...
23, జూన్ 2013, ఆదివారం
21, జూన్ 2013, శుక్రవారం
17, జూన్ 2013, సోమవారం
ఆవిష్కరణ సభ విశేషాలు!
'స్పందన' అనంతకవుల వేదిక ఆధ్వర్యంలో అనంతపురం ఎన్.జీ.వో.హోమ్‌లో నిన్న అంటే 16 జూన్ 2013 తేదీ 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సభ జరిగింది. తైలసాంకేతిక పరిశోధనాసంస్థ పూర్వ సంచాలకులు శ్రీ అజీముద్దీన్ గ్రంథావిష్కరణ గావించారు. స్పందన అధ్యక్షులు శ్రీ టి.రాజారామ్ సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేష్ నారాయణ, శ్రీ సింగమనేని నారాయణ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ఇంకా శ్రీయుతులు చంధ్రశేఖర శాస్త్రి, ఏలూరి యంగన్న, బండి నారాయణ స్వామి, జయసుమన్ తదితరులు సర్దేశాయి తిరుమలరావుగారితో తమ అనుబంధాన్ని వివరించారు. సంపాదకుల తరఫున డా.నాగసూరి వేణుగోపాల్ తమ స్పందనను తెలియజేశారు. ఈ సభకు అనంతపురంలోని ప్రముఖ సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, తిరుమలరావుగారితో పరిచయం ఉన్నవారూ పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో శ్రీయుతులు కైపనాగరాజ, ఆర్.శేషశాస్త్రి, గొల్లాపిన్ని శేషాచలం, శాంతినారాయణ, ఉద్దండం చంద్రశేఖర్, అంకే శ్రీనివాస్, మధురశ్రీ,ఆకుల రఘురామయ్య, అమళ్లదిన్నె వెంకటరమణప్రసాద్, జి.రామకృష్ణ, ఎన్.బి.ఎల్.ప్రసాద్, ఓ.ఎస్.రామచంద్రయ్య ప్రభృతులు ఉన్నారు. 'బ్లాగాడిస్తా' రవి ఈ సభకు హాజరు కావడం ఒక విశేషం. ఈ సభ తాలూకు ఫోటోలు, పత్రికలలో వచ్చిన వార్తాంశాలు ఇక్కడ చూడవచ్చు.
ఆంధ్రజ్యోతి
ఈనాడు
![]() |
| ఆంధ్రభూమి |
Labels:
SDTR
31, మే 2013, శుక్రవారం
సర్దేశాయి తిరుమలరావు పుస్తకం వెలువడింది!
డా. నాగసూరి వేణుగోపాల్
మరియు నా సంపాదకత్వంలో రెండవ పుస్తకం "జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు" వెలువడింది. సాహితీవిరూపాక్షుడువిద్వాన్ విశ్వం మాదిరిగానే ఈ పుస్తకంలో కూడా సర్దేశాయి తిరుమలరావుగారి ఎంపికచేసిన
రచనలను (అంటే విమర్శలను, వ్యాసాలను, లేఖలను, నాటికలను, ఒక కథను) కొన్నింటిని,
వాటితో పాటు తిరుమలరావుగారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, రచనలను పరిచయం చేసే
వ్యాసాలను, ఇంటర్‌వ్యూను పొందుపరిచాము. భారతిలో సర్దేశాయి చేసిన రచనల జాబితా,
తైలసాంకేతికరంగంలో వారి కృషిని తెలియజేసే పరిశోధనాపత్రాల జాబితా, వారి చేతిరాతను చూపేందుకు
ఒక లేఖ, వారు సంపాదించిన అవార్డులు - రివార్డులు, కొన్ని ఫోటోలు అనుబంధంలో
చేర్చాము. 264 పేజీలున్న ఈ పుస్తకం ధర రూ 150/-గా నిర్ణయించాము. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో ఈ పుస్తకం లభ్యమవుతోంది. e- బుక్ మరియు
ప్రింటెడ్ పుస్తకం కినిగెలో కూడా లభ్యమవుతోంది. ఈ పుస్తకం కొని
చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.
Labels:
SDTR
28, మే 2013, మంగళవారం
17, మే 2013, శుక్రవారం
10, మే 2013, శుక్రవారం
ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడు!
శ్రీరంగం శ్రీనివాసరావు
విశ్వనాథ సత్యనారాయణ
గంటి శ్రీరామమూర్తి
తిరుమల రామచంద్ర
ఆర్.యస్.సుదర్శనం
జి.సత్యనారాయణ
వడలి మందేశ్వరరావు
పులిచర్ల సాంబశివరావు
డా.మురళీధర్
గుంటూరు శేషేంద్రశర్మ
ఆవంత్స సోమసుందర్
కొత్వాలు అమరేంద్ర
ఇస్మాయిల్
నిడుదవోలు వేంకటరావు
రామాచంద్రమౌళి
డా.ఆర్వీయస్ సుందరం
సాంధ్యశ్రీ
కొలకలూరి ఇనాక్
రావి రంగారావు
విహారి
గాధిరాజు సాల్మూరు
రేకళిగ మఠం వీరయ్య
హెచ్.యస్.బ్రహ్మానంద
కాకుమాను తారానాథ్
దాశరథి కృష్ణమాచార్య
దేవులపల్లి కృష్ణశాస్త్రి
శంకరగంటి రంగాచార్యులు
ములుమూడి ప్రసాదరావు
జానగాని కాటమయ్య
విజయ దత్తాత్రేయ శర్మ
ఎస్.గంగప్ప
సూర్యదేవర రవికుమార్
రోణంకి అప్పలస్వామి
ఆదవాని హనుమంతప్ప
కపిలవాయి లింగమూర్తి
ఇవటూరి యోగదుర్గ మల్లికార్జున
బి.నరసింహులు
కొత్తపల్లి వీరభద్రరావు
పాలకోడేటి జగన్నాథరావు
కోగిర జైసీతారాం
డా.తంగిరాల వెంకట సుబ్బారావు
వేదం వేంకటరాయ శాస్త్రి
శంకరగంటి రమాకాంత్
ఆచార్య జాస్తి సూర్యనారాయణ
డా.కాపు రామాంజనేయులు
డా.మాడభూషి భావనాచార్యులు ....
ఇలా వ్రాసుకుంటూపోతే ఈ జాబితాకు అంతే ఉండదు.
పైన పేర్కొన్న వారందరికీ వున్న ఏకైక
సామ్యము వారందరూ సర్దేశాయి తిరుమలరావుగారి విమర్శకు గురి అయినవారు కావడమే. వీరి ఎవరిపైనా
తిరుమలరావు గారికి వయక్తిక ద్వేషం లేదు. పైగా కొందరంటే చాలా గౌరవం కూడా. వారివారి రచనల్లో
ఏదో ఒక అంశాన్ని సర్దేశాయిగారు అంగీకరించక పోవడమే ఘాటైన విమర్శలకు మూలం. 1972-1990
మధ్యకాలంలో భారతి మాసపత్రిక సంచికలలో కలగూరగంప శీర్షికలో వచ్చిన వాదోపవాదాలు రసవత్తరంగా
సాగాయి. ఈ చర్చోపచర్చలు చదవడానికి చాలా ఆసక్తిని కలిగిస్తాయి.
చాలా మందికి కొరుకుడు పడని ఈ విమర్శకుని గురించి తెలుసుకోవాలంటే త్వరలో మేము
వెలువరిస్తున్న జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు చదవాల్సిందే.
Labels:
SDTR
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)









