...

...

13, నవంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం!

కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించు చుండును
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.


ఇదెలా సాధ్యమో ఎవరైనా వివరించ గలరా!

4 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

కొండ నుండు నెమలి.
కోరిన పాలిచ్చు పశువు.
శిశువు తోడ పలుక నేర్చు వనిత.
వేదములను వల్లించు చుండును బ్రాహ్మణుండు
కాకి పలలము తిను.

mmkodihalli చెప్పారు...

ఫణీ! భళీ!! శెహభాష్!!!

శ్రీలలిత చెప్పారు...

ఆ పద్యాన్ని ఇలా విడదీసి చదువుకోవాలండీ..
కొండనుండు నెమలి,
కోరిన పాలిచ్చు పశువు,
శిశువు తోడ పలుకు నేర్చు వనిత,
వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు,
కాకి వలలము తిను..
అని చదువుకుంటే అంతా సాధ్యమే..

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. సంతోషం.