...

...

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

పుస్తక సమీక్ష - 24 మనసు తడి ఆరనీకు


[పుస్తకం పేరు: మనసు తడి ఆరనీకు, రచయిత: ఓంప్రకాశ్ నారాయణ వడ్డి, వెల:రూ90/- ప్రచురణ: ఓంప్రకాశ్ ప్రచురణాలయం 28/553, జలాలు పేట, మచిలీపట్నం -1, ప్రతులకు: సాహిత్య నికేతన్, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాదు మరియు సాహిత్య నికేతన్, గవర్నర్ పేట, విజయవాడ] 

మిత్రులు ఓంప్రకాశ్ నారాయణ కథల సంపుటిలోని కథలగురించి  ప్రత్యేకంగా చెప్పవలసినదేమీ లేదు. 28, 29 యేళ్లుగా కథలు వ్రాస్తున్నా సంఖ్యాపరంగా ఎక్కువ కథలను ప్రకటించనప్పటికీ ప్రకటించిన అన్ని కథలూ నాణ్యమైన కథలే! రాసికంటే వాసికే ప్రాముఖ్యతనిచ్చే ఓంప్రకాశ్ తన కథల్లో 23 కథలను ఏరి ఈ కథా సంపుటిలో పాఠకులకందిస్తున్నారు. మార్నింగ్‌వాక్, సీతాపతికి జ్ఞానోదయమైంది కథలు రెండూ సరదా కథలు. మిగిలిన కథలన్నీ ఏదో ఒక ఆశయాన్ని, ఆదర్శాన్ని తెలియజేస్తాయి. అన్ని కథలూ మనసు తడిని ఆరనివ్వని కథలే. మచ్చుకు ఈ కథ చదవండి.ఇంత మంచి కథలకు ఏ కథావార్షికలూ చోటు కల్పించకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. ముందుమాట వ్రాసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి ఓంప్రకాశ్ కథలు నచ్చడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, నచ్చకపోతే ఆశ్చర్యపడాలిగాని. ఇక విజయసారథిగారి ముందుమాటలో రచయిత కుటుంబ నేపథ్యాన్ని వివరించడం కథల నేపథ్యానికి సంజాయిషీ ఇచ్చినట్లుగా ఉంది. ఇది ఏవిధంగా రచయితకు లాభిస్తుందో అర్థం కావడం లేదు. రచయిత ఆదర్శభావాలు కథలలో ప్రతిబింబిస్తున్నప్పుడు పాఠకులకు అతని వ్యక్తిగత విషయాలతో పని వుండదనే అనుకుంటాను. 

ఓ కోకిల పునరాగమనం కథలో ఓంకార్ మార్గరెట్‌ను స్వామీజీ ఆశ్రమానికి ఆహ్వానించడంలో మతలబు ఏమిటి? మార్గరెట్ ఒకవేళ మతం మార్చుకోవాలని భావించకపోతే ఓంకారే ఆ ప్రతిపాదన చేసివుండేవాడా? మార్గరెట్ నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమేనా? లేక ఆమె తెలివైనది కనక ఓంకార్ మనసు తెలుసుకుని (ఓంకార్‌తో పెళ్లి తన సాంఘిక అవసరం కనుక) దానికి అనుగుణంగా మతమార్పిడికి సిద్ధపడిందా? అనే సందేహాలు కలుగుతాయి పాఠకుడికి. పరమేశ్వరావు పీటర్‌గా మారడం తప్పయితే మార్గరెట్‌ను లక్ష్మిగా మారుస్తూ (చేసిన తప్పు సరిదిద్దుకోవడం అనే వంక పెట్టి) అదే తప్పును చేయిస్తున్నాడు రచయిత. అలాకాకుండా ఓంకార్ మనసులోని భావాన్ని పసిగట్టి వాళ్ల నాన్నగారు మతమార్పిడిని వ్యతిరేకిస్తూ/తిరస్కరిస్తూ  లక్ష్మిని కాకుండా మార్గరెట్‌నే తన కోడలిగా అంగీకరించినట్లు ముగించి ఉంటే బాగుండేది. మొత్తం మీద ఒక మంచి కథల సంపుటిని అందించిన ఓంప్రకాశ్‌నారాయణ వడ్డి గారికి అభినందనలు!

2 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిన్నలా .ంఒన్నలా..లెదురా.. కథ చాలా బావుంది :) మంచి కథా సంకలనం ని పరిచయం చేసారు థాంక్స్ అండీ. వడ్డీ ఓం ప్రకాష్ నారాయ గారికి అభినందనలు ఈ కథని బ్లాగులతో పరిచయం లేని మరో ఇద్దరు చదివారు వారి అభినందనలు అందుకోండి

Omprakash Narayana Vaddi చెప్పారు...

వజన వనమాలి గారు... ధన్యవాదాలు. ఈ పుస్తకం మీకు www.kinige.com లో లభ్యం అవుతుంది... అవకాశం వుంటే చదివి అభిప్రాయం తెలుపండి.