ఈరోజు తెలుగుబాట కార్యక్రమం తెలుగు లలిత కళాతోరణం నుండి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ చౌరస్తా మీదుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరకూ సాగింది. మన బ్లాగర్లు బజ్జర్లు కొంత మందితో పాటు కూచిభొట్ల ఆనంద్, అమర్నాథ్ రెడ్డి, గురజాల విజయ్‌కుమార్, కె.ఎల్.కామేశ్వరరావు, ఎఱ్ఱ నాయుడు, మాడభూషి అనంతాచార్యులు మొదలైన వారు కొందరు పాల్గొన్నారు. నడక ముగిసిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారకరామారావు కళాప్రాంగణంలో చిన్న సభ, తదనంతరం తెలుగు తల్లి విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించడంతో కార్యక్రమం ముగిసింది. గత సంవత్సరం జరిగిన తెలుగుబాటతో పోల్చుకుంటే పాల్గొన్నవారి సంఖ్య బాగా తగ్గింది. e-తెలుగు సభ్యులు, ఆ సంస్థ కార్యవర్గ సభ్యులే చాలామంది గైర్హాజరు కావడం (కారణాలు ఏవైనా) చూస్తే ఇక ఇతరులు పాల్గొనక పోవడంపై ఆలోచించడంలో అర్థం లేదనిపిస్తోంది.
6 కామెంట్లు:
"e-తెలుగు సభ్యులు, ఆ సంస్థ కార్యవర్గ సభ్యులే చాలామంది గైర్హాజరు కావడం (కారణాలు ఏవైనా) చూస్తే ఇక ఇతరులు పాల్గొనక పోవడంపై ఆలోచించడంలో అర్థం లేదనిపిస్తోంది."--- ఈ మాటతో నేను విభేదిస్తున్నాను. దీనిపై నేను ఇక్కడ నా ఆలోచనలను, అనుభవాలనూ పంచుకున్నా అది డిలీట్ చేయబడుతుంది. మీ బ్లాగ్‌లో నా అభిప్రాయాలను వ్రాసి వివాదానికి తెరతీయటం ఇష్టం లేక విరమించుకుంటున్నాను.
సతీష్ కుమార్ యనమండ్ర
సతీష్ కుమార్‌గారూ! మీ అభిప్రాయాలు వివాదానికి తెర తీస్తుందని మీరు భావిస్తే మీ ఇష్టం కానీ ఇక్కడ మీ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోదలిస్తే శుభ్రంగా పంచుకోవచ్చు. ఏదీ డిలిట్ చేయబడదు.
ఏ సంస్థ అయినా దాని విజయం నలుగురినీ కలుపుకుని పోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్లను సవరించుకుంటూ ముందడుగు వేయడంలోనే దాని మనుగడ ఆధారపడి ఉంది. ఉత్సాహంగా పని చేయడానికి ముందుకొచ్చిన వారిని ఉపయోగించుకుని వారిని కరివేపాకులా పక్కన పెట్టడం, పని పూర్తయ్యాక -----ప్రచారం కోసమే పని చేశారని,వివాదాలు చేయడానికి చూశారని, నిందా పూర్వకంగా మాట్లాడటం, అభిప్రాయపడటం ఇతర స్వచ్ఛంద సంస్థల్లో మామూలు విషయమేమో గానీ భాషా సంస్కృతుల కోసం పని చేసే సంస్థలకు అంతగా శోభస్కరం కాదు. ఇలాంటి విషయాలు ఎవరినైనా నిరుత్సాహపడేలా చేస్తాయి. సొంత పనులు మానుకుని డబ్బుని,సమయాన్ని,తమ పరిచయాలను కూడా సంస్థ కార్యకలాపాల విజయాల కోసం వినియోగించిన వారికి మరీ బాధ కల్గిస్తాయి.
అందువల్లనే కొంతమంది సభ్యులు (నాతో కలిపి) ఈ సారి ఉత్సాహంగా పాల్గొనకపోవడానికి కారణమని నేను అభిప్రాయపడుతున్నాను.
దీని మీద సంస్థ వివరణ నేను కోరడం లేదు. నా అభిప్రాయం చెప్తున్నానంతే!
మురళీ మోహన్ గారు,
నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
-సతీష్ కుమార్ యనమండ్ర
ఒక్క మాట చెప్పాలి , e తెలుగు కార్య వర్గ సబ్యులు ఎనిమిది మంది వివేన్ , మురళి now @ US , రవిచంద్ర now @ Bang , చక్రవర్తి now @ trupathi , సి బి రావు కశ్యప్ , , ఇంకా సుజాత గారు వీరు గాక హైదరాబాదు లో వున్నా పద్దెనిమిది మంది e తెలుగు సబ్యులలో అంతర్జాలం లో చురకుగా వున్నా వారు చాలామంది వచ్చారు , రాలేని సబ్యులు అందరూ అంతర్జాలంలో , మరియు కరపత్రాలు , ప్రెస్ నోటులు పంచటమో చేసారు
తెలుగు బాషాదినోత్సవ శుభాకాంక్షలు
జాన్హైడ్గారూ! మీకు కూడా తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు! నిన్న తెలుగుబాటకు వస్తారనుకున్నా :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి