...

...

8, జులై 2013, సోమవారం

విశ్వం వెర్సస్ సర్దేశాయి




ఒకరు సాహితీ విరూపాక్షుడు. మరొకరు జ్ఞానసింధువు.
ఇద్దరూ పండితులే. మేధావులే. ఒకరితో ఇంకొకరిని పోల్చలేము.
ఎవరికి వారు గొప్పవారే. ఇద్దరూ దాదాపు సమకాలికులే. 
విద్వాన్ విశ్వం 1915 - 1987 ల మధ్యకాలంలో జీవిస్తే
సర్దేశాయి తిరుమలరావు 1928 -1994 ల మధ్య జీవించారు.
ఇద్దరూ రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురానికి సంబంధించిన వారే.
అయితే ఒకరి గురించి మరొకరు ప్రస్తావించుకున్న సందర్భాలు దాదాపు లేవు.(కనీసం నాకు తెలిసినంత వరకూ) 
విద్వాన్ విశ్వం సంస్కృత కావ్యాలను తెలుగులోనికి అనువదిస్తే
సర్దేశాయి తిరుమలరావు పాశ్చాత్య కవులను వారి కవితారీతులను మనకు పరిచయం చేస్తారు.
ఒకరు విశిష్ట సంపాదకులయితే మరొకరు విలక్షణ విమర్శకులు.
విద్వాన్ విశ్వం జర్నలిస్టుగా రూపాంతరం చెందిన రాజకీయవేత్త కాగా
సర్దేశాయి తిరుమలరావు తైల సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో ఎన్నదగిన శాస్త్రవేత్త.
అయితే వీరిద్దరికీ ఒక విషయంలో సామ్యం వున్నది. 
మహామహోపాధ్యాయ డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారి శిష్యగణంలోనివారే ఇద్దరూను.
విద్వాన్ విశ్వం 1932 నుండి చిలుకూరు నారాయణరావు గారి వద్ద సంస్కృత, వ్యాకరణ, భాషా శాస్త్రాలను అభ్యసిస్తే 
సర్దేశాయి తిరుమలరావు దత్తమండల కళాశాలలో చిలుకూరి నారాయణరావుగారివద్ద శిష్యరికం చేశారు.
విద్వాన్ విశ్వం గురువుగారికి గురుదక్షిణగా తన తొలికావ్యం విరికన్నె అంకితం ఇచ్చారు.  
కాగా సర్దేశాయి తిరుమలరావు తన గురుదక్షిణ సమర్పించుకోవడంలో సఫలీకృతులు కాలేక పోయారు. 
డా.చిలుకూరు నారాయణరావుగారు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ మొదలైన పలు భాషలలో లక్షన్నరకు పైగా సేకరించిన సామెతలను ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా వర్గీకరించే బాధ్యతను సర్దేశాయి తిరుమలరావు తన భుజస్కందాలపై వేసుకున్నారు కానీ దానిని ఏ కారణం చేతనో నెరవేర్చలేక పోయారు. అదే కనుక సాధ్యమయి ఉంటే సారస్వత రంగానికి గొప్ప నిధి లభ్యమైవుండేది.

గూడు చాలని సుఖం!

పురాణం శ్రీనివాస శాస్త్రిగారి గూడు చాలని సుఖం కథను కథాజగత్‌లో చదవండి. జ్యోతి మాసపత్రిక 1978లో నిర్వహించిన కథలపోటీలో ఈ కథకు మొదటి బహుమతి వచ్చింది.జయంతి పాపారావుగారి సంపాదకత్వంలో వచ్చిన 'నూరేళ్లు- నూరుగురు కథకులు- నూరు కథానికలు'సంకలనంలో ఈ కథ చోటు చేసుకుంది. ఇంకా విహారిగారు తమ కథాకృతి గ్రంథంలో ఈ కథను పరామర్శించారు.  

30, జూన్ 2013, ఆదివారం

కృష్ణం వందే జగద్గురుం

మణి వడ్లమాని గారి భక్తిరస ప్రధాన కథ కృష్ణం వందే జగద్గురుం  కథాజగత్‌లో  చదవండి.

26, జూన్ 2013, బుధవారం

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి ప్రసంగం!


'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సందర్భంలో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు చేసిన ఆశీఃప్రసంగంలో కొంత భాగం ఇక్కడ వినండి.


25, జూన్ 2013, మంగళవారం

డా.కె.వి.రమణాచారి గారి ప్రసంగం!

23 జూన్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సందర్భంగా ఆం.ప్ర. మాజీ సాంస్కృతిక సలహాదారులు డా.కె.వి.రమణాచారి గారి అధ్యక్షోపన్యాసం వినండి.



24, జూన్ 2013, సోమవారం

ఆవిష్కరణ సభ మరికొన్ని వార్తలు!

సూర్య



వార్త

ఈనాడు

ఆంధ్రప్రభ

హైదరాబాదు ఆవిష్కరణ విశేషాలు!





సాధన నరసింహాచార్య



కె.వి.రమణాచారి

మురళీమోహన్


చీకట్లో సన్మానం 

ఎల్లూరి శివారెడ్డి


దైవజ్ఞ శర్మ




వెనిగళ్ల రాంబాబు

ముదిగొండ శివప్రసాద్ 

నాగసూరి

తంగిరాల చక్రవర్తి

తంగిరాల ఆత్మీయ సత్కారం

కె.ఎల్.కామేశ్వరరావు
ఆంధ్రజ్యోతి

కుటుంబసభ్యులతో

సాక్షి



నమస్తే తెలంగాణా


ఆంధ్రభూమి

సభకు విచ్చేసి సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు!