మా కాలనీలో నిర్వహించిన కుక్కపిల్లల పరుగు పందెంలో మొదటి నాలుగు కుక్కపిల్లలూ తమ ప్రత్యర్థుల కన్నా చాలాముందుగా ఉండి గెలిచాయి. ఆదినారాయణ గారి కుక్కపిల్లకు చివరి స్థానం రాలేదు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్లకు మూడో స్థానం రాలేదు. భాస్కరరావు గారి కుక్కపిల్ల తెల్లబొచ్చు కుక్కపిల్లకంటే ముందు స్థానంలో ఉంది. ధనలక్ష్మి గారి కుక్కపిల్లకు మొదటి బహుమతి వచ్చింది. భాస్కరరావుగారి కుక్కపిల్ల ఆదినారాయణ గారి కుక్కపిల్ల కంటే ముందు గమ్యాన్ని దాటింది. ఖాదర్‌వలీ గారిది నల్లకుక్క పిల్ల. కానీ భాస్కరరావుగారిది నల్ల మచ్చలున్న తెల్లకుక్క కాదు. ఈ వివరాల ఆధారంగా ఎవరి కుక్కపిల్ల ఏ రంగులో ఉందో, ఏ బహుమతి గెలుచుకుందో చెప్పగలరా?
2 కామెంట్‌లు:
ధనలక్ష్మి-నల్ల మచ్చలున్న తెల్ల కుక్కపిల్ల-1st prize
భాస్కర రావు-గోధుమ రంగు కుక్కపిల్ల-2nd prize
ఆదినారాయణ-తెల్ల కుక్కపిల్ల-3rd prize
ఖాదర్ వలీ-నల్ల కుక్కపిల్ల-4th prize
అనూరాధగారూ సరైన సమాధానం చెప్పారు. మీకు అభినందనలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి