అడ్డం:
1. ఆవు, గంగ, తులసి, హనుమంతుడు,
భీముడు లేదా పవిత్రురాలు (3)
4.
ఈ చీర కట్టుకున్న చిన్నది బంగారు బాబు చిత్రంలో వున్నది (3,2)
7.
అమెరికా బుల్లెమ్మ గుఱ్ఱమునెక్కు సాధనము (3)
9.
అడవి మల్లెలో మత్స్య విశేషము (2)
11.
నరసయ్య పేరులో నాల్క (3)
13.
2 3 5 అక్షరాలతో గణిత సంబంధము, 1 4 5 అక్షరాలతో శరీర సంబంధముగల తత్తరపాటు (5)
15.
పద్యం కానిది అనడానికి వీలు లేదు. ఇప్పుడు
ఈ పద్యాలు కూడా వస్తున్నై (3)
17.
గ్యాసు నూనె కొన్నిప్రాంతాలలో __ నూనె (2)
18.
కొప్పు (4)
20.
సూర్య నటించిన తమిళ డబ్బింగ్ సినిమా (2)
22.
అయిదక్షరాల తుమ్మెద (5)
23.
మరల వ్యావహారికంలో కుచించుకుపోయింది (2)
24.
పంటి గాటు(4)
26.
తిరస్కారము, బెదిరించుట (2)
27.
మొసలి కంటిలో లేశము (3)
29. సెంటరాఫ్ గ్రావిటీ (5)
30.
కొస చిరిగిన వస్త్రం (3)
32.
సంపూర్ణ కళలు గల చంద్రునితో కూడిన పున్నమ,
ఆగమనము (2)
33.
కొత్తపాళీ 99 లో వ్రాసిన ప్రసిద్ధమైన కథ
(3)
35. రాజకీరములు (5)
36.
కుత్సితము (3)
నిలువు:
2. మొదటి రెండు నెలలలో
కన్పించు సస్య విశేషము (2)
3. లేని కారణములలో
సంహారమును వెదుకుము (5)
5. వీక్షణం (4)
6. ఈటె (3)
8. మునసబు విడిచెడి
నిట్టూర్పు (2)
9. అబ్బురపు ఎడారి (ప్ర)దేశం (3)
10. సాహితీ - యానం
బ్లాగరు (5)
12. దురద (2)
14. ఒక రుచి (3)
16. గిలిగింత (5)
19. అటూఇటూ అయిన అటమటము
(3)
20. అంటుకోను ___
లేదుకాని మీసాలకు సంపెంగ నూనె అని సామెత (3)
21. దూబకుంట నారాయణకవి
అనువదించిన గ్రంథము (5)
23. ఎటుచూచినా గొప్పతనమే
(3)
25. నాగవల్లి (5)
26. నాగరికతలో గడ్డి
(3)
27. జూదగాండ్రు (4)
28. వీరేశలింగం పంతులుగారి ఇంటిపేరులో బిడ్డ (2)
29. వడబోయు గాజు పనిముట్టు (3)
31.
కూసెదను(?) అంటున్న కూతురు (2)
34. కిరీటిలో బురద మెచ్చే జంతువు (2)
3 కామెంట్లు:
అడ్డము : 1) పావని, 4) చెంగావి రంగు, 7) రికాబు, 9) అల్లె, 11) రసన, 13) కలవరము, 15) వ్వచనం, 17) గబ్బు, 18) జుట్టుముడి, 20) ఆరు, 22) మధూలికము, 23) మల్ల, 24) దంతఘాతం, 26) గహి, 27) సలికం, 29) గరిమనాభి, 30) దుకూల, 32) రాక, 33) తుపాకి, 35) రాచిలుకలు, 36) కుటిలం.
నిలువు: 1) వరి, 3) నికారణము, 5) విలోకనం, 6) భల్లెము, 8) బుస, 9) అరబ్బు, 10) బొల్లోజుబాబా, 12) నవ్వ, 14) వగరు, 16) చక్కిలిగింత, 19) డిమల్ల, 20) ఆముదం, 21) పంచతంత్రము, 23) మహిమ, 25) తమలపాకు, 26) గరిక, 27) సభికులు, 28) కందు, 29) గరాటు, 31) కూతు, 34) కిటి.
అడ్డం: 1 పావని 4 చెంగావిరంగు 7 రికాబు 9 అల్లె 11 రసన 13 కలవరము 15 వచనం 17 గబ్బు
18 జుట్టుముడి 20 ఆరు 22 మధూలికము 23 మళ్ళీ 24 దంతక్షతం 26 గహి 27 సలికం 29 గరిమనాభి 30 దుకూల 32 రాక 33 తుపాకి 35 రాచిలుకలు 36 కుటిలం
నిలువు: 2 వరి 3 నికారణము 5 విలోకనం 6 బల్లెము 8 బుస 9 అరబ్బు 10 బొల్లోజుబాబా 12 నవ 14 వగరు 16 చక్కలిగిలి 19 డిమళ్ళీ 20 ఆముదం 21 పంచతంత్రము 23 మహిమ 25 తమలపాకు 26 గరిక 27 సభికులు 28 కందు
29 గరాటు 31 కూతు 34 కిటి
అడ్డము 22 : "మధూలికము" కాదు "మధూలిహము"
కామెంట్‌ను పోస్ట్ చేయండి