...

...

15, జులై 2010, గురువారం

కవితాభిషేకం! - 11



గీ. పలుకు చున్నావు చిత్రమౌ - ప్రతిమలందు
    కులుకు చున్నావు నాట్యకోమలులనడుమ
    తళుకు గొన్నావు రమ్య దేవళములందు
    తేజ ముప్పొంగ శ్రీకృష్ణ దేవరాయ!

గీ. ఎందు నున్నాడవోగాని - ఎట్టయెదుట
    నున్నవాని చందంబు, నేడున్నవాఁడ
    వౌర! నీ శిల్పికళల, మహాద్భుతంబు
    తెలియగా నౌనె? శ్రీకృష్ణ దేవరాయ!

గీ. సంస్కృతాంబను దరిజేర్చి - సలలితముగ
    కన్నడ, వధూటిఁబ్రేమించి - గారవమున
    ద్రావిడాంగన, ముద్దాడి, రక్తి మెఱయ
    ఆంధ్ర రమణిని పరిణయ - మందినావు

గీ. దేశ బాసలందు - తెలుగు తేట గ్రహించి
    తెలుగు వెన్నఁదిన్న - దేవరాయ!
    చవులెఱింగి, కవిత - సారంబు గొంటివి
    కృష్ణదేవుడీవె - కృష్ణరాయ!

                      - కల్లూరు అహోబలరావు. 

కామెంట్‌లు లేవు: