...

...

13, సెప్టెంబర్ 2012, గురువారం

మల్లాది మెచ్చిన కథ!


మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు "తమ నవలలవెనుక కథ" అనే రచనలో వారి నవల అద్దెకిచ్చిన హృదయాలు గురించి వ్రాస్తూ ఇలా పేర్కొంటారు.

"ఈ నవలికకి నేను ఆ పేరు పెట్టడం వెనక కూడా ఓ కథ ఉంది. 1960లలో ఆంధ్రపత్రిక వారపత్రికలో 'అద్దెకిచ్చిన హృదయం' అనే ఓ కథ ఒకటి చదివాను. ప్రవాసాంధ్ర విద్యార్థి, ఓ వృద్ధ దంపతుల మధ్య జరిగిన ఆ కథ నాకు నచ్చి ఆ పేరు గుర్తుండిపోయింది. దాని ఆధారంగా 'అద్దెకిచ్చిన హృదయాలు' అనే పేరుని పెట్టాను. ఈ విషయం నేను ఎక్కడో పేర్కొంటే, నాకు అప్పటికే పరిచయం ఉన్న రావులపాటి సీతారామారావు అనే ఐ.పి.యస్ ఆఫీసర్ ఫోన్ చేసి తనే ఆ కథా రచయితనని చెపితే ఆశ్చర్యపోయాను."(కౌముది ఆగస్ట్ సంచిక) 

కథను మీరుకూడా కథాజగత్‌లో చదవవచ్చు.

కామెంట్‌లు లేవు: