గురజాడ శోభాపేరిందేవి గారి డైరెక్టు కథ (అంటే ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడని కథ) అభినందన కథాజగత్‌లో చదివి ఆనందించండి. మీ అభిప్రాయం చెప్పండి.
...
30, జులై 2011, శనివారం
29, జులై 2011, శుక్రవారం
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -46
ఆధారాలు :
అడ్డం: 1. పసిపాపలా నిదురపో
బంగారు తల్లిగా అంటూ మనల్ని జోకొడుతున్న ఘంటశాల దానికోసం ఇది చేస్తానంటున్నాడు. (3,3,3)
6. దేనికోసం చిన్నోడా
వెదుకుతున్నావ్? బ్యాగుకోసమేనా? (2)
7. మాతృదేశం సరి అక్షరాలు
తీస్తే మీదేం కాదు (2)
9. ఇగురు (2)
10. పావగడలో
లభ్యమయ్యే తిండి (2)
12. సినిమాకో, నాటకానికో మార్గ నిర్దేశం చేసేవాడు (4)
13.
'లోపాయకారి' వ్యవహారం కాబట్టే మధ్య
అక్షరం మాయమై రివర్సయ్యింది. (4)
14. కృష్ణసారము అంటే పిలక సరిచేస్తావేం? (3)
16. అడ్డం 10 ఉన్న హిమాలయ పర్వతం (5)
17.
మంత్రనటి
తరువాయి చిత్రం ఆమె పేరుతో కలగలిసి చెల్లాచెదురయ్యింది (5)
18. శివుడే లోకేశ్వరుడు కదా? (3)
20.
హనుమంతుడే
(4)
23.
బిడియము
(4)
25.
వితంతువు
చివరి అక్షరం లుప్తం. (2)
26. రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఇంటిపేరు (2)
27.
మొద్దు, స్థాణువు అపసవ్య దిశలో (2)
29.
అడ్డం
9కి వ్యతిరేకం. గ్రామం
(2)
30.
తిరుమల
రామచంద్రగారి స్వీయ చారిత్రాత్మక కథనం (2, 2, 3, 2)
నిలువు :
1. నీరు నిలవ ఉంటే పట్టేది అడపా చిరంజీవికి తెలుసు (2)
2. తర్కశాస్త్రము తెలిసినవాఁడు.
(4)
3. ఎన్.టీ.ఆర్ నటించిన 1953నాటి చిత్రం తలక్రిందలుగా. వెఱ్ఱి
వెంగళప్ప, తిక్కశంకరయ్య లాంటిదే
(5)
4. తుమ్మల శిరీష్ కుమార్‌గారి
బ్లాగు. (4)
5. ఆల్ఫా బీటాల సరసన
ఉండేది. (2)
6. ఎడిటోరియల్ బోర్డు
మెంబరు (4, 2, 3)
8. టి.కృష్ణ దర్శకత్వంలో
వచ్చిన సినిమాల్లో ఒకటి (3, 3, 3)
9. సిరా (2)
11. తొడిమ తలక్రిందలుగా. (2)
14. వికల లో ఉన్నవి (3)
15. నవాబ్ పటౌడి భార్యామణి శీర్షాసనం వేసింది (3)
19. ఇప్పుడు నడిచే కల్పము పేరు _ _ _ _ _ కల్పం. (5)
21. పైరవిలో ప్రభాకరుడు (2)
22. అర్జునుడి పేర్లలో ఒకటి కలగాపులగం అయ్యింది. (4)
23. అషామాషీ వంటిదే (4)
24. పన్నగము ఇది పడుతుందని
ఒక అపప్రథ. (2)
28. మద మాత్సర్యాల తోడిది (2)
29. పొట్టు (2)
28, జులై 2011, గురువారం
25, జులై 2011, సోమవారం
24, జులై 2011, ఆదివారం
ఆంధ్ర నాటక మణి మాణిక్యాలు ధర్మవరం – కోలాచలం
సాహిత్య రంగంలో గాని,
సాంస్కృతిక రంగంలో గాని ఆ మాటకు వస్తే మరే రంగంలో గాని సమ
ఉజ్జీలయిన వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు
కనిపిస్తాయి. ఆయా రంగాలకు విశేషమైన
ప్రాచుర్యం కలుగుతుంది. ఈ విషయం నిరూపించే తార్కాణాలు మనకు చరిత్రలో ఎన్నో
కనిపిస్తాయి. ఈ వ్యాసంలో అటువంటి ఇద్దరు మహానుభావుల వలన ఆంధ్ర నాటక రంగానికి
లభించిన కీర్తి ప్రతిష్ఠలు మనం గమనించవచ్చు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853 - 1912), కోలాచలం శ్రీనివాసరావు(1854 - 1919) వీరిరువురి మధ్య చాలా సారూప్యవిబేధాలు వున్నాయి. ఇరువురూ నాటక రంగంలో ఉద్దండులే. వీరిద్దరూ నాటకాలు
వ్రాసినవారే. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగు కన్నడ ఆంగ్లభాషలలో సుమారు 31 నాటకాలు వ్రాశారు. కోలాచలం వారు కూడా దాదాపు 32కి పైగా నాటకాలు, ప్రహసనాలు రచించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు పౌరాణిక, చారిత్రక నాటకాలు వ్రాస్తే, కోలాచలం మొదట్లో సాంఘిక నాటకాలు వ్రాసినా తరువాత చారిత్రక పౌరాణిక నాటకాలు
వ్రాశారు. ఇరువురూ దర్శకులు ప్రయోక్తలు కూడా. ఒకరు ఆంధ్రనాటక పితామహులుగా
పేరునొందితే మరొకరు ఆంధ్ర చరిత్ర నాటక పితామహులుగా ప్రసిద్ధి చెందినారు.
ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు మంచి నటులు. వీరి నాటకములలో ప్రధానపాత్రలను
వీరే పోషించేవారు. వీరు దశరథ, బాహుక, రాజరాజనరేంద్ర, చిరాకారి, అజామిళ పాత్రలు అభినయించటంలో దిట్ట. సంగీతంలో
కూడా వీరికి ప్రవేశం వుంది. పాటలకు పద్యాలకు వీరే రాగాలు నిర్ణయించేవారు.
శ్రావ్యంగా పద్యాలను పాటలను అభినయం చెడకుండా ఆలపించేవారు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు మొదలైన రాగాలంటే వీరికి ప్రీతి.
ఇక కోలాచలం శ్రీనివాసరావుగారు నటించిన దాఖలాలు లేవు. అయితే వీరిరువురి నాటకాల
మూలంగా తెలుగుజాతికి ఒక అద్భుతమైన నటుడు లభ్యమయ్యాడు. అతనే బళ్ళారి రాఘవ.
కోలాచలంవారి రామరాజు (విజయనగరపతనం అని మరోపేరు) నాటకంలో పఠాను, సునందిని నాటకంలో దుష్టబుద్ధి, సుల్తానా చాంద్ బీబీ నాటకంలో ఉస్మాన్ ఖాన్, భారత ధర్మ యుద్ధములో దుర్యోధన, హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రలు బళ్ళారి రాఘవకు ఎనలేని
కీర్తిని తెచ్చిపెట్టాయి. రామకృష్ణమాచార్యులు
వ్రాసిన సారంగధర నాటకంలో నాయకపాత్ర సారంగధరుడు, పాదుకాపట్టాభిషేకంలో దశరథుడు, ప్రమీళార్జునీయంలో
అర్జునుడు, చిత్రనళీయములో నలుడు, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రుడు, విరాటపర్వములో కీచకుడు, సావిత్రి నాటకంలో యముని పాత్ర మొదలైనవి బళ్ళారి రాఘవను ఉత్తమ నటునిగా
నిలబెట్టాయి.
ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు సంస్కృత నాటక లక్షణాలను, పార్సీ, ఆంగ్ల నాటక
లక్షణాలను కలిపి కొత్తపద్ధతిలో నాటకాలు వ్రాశారు. సంస్కృత నాటకాలలోని పద్యాలను, ఇంగ్లీషు నాటకాలలోని అంకాలు - రంగాలు, పార్సీ
నాటకాలలోని పాటలు మొదలైన వాటిని మేళవించి తెలుగు నాటక రంగంలో కొత్త ఒరవడిని
తెచ్చారు. తెలుగు నాటకాలలో రాగయుక్తంగా పద్యాలు, పాటలు పాడటం ప్రవేశపెట్టింది ధర్మవరం వారే.
రామకృష్ణమాచార్యుల నాటకాలు ఎక్కువగా విషాదాంతాలే.
కోలాచలం శ్రీనివాసరావుగారు తమ నాటకాలలో దీర్ఘ స్వగతాలు ప్రవేశ పెట్టారు. వీరి
నాటకాలపై షేక్స్‌పియర్ నాటకాల ప్రభావం వుంది. కోలాచలం వారికి ఎక్కువ పేరు
తెచ్చిపెట్టింది 'ప్రపంచ నాటక చరిత్ర' అనే నాట్య శాస్త్ర గ్రంథం.
ధర్మవరం వారు తమ నాటకాలను ప్రదర్శించటానికి సరసవినోదినీ సభ అనే సంస్థను
నెలకొల్పితే కోలాచలం వారు సుమనోరమ సభను నెలకొల్పారు. ఆ కాలంలో బళ్ళారిలో నాటకాలను ప్రదర్శించటానికి పక్కా
నాటకశాలలు లేవు. శ్రీనివాసరావు గారు ఈ లోటును భర్తీ చేయడానికి 'వాణీవిలాస నాటకశాల'ను నిర్మించి బాలగంగాధర తిలక్ చేత ప్రారంభింపచేశారు. దీనికి పోటీగా ‘రామకృష్ణ విలాస్’ అనే నాటకశాల ప్రారంభించబడింది.
వీరి తదనందరం ఈ నాటకశాలలు ప్రభాత్ సినిమా, స్టార్ సినిమా అనే పేర్లతో సినిమా థియేటర్లుగా రూపాంతరం చెందాయి.
వృత్తిపరంగా కూడా ధర్మవరం కోలాచలం ఇద్దరూ న్యాయవాదులే. వీరిరువురి కార్యస్థానం
బళ్ళారి. వీరి గురించి కల్లూరు అహోబలరావు గారు తమ రాయలసీమ రచయితల చరిత్రలో ఇలా
పేర్కొంటారు. "ఆంధ్ర నాటక పితామహులు, ఆంధ్ర చరితనాటక పితామహులు
వీరిద్దరి వలన యాంధ్రనాటక కళ తన జీవితమును మూడు పూవు లారు కాయలు గావించుకొన్నది. ఈ
కవిద్వయము నాటక కళాభివృద్ధికి పాటు పడుటకు, భాషా సేవ చేయుటకు రంగస్థలమైన
బళ్ళారి పుర మెంతయు ధన్యమైనది."
(సాహితీకిరణం మాసపత్రిక రంగస్థల ప్రత్యేక సంచికలో ప్రచురితం)
23, జులై 2011, శనివారం
'మాట'లయుద్ధం ముగిసిన వేళ
దాట్ల లలిత గారి 'మాట'లయుద్ధం ముగిసిన వేళ కథానిక కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
22, జులై 2011, శుక్రవారం
ఒంటరి పక్షి - మబ్బుతునక
నవులూరి వెంకటేశ్వర రావు గారి కథ మిథ్యాబింబాలు కథాజగత్‌లో చదవండి. ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి.
Labels:
katha jagat
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




