...
14, జూన్ 2015, ఆదివారం
11, జూన్ 2015, గురువారం
8, మే 2015, శుక్రవారం
మొదటి తరం రాయలసీమ కథలు!
మొదటి తరం రాయలసీమ కథలు పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని అతి త్వరలో ప్రచురిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాము. జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలనుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉంటాయి. ఈ కథలన్నీ క్రీ.శ.1882 - 1944ల మధ్య ప్రకటించబడ్డాయి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకుడు. ఈ పుస్తకంలో కథలతో పాటు కథాలక్షణాలను వివరించే ఒక వ్యాసం 1927 జనవరి 15వ తేదీ శ్రీ సాధనపత్రికనుండి సేకరించినది అనుబంధంగా ఇస్తున్నాము. హెచ్.నంజుండరావు వ్రాసిన ఈ వ్యాసం చాలా విలువైనదని చదివిన వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇంకా ఈ పుస్తకానికి కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు వ్రాసిన పీఠికలుంటాయి. సరే సంపాదకుని ముందుమాట, ప్రచురణకర్త (అంటే నేను వ్రాసిన ) నోటు ఎలాగూ ఉంటాయి. ఈ పుస్తకం వెల 200/-. బహుశా మే నెల చివరి వారంలో వెలువడనున్న ఈ పుస్తకాన్ని నేడే రిజర్వు చేసుకోండి.
Labels:
రాయలసీమ కథలు
24, ఏప్రిల్ 2015, శుక్రవారం
పుస్తక సమీక్ష - 32 నాగావళి నుంచి మంజీర వరకు
[పుస్తకం పేరు: నాగావళి నుంచి మంజీర వరకు, రచన:రావి కొండలరావు, వెల: రూ.150/-, పేజీలు:184, ప్రతులకు: ఆర్కే బుక్స్,502, సన్నీ రెసిడెన్సీ, 166, మోతీనగర్, హైదరాబాదు - 18 మరియు అన్ని ముఖ్యమైన పుస్తకశాలలు]
నాగావళి శ్రీకాకుళం తీరంలో ప్రవహించే నది. మంజీర హైదరాబాదు సమీపంలో ఉన్న నది. శ్రీకాకుళం నుంచి హైదరాబాదు దాకా సాగిన జీవిత ప్రస్థానాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. తిరుమల రామచంద్రగారి హంపీ నుంచి హరప్పా దాక ఈ పుస్తకానికి స్ఫూర్తిని కలిగించి ఉండొచ్చు. ఆర్.కె.రావు, చక్రపాణి, తిమ్మరాజు శివరావు, సి.హెచ్.నారాయణరావు, గండికోట జోగినాథం, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, నల్లరామ్మూర్తి, గోవిందరాజు సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, వడ్డాది పాపయ్య, సఖ్ఖరి కృష్ణారావు , గరిమెళ్లరామ్మూర్తి, ప్రయాగ నరసింహశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి, కొడవటిగంటి కుటుంబరావు, ఎం.ఎస్.రామారావు, జి.వరలక్ష్మి, మద్దాలి శర్మ, పూడిపెద్ది లక్ష్మణమూర్తి(పూలమూర్తి), సదాశివరావు, రేలంగి వెంకట్రామయ్య, సదాశివరావు, చదలవాడ కుటుంబరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, ఘంటసాల, సుందరశివరావు, సుంకర ప్రభాకరరావు, రావి ధర్మారావు, బి.ఎన్.రెడ్డి,సి.పుల్లయ్య, వల్లభజోశ్యుల శ్రీరామమూర్తి, మల్లాది వెంకటకృష్ణశర్మ, శ్యామలరావు, కమలాకర కామేశ్వరరావు, డాక్టర్ రాజారావు, మాస్టర్ మల్లేశ్వరరావు, ముద్దుకృష్ణ, కాశీనాథ్ తాతా, నార్ల వేంకటేశ్వరరావు, ఎన్.జగన్నాథ్, కళ్యాణసుందరీ జగన్నాథ్, మాధవపెద్ది సత్యం, హరనాథ్, ఆత్రేయ, బండారు చిట్టిబాబు, పెండ్యాల నాగేశ్వరరావు, ద్వారం వేంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కళావర్ రింగ్, ఉప్పులూరి కాళిదాసు, శ్రీశ్రీ, నిర్మలమ్మ, జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వి.రావు, బి.సరోజాదేవి, డి.వి.నరసరాజు, పింగళి నాగేంద్రరావు, మద్దిపట్ల సూరి, మల్లాది రామకృష్ణశాస్త్రి,దైతా గోపాలం,ఆరుద్ర,అంజలీదేవి,చౌదరి, వీర్రాజు, చిత్తూరు నాగయ్య మొదలైన వారి (పైన పేర్కొన్న జాబితాకు రెట్టింపు మంది) గురించి అంతో ఇంతో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. రావి కొండలరావు హాస్య రచయిత కాబట్టి పుస్తకం నిండా బోలెడన్ని చమత్కారాలు, హాస్యాలు, ఒకటి ఒకటిన్నర కుళ్ళు జోకులు కనిపిస్తాయి. ఈ పుస్తకంలో చాలా విలువైన ఫోటోలు, సినిమా స్టిల్స్, నాటకాల స్టిల్స్ రంగుల్లోనూ తెలుపు నలుపుల్లోనూ దర్శనమిచ్చి పాఠకులను రంజింపజేస్తాయి.
ఈ పుస్తకంలో కొన్ని ఆరోపణలు చేస్తారు రావి కొండలరావు. అయితే అవి ఆరోపణలని అనిపించకుండా చాలా లౌక్యంగా వ్రాశారు.
అవి:
1.ఎ.నాగేశ్వరరావు తనకు ఆటోగ్రాఫు ఇవ్వలేదు. (పేజీ 30)
2.అతను యెవరు? సినిమాకి మాటల రచయితగా ఇతని పేరు వేయలేదు. కారణం అన్నయ్య ఆర్.కె.రావు(?)
3.ఉప్పులూరి కాళిదాసు ఆనందవాణి పత్రికలో పనిచేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారు.
4.వి.ఎ.కె.రంగారావు తనకు కావలసిన రికార్డును ఇవ్వడానికి ఏడాదిన్నర తిప్పుకున్నారు. అలాగే వడ్డాది పాపయ్య తన పత్రిక ముఖచిత్రం వేయడానికి కొంతకాలం చుట్టూ తిప్పించుకున్నారు.
5.తెలుగు స్వతంత్రలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కె.రామలక్ష్మి తన కథలు రెండింటిని రిజెక్ట్ చేశారు.
పైన పేర్కొన్నవన్నీ నిజమే కావచ్చు కాని వాటిని పాఠకులతో పంచుకుంటే ఏం ఉపయోగం?
ఉత్తమ పుస్తకం కాకపోయినా ఈ మధ్య కాలంలో వెలువడిన మంచిపుస్తకంగా దీనిని పరిగణించవచ్చు.
Labels:
review
17, ఫిబ్రవరి 2015, మంగళవారం
తెవికీలో ఇద్దరు తిరపతోళ్లు
తిరుపతిలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇద్దరు తిరుపతికి చెందిన
రచయితల వ్యాసాలు వికీపీడియాలో వ్రాయడానికి కారణం అయ్యింది. లేకపోతే ఈ ఇద్దరి
గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో కనిపించడానికి మరికొంత కాలం పట్టేదేమో! ఈ
సమావేశాల్లో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ ముందు రోజు మరణించిన
ఎస్.మునిసుందరం గురించి ఇంటర్నెట్లో వెదికితే సరైన సమాచరం లభించలేదని అన్నారు.
రచయిత ఎస్.మునిసుందరం మరణ వార్త అక్కడే తెలిసింది. మునిసుందరం గారు నాకు పరిచయం నా
కథాజగత్ ద్వారా. అతని కథ రాయలమ్మ కథాజగత్‌లో ఉంది. అతని చారిత్రక పౌరాణిక నాటకాలపై నా సమీక్ష చదివి
వారు నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. ఆదిత్యగారి వ్యాఖ్యకు స్పందించి ఆ రోజే
తెలుగు వికీపీడీయాలో మునిసుందరం గారిపై ఒక వ్యాసాన్ని వ్రాశాను. దానిని ఇక్కడ చదవండి.
ఆ వ్యాసంలో మునిసుందరం గారికి నూతలపాటి గంగాధరం సాహితీ కుటుంబం తో ఉన్న అనుబంధం
తెలిసి నూతలపాటి గంగాధరం గురించి కూడా ఒక వ్యాసం తెలుగు వికీపీడియాలో వ్రాయడం జరిగింది. ఈ
వ్యాసాలు చదివి ఆసక్తి కలిగిన వారు ఎవరైన ఈ వ్యాసాలను ఇంకా మెరుగు పరచమని
కోరుతున్నాను.
17, నవంబర్ 2014, సోమవారం
స్వకీయ విలాప కదంబము by నల్లి
మానవ
రుధిరపానమే నాకు ఆహారమను మాట నిజమేకాని నావంటి జీవరాసులు భూలోకమున లేవా? ఇంతకు నేజేసిన
పాపమేమి? సృష్టికర్త నిర్ణయించిన తీరున నా జీవయాత్ర సాంతముగ కొనసాగించు నిచ్చతో, మానవకోటికి
కొంచెముగనో గొప్పగనో లాభకారిగ నుండవలెనను తలపు తప్ప మఱియొకటి నాకు లేదు. చూడుడు. టీ
మొదలగు వెలగల నిషావస్తువుల సహాయము కోరకయే మానవులు
నన్ను నమ్మ బలుకుకొని నిద్రాపిశాచమును జయించుచున్నారు. కావున ముఖ్యముగ విద్యార్థుల
పాలిటికి దైవసమానురాలను కానా? కుబేరుని వంటి ధనికుల గృహములలో నేనును నా సఖులును నిశాచరులవలె
మంచముల మీద తిరుగుచు ఇంటివారి నొక్కమారైనను రాత్రులలో కనులు మూయనియ్యకుండ జేసి తమ
యాస్తులను భద్రపఱచుకొన హెచ్చరించుచున్నాను. ఒక కాసైనను వారు మానవ భటుల మీదల శలవు చేయ
నవసరము లేకుండ జేయు మాకన్న మహోపకారులు కలరా! ........................................................................................
మిగతా భాగాన్ని క్రింది లంకెలో వెదికి
చదువుకోండి.
8, నవంబర్ 2014, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



