వర్తమాన కథాకదంబం కథాజగత్ రెండువందల కథలను ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు నిర్వహించిన కథావిశ్లేషణ పోటీ ఇంతటితో ముగిసింది. ఈ పోటీకి వచ్చిన స్పందన క్రితం సారి నిర్వహించిన పోటీతో పోలిస్తే సంతృప్తికరంగానే వుంది. ఈ పోటీ మూలంగా కథాజగత్ ను మొదటిసారిగా సందర్శించిన వారి సంఖ్య బాగా పెరిగింది. పోటీలో పాల్గొన్న వారు చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. మొత్తం 27కథలపై 29 విశ్లేషణలు 16మంది బ్లాగర్ల నుండి పోటీకి వచ్చాయి. పాల్గొన్న అందరికీ తురుపుముక్క అభినందనలను తెలియజేస్తోంది. శుభాకాంక్షలను అందిస్తున్నది. అందరికీ 50రూపాయల విలువ గల ఇ- పుస్తకాన్ని ప్రోత్సాహక బహుమతిగా పంపిస్తున్నాము. పోటీ ఫలితాలు అతి త్వరలో తెలియజేస్తాం. ఈ పోటీకి సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పోటీకి ప్రాచుర్యం కల్పించిన మాలిక, కూడలి,సంకలిని, సమూహము మొదలైన అగ్రిగేటర్ల నిర్వాహకులకు, పొద్దు పత్రిక వారికి,వసుంధర అక్షరజాలం వారికీ, గూగుల్ గుంపులు తెలుగు కథలు, తెలుగు సాహితీ వలయం, సాహిత్యనిధి నిర్వాహకులకు, ప్రస్థానం, ప్రజాశక్తి పత్రికా సంపాదకులకు మా కృతజ్ఞతలు! బహుమతులను స్పాన్సర్ చేసిన కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, ముఖ్యంగా చావా కిరణ్ గారికి మా నెనరులు. మునుముందు మీ అందరి ప్రోత్సాహం తురుపుముక్క, కథాజగత్లపై యిలాగే వుండగలదని ఆశిస్తున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి