సాహితీ సమరాంగణ చక్రవర్తి, మురురాయ గండడు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాలను జూలై5 నుండి ఆగస్టు9 వరకు ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతి కళలకు పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలను ఈ విధంగా గుర్తు చేసుకోవడం అభినందనీయం. ఈ సందర్భంగా తురుపుముక్క రాయలవారికి జోహారులర్పిస్తున్నది.
ఆంధ్ర భారతి మన మానందమున పొంగ
అష్ట దిగ్గజ రత్న హారమొసగి
జగమెల్ల జేజేల జయనాదములు నిండ
శౌర్య ప్రౌఢిమ చేత శాంతి నిల్పి
సంగీత నాట్యాది సకల కళారాధ
నమ్మున ప్రజల కానంద మొసగి
జనమనమ్ముల భక్తి జాగృతమ్మగునట్లు
గుడుల గోపురముల కోరి నిల్పి
ఎందు కనమిట్టి మెండైన ఏలికనుచు
కవులు నీ కీర్తి పొగడంగ కావ్యములను
మా మనమ్ముల స్థిరముగ మనెదువయ్య
ధీర శృంగార శ్రీ కృష్ణ దేవరాయ!
- ఫణి ప్రసన్న కుమార్
అష్ట దిగ్గజ రత్న హారమొసగి
జగమెల్ల జేజేల జయనాదములు నిండ
శౌర్య ప్రౌఢిమ చేత శాంతి నిల్పి
సంగీత నాట్యాది సకల కళారాధ
నమ్మున ప్రజల కానంద మొసగి
జనమనమ్ముల భక్తి జాగృతమ్మగునట్లు
గుడుల గోపురముల కోరి నిల్పి
ఎందు కనమిట్టి మెండైన ఏలికనుచు
కవులు నీ కీర్తి పొగడంగ కావ్యములను
మా మనమ్ముల స్థిరముగ మనెదువయ్య
ధీర శృంగార శ్రీ కృష్ణ దేవరాయ!
- ఫణి ప్రసన్న కుమార్
2 కామెంట్‌లు:
ఫణి ప్రసన్న కుమార్ గారు,
పద్యము చక్కగా వచ్చింది. కాని మొదటి పాదములో రెండవ ఇంద్ర గణము సరిగా పడలేదు. (ఆంధ్ర కవితా మాత). దీనిని సవరించగలరు.
జిగురు సత్యనారాయణ గారూ,
ధన్యవాదాలు. సవరించాను. చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి