చాలా కాలం ముందు అంటే సుమారు వందేళ్ళ ముందు సాధన అన్న పత్రిక రాయలసీమ నుండి వెలువడేదిట. అందులో ‘వదరుబోతు ‘ పేరిట వ్యాసాలు వచ్చేవి. అవి రాసిన వారు ఎవరో తెలియదు.ఆ వ్యాసాలలో ఒకానొక వ్యాసంలో పేరు సంపాదించుకోవడానికి మార్గాల గురించి వ్యంగ్యంగా చెబుతారు. ప్రాచుర్యం రావాలంటే – గొప్ప ‘పేరు ‘ ను సంపాదించుకొని ఉండాలి లేదా, గొప్ప వ్యక్తులతో ముందుమాట వ్రాయించుకోవాలి లేదా ప్రముఖులు ఆ పుస్తకాన్ని పొగడాలి. ఇది నాటి పరిస్థితి అయితే మరి నేటి విషయం చెప్పనవసరమే లేదు. ఇలా ప్రాచుర్యం పొందిన వారు తామరతంపరగా కనిపిస్తున్న రోజుల్లో శాస్త్రజ్ఞుడిగా వృత్తిని, సాహిత్య అనుశీలకుడు, విమర్శకుడుగా ప్రవృత్తినీ పెంపొందించుకుని, రెంటినీ సమన్వయం చేయాలన్న తపన నేపథ్యంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఒక అజ్ఞాత అనల్ప ప్రతిభావంతుని గురించిన పుస్తకం ఇది.
సర్దేశాయి తిరుమల రావు గురించిన ఈ పుస్తకం లో రెండు పార్శ్వాలున్నాయి. ఒకరు వ్యక్తి, మరొకరు సాహిత్యవిమర్శకుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి