అనుకోకుండా ఈరోజు కూడలి చూస్తే కథాలహరి అనే పేరుతో వస్తున్న బ్లాగులో నా కథాజగత్‌లో వచ్చిన కథలు కొన్ని కనిపించాయి. కొంత ఆశ్చర్యంతో ఆ బ్లాగును ఓపెన్ చేసి చూస్తే అందులో కథాజగత్‌లో వచ్చిన కథలన్నీ యథాతథంగా నేను వాడిన ఫాంట్లు కలర్లతో సహా అలాగే కాపీ చేసి ఉన్నాయి. నేను కథాజగత్‌ను అంతర్జాలంలో తెలుగు కథకు తగిన ప్రాచుర్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రారంభించాను. మొదట బ్లాగుగా ప్రారంభించి అందులోని యిబ్బందుల్ని అధిగమించడానికి వెబ్సైటుగా మార్చాను. యిప్పటి వరకు 225 కు పైగా కథల్ని ప్రచురించాను. అన్ని కథలనూ ఆయా కథా రచయితల అనుమతి తీసుకుని నా వెబ్సైట్లో ప్రచురించాను. ఆయా కథలు ప్రచురింపబడిన పత్రికలను కూడా తేదీతో సహా కథ క్రింద పేర్కొన్నాను. కథాజగత్కు రచయితలనుండి పాఠకులనుండి మంచి స్పందన లభించింది. నేను రెండేళ్ళకు పైగా కష్టించి ప్రకటించిన కథల్ని అజయ్ వెల్లంకి అనే శాల్తీ రెండు వారాల్లో తన కథాలహరి బ్లాగులో కాపీ చేసేశాడు. కనీసం ఎక్కడా కథాజగత్నుండి ఈ కథల్ని తీసుకున్నట్టు పేర్కోలేదు. ఇలా మన బ్లాగుల్లోని/వెబ్సైట్లలోని కంటెంటును మన అనుమతి లేకుండా కాపీ కొట్టే వారిపై మనం ఏం చేయగలం? మీ సలహా కావాలి.
14 కామెంట్లు:
ఇది గ్రంథ చౌర్యంతో సమానం. ఈ క్రింది లంకె కి కంప్లైంట్ ఇవ్వండి.
http://support.google.com/bin/request.py?&product=blogger&contact_type=lr_dmca
ప్రసాద్.
ఆతను చేసింది తప్పు అని ముందు అతనికి ఈ పోస్ట్ పంపండి . అది తప్పని తెలిసి కూడా అలానే కొనసాగిస్తే తరువాత ఏం చేయాలో ఆలోచించవచ్చు
గౌరవనీయులైన కోడీహళ్లి మురళీమోహన్ గారికి,
నేను కూడా తెలుగు కథకి తగిన ప్రాచుర్యం కల్పిద్దమనే ఉద్దేశ్యంతోనే ఆ పని చేసాను. ఇకపై నా బ్లాగ్ లో మీ సైట్ లింక్స్ తప్పక ఇస్తాను.
ఏం చేయాలంటే.. పంచాయతి ఎన్నికల్లో నిలబెట్టి వోట్లేసి ఎన్నుకోవాలి., కాపీ కొట్టే వాళ్ళకి అర్జున, పద్మ అవార్డులివ్వాలి.
జగ్గారెడ్డి
మీ స్వంత కథలైతే అడగడానికి కనీస హక్కు వుంటుంది. మీకిచ్చినట్టే ఆదొంగెదవకీ అనుమతివుంది వాడంటే మీరేమీ చేయగలరు?
athanu edo teliyakunda ala chesaadu. ippudu telusukunnadu. Aina emavuthundandi. deenni edo peddha issue chesthunnaru. meeru kuda verevallave teesukunnaru kadha. andhraiki andubaatulo undalani korukovaali kaani.. naa aperu ledhu. naa web link ivvaledhu.. ane swarthaalu avasarama.. kaaneesamu virtual world lo aina swartha purithamugaa undandi. edo mee jeevithhanni kolpoyinattlu ikkada gaggolu peduthunnaru.
అజయ్ వెల్లంకి గారూ,
మీకు మురళీ మోహన్ గారి, రచయితల అనుమతి లేకుండా కథలను ప్రచురించే హక్కు లేదు. ఇది ఖచ్చితంగా గ్రంధ చౌర్యమే. మీరు వెంటనే మురళీ మోహన్ గారితో ఈ విషయాన్ని రిసాల్వ్ చేసుకోండి. లేకపోతే పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
Sw see anni open source avuthunna ee rojullo. inka naa kathalu ani velladuthunnaru. Boss.. this is not correct. Mee kathalani prachurinchinadhuku meeru gravamgaa feel kandi. peddha issue cheyakandi.
mokaali ki leni noppi jandubalm ki endhuku. avanni nee kathalu kaadhu. vere valla kathalu. athadu cpopy kotti nee blog peru raayandhuku neeku kulllu.
అజ్ఞాత గారు,
మీరు అన్నది అక్షరాల కరెక్ట్ అని నేను అనుకున్నాను కాబట్టే అలా పోస్ట్ చేసాను. నా బ్లాగ్‌లో కథ మరియు దాని రచయిత పేరు తప్పక ఇస్తున్నాను. అల కాకుండా కథ కింద నా పేరు రాసుకుంటే అది నిజమైన గ్రంధ చౌర్యం. ఇప్పుడు నా బ్లాగ్ లో కథ పోస్ట్ చేసి అందులో వేరే వెబ్ సైట్ లింక్ ఇస్తే చదవాలి అనుకున్న వాడి ఇంట్రెస్ట్ కూడా పోతుంది అని నా అభిప్రాయం. మీరు అన్నట్టు ఈ ఓపెన్ సోర్సు కాలంలో అంత గుప్పిట తెరిచినట్టు ఉండాలి. కాని ప్రస్తుతానికి కథాజగత్ లింక్స్ తప్పక ఇస్తున్నా.
అజయ్ వెల్లంకి గారు కథలకు ప్రాచుర్యం కల్పించాలని మీకు అనిపిస్తే మీరు కథలు చదివి అవి నచ్చితే ఆ రచయితల అనుమతి తీసుకోని మీ బ్లాగ్ లో ప్రచురించండి .అంతే కానీ ఇతరులు రెండేళ్ళ పాటు కష్ట పడి , సేకరించిన కథలు కాపి , పేస్ట్ .... మీరు వాడుకోవడం తగదండి . 1987 లో నా కథ ఒకటి ఆంధ్ర పత్రిక ఆదివారం అనుబందం లో పబ్లిష్ అయింది. నాకు ఆ విషయం తెలియదు .ఓ సారు గూగుల్ + లో మురళి మోహన్ గారు మీ కథ ప్రచురిస్తాం అనుమతి అంటూ ఆన్ లైన్ లో సంప్రదించారు . నేను రాసినట్టు గుర్తు లేదండి అంటే మెయిల్ చేశారు . ఆ కథ చూసి చాలా సంతోషం వేసింది రెండు దశాబ్దాల తరువాత చూశాను. నా విషయం ఎందుకు చెబుతున్నానంటే ఒక్కో కథ కోసం మురళి మోహన్ గారు ఎంతో కృషి చేశారు . మీరు అతని ఆలోచన, శ్రమ ఇలా దోచుకోవడం బాగా లేదండి .
అజయ్ గారూ! ఇప్పుడే కథా లహరి చూశాను. కొంత కథ ఇచ్చి మిగితా కథ చదవటానికి లింకు ఇచ్చారు. ఇది చక్కగా ఉంది. ఇప్పుడు మురళీ మోహన్ గారి కృషిని గుర్తించినట్లవుతుంది కదా!
ముందుగా కాపీ రాయుళ్ళ బ్లాగులని సంకలినులనుండి తొలగించాలి.
అజయ్ వెల్లంకి గారి ఇ-మెయిల్ లేక నేనూ ఇక్కడే వ్రాయాల్సి వస్తోంది.
అజయ్ గారూ ---> కౌముది లోని కథల్నికూడా అలాగే పెట్టేశారు. పి.డి.ఎఫ్ ఫైళ్లని ఇమేజ్ గా మార్చి అంతకష్టపడి మీ బ్లాగు లో పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలీడం లేదు. కథలకి ప్రాచుర్యం కలిగించాలనుకుంటే ఇంటర్నెట్లో దొరికే వాటికి సరాసరి లింకులు ఇవ్వండి. ఇంటర్నెట్ పత్రికల్లోని కథల్ని మళ్ళీ మీరు కాపీ చెయ్యడం సరైన పద్ధతి కాదు. పత్రికా సంపాదకులకీ, రచయితకీ కూడా చెప్పకుండా ఇలాంటి పని చెయ్యడం ఏ మాత్రం హర్షణీయం కాదు. కౌముదిలో కథలకి లింక్ లు ఇచ్చి, మళ్ళీ వాటిని ప్రోసెస్ చేసే శ్రమ తగ్గించుకోండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి