు మహారాజుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. జంతుశాస్త్ర నిపుణులు. మొక్కలలో ఉండే నిమటోడ్ పరాన్న జీవులపై పరిశోధన చేశారు. వీరు చేసిన పరిశోధన వల్ల వ్యవసాయ రంగం రైతుల జీవనంలో వికాసం కలిగింది. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ప్రకటిచారు. రచయితగా మహారాజుగారి పరిధి విస్తృతమైనది. మానవ నైజాన్ని సుతిమెత్తగా ఎత్తి చూపిన వ్యంగ్య రచనలు మనిషి 'కత'లూ ఉన్నాయి.
- సగ్గు రాజయ్య, సికింద్రాబాద్.
Labels:
katha jagat
గురుభ్యోన్నమః
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!!!
మా ప్రచురణ బుడ్డా వెంగళరెడ్డి పై ఈరోజు వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో పుస్తక సమీక్ష వచ్చింది. అది ఇక్కడ చదవండి.
3, సెప్టెంబర్ 2010, శుక్రవారం
వివాదంలో బుడ్డా వెంగళరెడ్డి!
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ పక్షాన మేము ప్రకటించిన బుడ్డావెంగళరెడ్డి చారిత్రక నవల వివాదంలో చిక్కుకుంది. తన లిఖిత పూర్వకమైన అనుమతి లేకుండానే ఈ పుస్తకాన్ని మరొకరు ప్రచురించారని రచయిత శ్రీ ఎస్.డి.వి.అజీజ్ ఆరోపిస్తున్నారు. వివరాలు ఈ క్రింది వార్తాంశంలో చూడండి.
ఏదిఏమైనా ఇలా రచయిత అనుమతిగాని (లిఖితమైన అనుమతి లేదని రచయిత అంటున్నారు అంటే మౌఖికమైన అంగీకారం ఉందేమో!) మొదటి ప్రచురణకర్తలైన మాకు తగిన సమాచారం గాని లేకుండా ప్రచురించడం ఎంత వరకు సమంజసం? అన్ని హక్కులు రచయితవే అయినప్పటికినీ మొదటి ముద్రణ ప్రతులు పూర్తిగా అమ్ముడు పోకముందే రెండవ ముద్రణకు వేరే ప్రచురణ కర్తకు అనుమతి ఇవ్వడాన్ని కూడా (మౌఖికంగా ఇచ్చారనే మేం భావిస్తున్నాం) మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలు సాహిత్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీనిపై సాహిత్యాభిమానుల నుండి స్పందనలను, సూచనలను తురుపుముక్క ఆహ్వానిస్తున్నది.
Labels:
Budda Vengala Reddy
2, సెప్టెంబర్ 2010, గురువారం
1, సెప్టెంబర్ 2010, బుధవారం
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 26
బ్లాగ్మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

ఆధారాలు:
అడ్డం:
1. హాస్యదర్బార్ బ్లాగరుదే ఈ బ్లాగు. అక్షరాభ్యాసానికి ఇవి అవసరమేనా?
3. కోవెల సుప్రసన్నాచార్య రచించిన కావ్యము. నల్లవావిలి. కుడినుంచి ఎడమకు.
5. నిండినది!
7. ప్రతివాద భయంకర శ్రీనివాస్‌గారిలో దాగున్న టాలెంట్!
9. చిన్నయసూరి గారి పంచతంత్రంలోని కపట శిష్యుడు.
10. రా అని పిలవవోయ్!
11. ప్రామీత్సము!
14. విజయచందర్ కరుణామయుడు దీనికి ఒక చక్కని తిరగబడిన ఉదాహరణ!
15. శ్రీదేవి పాడిన పాట ఈ సినిమాలో వుంది.
16. నిరుపయోగము.
నిలువు:
1. యండమూరి వ్రాసిన ఈ నవలకు దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల పేరడీ ఏమాత్రం కాదు సుమా!!
2. పంచ కట్టిన పచ్చీసు!
4. రచన పత్రిక సంపాదకులు సాక్షాత్తు విష్ణుమూర్తియే!
5. నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. ఇది శుక్రగ్రహ నక్షత్రమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
6. థియోసాఫికల్ సొసైటీ వారి తెలుగు పత్రిక 1910లో ప్రారంభమయ్యింది!
7. ఖండిత, పక్షి సంకలనాల కథారచయిత్రి!
8. విడిపోయిన భార్య పోషణ కోసం భర్త చెల్లించవలసిది అడ్డము 7,11లలో దాగింది!
9. ఈ మధ్య రాజకీయాల్లో చేస్తున్న బ్లాక్‌మెయిల్. అర్థంలేని దీక్ష!
12. జంట నగరాలలో నాటక కళా ప్రోత్సాహానికి నడుం బిగించిన ప్రముఖ రంగస్థల నాటక సంస్థ. మధ్యలో పూర్ణానుస్వారాన్ని కోల్పోయింది.
13. అడ్డము 16లోని దూరము.
Labels:
క్రాస్‌వర్డు పజిల్,
పజిల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





