...

...

20, నవంబర్ 2012, మంగళవారం

పేరు సూచించండి!

డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి గురించి నేను డా.నాగసూరి వేణుగోపాల్‌తో కలిసి తీసుకువస్తున్న పుస్తకం ఓ కొలిక్కి వచ్చింది. సుమారు 200 పేజీలు ఉండే ఈ పుస్తకంలో తిరుమలరావు గారు వ్రాసిన విమర్శావ్యాసాలు, నాటికలు, కథ, గ్రంథ విమర్శలు, పీఠికలు, సంపాదక లేఖలు, వారు వ్రాసిన 'సాహిత్య తత్వము - శివభారతదర్శనము', 'కన్యాశుల్క నాటక కళ' గ్రంథాలపై వెలువడిన పీఠికలు, సమీక్షలు తిరుమలరావు గారి జీవిత విశేషాలను వివరించే వ్యాసాలు, అనుబంధంగా తిరుమలరావుగారి ఫోటోలు, భారతిలో వారి రచనల జాబితా వగైరా ఉంటాయి. వీటితో పాటు ఆయిల్ టెక్నాలజీ రంగంలో సర్దేశాయి గారు చేసిన పరిశోధనలూ, వారి ఆధ్వర్యంలో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థ సాధించిన విజయాలూ వివరిస్తూ ఒక బృహత్ వ్యాసం ఈ పుస్తకానికి హైలైట్‌గా ఉండబోతోంది. ఈ పుస్తకానికి ఒక మంచి పేరును సూచించవలసిందిగా బ్లాగు మిత్రులను కోరుతున్నాను. పేరు పెద్దగా ఉండకూడదు. 'క్యాచీ' ఉండాలి. సర్దేశాయి తిరుమలరావు ముందుగాని, చివరన గాని ఒక విశేషణం జోడిస్తే ఎలా ఉంటుంది? (సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం మాదిరిగా) మీ సలహా సూచనల కోసం ఎదురుచూస్తున్నాను.       

3 కామెంట్‌లు:

ramperugu చెప్పారు...

సాహిత్య ,సాంకేతిka దిశానిర్దేసాయి-డా సర్దేసాయి

కంది శంకరయ్య చెప్పారు...

ramperugu వారి సూచన బాగుంది. ‘సాంకేతిక’ పదం అవసరం లేదనుకుంటాను. ‘సాహిత్య దిశానిర్దేశకుడు - డా. సర్దేశాయి’ బావుంటుందేమో.
‘డా. సర్దేశాయి - సర్దేసిన పుస్తక భోషాణం’ :-)

mani చెప్పారు...

నమస్కారం!
మీరు సాహితి మిత్రులందరినీ కలుపుకుని, ఒక పుస్తకానికి భాగస్వాములని చేస్తున్నందుకు ధన్యవాదాలు.
నాకు తోచిన పేరు "సాహితీ ద్రష్ట డా|| సర్దేశాయి తిరుమలరావు"
లేదా " సాహితీ స్రష్ట డా|| సర్దేశాయి తిరుమలరావు"