...

...

10, సెప్టెంబర్ 2011, శనివారం

నువ్వేనేను, నేనేనువ్వు


పులిగడ్డ విశ్వనాథరావు గారి కథ నువ్వే నేను, నేనే నువ్వు కథాజగత్‌లో చదవండి. ఈ కథపై బాపుగారి ప్రశంస ఇంతకు ముందు టపాలో చదివారు కదా! ఇప్పుడు ఈ కథపై ప్రఖ్యాత రచయిత మంజుశ్రీ(అక్కిరాజు రమాపతిరావు)గారి అభిప్రాయం ఇక్కడ చదవండి.

"కథకు ఏది ఆయువు పట్టో, ఏది ప్రాణమో మీకు బాగా తెలుసునని ఈ కథ ద్వారా నాకు తెలిసింది. చాలా ఆర్ద్రతతో మీరు రాశారు. చదివిన వాళ్ళకు కూడా ఆ స్పందన స్పర్శ అనుభూతినిస్తుంది. మాటకారి తనానికీ, కారుణ్య రస ఆత్మావలోకానికీ సాధారణంగా పొందిక ఉండదు. ఆ పొందిక కూర్చడం కష్టం. కథ కొసకంటా వచ్చేసరికి కళ్ళు చెమరింపచేయగలగడం సామాన్యం కాదు. అసామాన్యమే. మీరీ కథలో ఒక కొత్త సొగసును చూపారు. తెచ్చారు. ఒక కొత్త శిల్పం - ఒక కొత్త బాణీ - కొత్త వస్తువు - కొత్త కథనం. అన్నీ బాగున్నాయి. కథా రచనలో ఒక సంభ్రమాన్ని చివరిదాకా పోషించారు. మానవజీవితాన్ని ప్రేమించడం నేర్పడమే కథ అత్యంత విశిష్ట ప్రయోజనం. జీవితం పట్ల ఆశనూ, ఆశ్వాసాన్నీ మప్పడంకన్న  సాహిత్యానికి సార్థకత ఏముంది? ఏముంటుంది?"

మరి మంజుశ్రీగారి అభిప్రాయంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో ఈకథ చదివి నిర్ణయించుకోండి.  

కామెంట్‌లు లేవు: