...

...

9, జనవరి 2012, సోమవారం

ఖాళీ


   అన్వేషణ ... అన్వేషణ ...


    ఏదో కావాలి.... ఇప్పుడు తన దగ్గరున్నది కాక - తన దగ్గరలేనిది ఇంకేదో కావాలి. ఉన్నది ఏమిటో పూర్తిగా తెలియదు. లేనిదీ, తనకు కావల్సిందేమిటో స్పష్టంగా అర్థంకాదు.


    అర్థంకానిదీ ... ఆత్మను తృప్తం చేయగలిగేదీ ఏదో కావాలి ... ఇంకా ..,


    ఆ 'ఏదో' కోసమే ఈ అన్వేషణ ...,


    ఎక్కడ అన్వేషిస్తావు ... పుస్తకాల్లో ... డిగ్రీల్లో ... డబ్బులో ... మనుషుల్లో ... స్నేహితుల్లో ... సహచరుల్లో ... స్పర్శలో ...దేశాల్లో ... ప్రాంతాల్లో ...,


    అమెరికా ... కెనడా ... జర్మనీ ... రష్యా ... చైనా ...శ్రీలంక ... మలేషియా ... వారణాసి ... ఢిల్లీ ... కాశ్మీర్ ... కేరళ ... అడవులు ... కొండలు ... లోయలు ... పర్వతాలు ... ఆకాశాంతర ప్రాంతాలు ... సముద్ర తీరాలు ... దండకారణ్యాలు ...,


    ఎక్కడ ... ఎక్కడుంది ... మనిషిక్కావలసింది...,




మనిషికి కావలసినదేదో తెలుసుకోవాలంటే రామా చంద్రమౌళిగారి కథ ఖాళీ చదవాల్సిందేమరి. దీంతో పాటు కథాజగత్‌లో మరో రెండు కథలు!


అవశేషం - చంద్రలత ,


ఈ కథ అసహజం కాదు - వసంత ప్రకాష్  


1 కామెంట్‌:

anrd చెప్పారు...

కధలన్నీ చాలా బాగున్నాయండి.... అవి కధలు కాదు .... నడయాడుతున్న సజీవ గాధలు.