[పుస్తకం పేరు: బియాండ్ కాఫీ, రచయిత: మహమ్మద్ ఖదీర్ బాబు, ప్రచురణ: కావలి ప్రచురణలు, 1-13-6, ఓల్డ్ టౌన్, కావలి 524201 వెల:రూ.135/- ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, e-బుక్ కొరకు: www.kinige.com]
ప్రముఖ యువరచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు రచించిన 10 కథల పుస్తకం ఇది. పది కథలూ డైరెక్టు కథలే. ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడలేదు. ఈ కథల్ని ఇక్కడ కొంత పరిశీలిద్దాం.
మంత్రాలూ,తంత్రాలూ, మాయలూ, తాయెత్తులూ, మూలికలూ అంటూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే హుజూర్ లాంటివారు తమ ఆటలు సాగని చోట ఎలా లౌక్యంగా వ్యవహరిస్తారో మొదటి కథ ఆస్తిలో తెలుస్తుంది. డ్రగ్సుకు అలవాటు పడి చివరకు తన మగతనాన్నే కోల్పోయిన ఒక ధనవంతుడు, అతని చేతకానితనాన్ని ఆసరగా చేసుకుని అతని ముందే అతని డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుని కులికే భార్య, పరువు ప్రతిష్టల కోసం, మనవడి కోసం కోడల్ని సహిస్తున్న అత్తగారు ఈ కథలో మనకు తారసపడతారు.
తరువాతి కథ పేరు ఘటన. ఒక ముసలాడు తప్పతాగి రోడ్డుకు అడ్డంగా నడుస్తూ కారు క్రింద పడతాడు. ఆ కారు నడుపుతున్న కుర్రాడు ఆయన్ని హాస్పెటల్లో చేరుస్తాడు. విషయం తెలుసుకున్న ముసలిది హాస్పెటల్‌కు వచ్చి మొగుడిపై ఉన్న కోపాన్ని అక్కడున్న వాళ్ళపై ప్రదర్శిస్తూ చెడామడా దులిపి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాడు ఎలాగో ఆవిడను కన్విన్స్ చేసి మళ్ళీ హాస్పెటల్‌కు పంపుతాడు. మొగుడి పలకరింపుతో ఆమె కరిగిపోతుంది. ఇదీ కథ. ఎన్ని గొడవలున్నా దంపతుల మధ్య ఆప్యాయతలు అనేవి ఉంటాయని ఈ కథ నిరూపిస్తుంది. స్త్రీలకున్న క్షమించే గుణాన్ని కూడా ఈ కథ తెలియజేస్తుంది. ఒంటరితనంతో నరకాన్ననుభవించే ఓ ధనిక కుటుంబ స్త్రీ ఆ 'బోర్' నుండి తప్పించుకోవడానికి అపరిచిత పురుషులకు ఫోన్ చేసి విసిగించే వైనం టాక్ టైం కథలో చూడవచ్చు. An idle mind is devil's workshop అనే నానుడికి ఈ కథ ఒక ఉదాహరణ. ఒక పిల్లవాడు తనపై ఆప్యాయతను చూపే పక్కింటి అమ్మాయి(అక్క)పై అభిమానాన్ని పెంచుకోవడం, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే వాడిలో కలిగే మథనం వహీద్ అనే కథలో కన్పిస్తుంది. 'ఎదుటివాళ్లనే కాదు ఒక్కోసారి మనల్ని కూడా మనం క్షమించుకోవాలి మనస్ఫూర్తిగా' అని మచ్చ అనే కథలో సందేశమిస్తాడు రచయిత. మంచి మాటలతో వినయం నటిస్తూ తారసపడిన స్త్రీలను వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లొంగదీసుకునే ఓ మగాడి కథ ఏకాభిప్రాయం.
ఇక తరువాతి కథ పేరు పట్టాయ. పట్టాయ అంటే ఒక పట్టాన అర్థం కాలేదు. గూగుల్‌లో శోధిస్తే అది థాయ్‌లాండ్ దేశంలో ఒక నగరం పేరు అనీ, మసాజ్ సెంటర్లకూ, బార్లకూ, వ్యభిచారానికీ ఫేమస్ అనీ తెలిసింది. ఈ కథలో అక్కడకు వెళ్ళేవారి ఆకలి గురించీ,అక్కడ పడుపువృత్తిలో ఉన్న వారి ఆకలి గురించీ వర్ణిస్తున్నాడు రచయిత. అదేంటోగానీ ఈ కథ చదివితే పడుపు వృత్తిలో ఉన్నవారిపై మనకు జాలి కలుగదు. ఓ సాఫ్టువేర్ ఉద్యోగి ఓ టీకొట్టు అమ్మాయిని ముగ్గులోకి దింపుతాడు అపస్మారకం కథలో. 'టూ మినిట్స్'కోసం సిద్ధపడుతుండగా అనుకోని సంఘటనలు ఎదురై తను పాల్పడిన నీచానికి సిగ్గుపడుతూ, జ్వరంలో వున్న తన బాబు గురించి కంగారు పడుతూ చివరకు స్మారకంలోకి వస్తాడు అతడు.
భర్తకు విడాకులు ఇవ్వడానికై లాయర్‌ను సంప్రదించబోయి ముప్పయ్ రెండేళ్ల స్త్రీ ఒక సమస్య వల్ల సతమతమవుతూ సామూహిక మానభంగానికి గురవుతుంది ఇంకోవైపు అనే కథలో. చివరి కథ పేరు బియాండ్ కాఫీ. అదొక రెస్టారెంట్ పేరు. ఆ రెస్టారెంట్లో ఒక స్త్రీ పరిచయమౌతుంది రచయితకు. తన భర్త పైన కంప్లయింట్స్ చెబుతూ అతడిని అభాసుపాలు చేయడానికి ప్లాన్ అడుగుతూ ఉంటుంది రచయితని. భర్త కూడా తన భార్య మ్యాడ్ అనీ ఆవిడ మాటలు నమ్మవద్దనీ నమ్మితే డేంజర్లో పడతారనీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇద్దర్లో ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో చివరి దాకా సస్పెన్స్ కొనసాగించాడు ఈ కథలో.
దాదాపు అన్ని కథలలోనూ స్త్రీ పురుషుల మధ్య అనైతిక సంబంధాల ప్రస్తావన వస్తుంది. కనీసం అలా ధ్వనిస్తుంది. ఉదాహరణకు ఘటన కథలోని ఈ వాక్యాలు చదవండి.
'మ్మ్'... మూలిగింది.
కుర్రాడు చటుక్కున ఆమె దగ్గరికొచ్చి పట్టుకున్నాడు. పెనుగులాడుతూ ఉంది. వైద్యుడు రోగిని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. పెనుగులాడుతూ ఉంది. పురుషుడు స్త్రీని పట్టుకున్నట్టు.
ఆ తర్వాత వాళ్లు ఇంటి నుంచి బయట పడటానికి మరికొంత సమయం పట్టింది.
ఈ వాక్యాలు లేకపోయినా కథకేం భంగం వాటిల్లేది కాదు.
వీటికి మాడ్రన్ ఫేబుల్స్ అని కితాబు ఇచ్చారు ముక్తవరం పార్థసారథి గారు. దీనితో ఈ పుస్తకం చదివినవారు ఎంతమంది ఏకీభవిస్తారు? మహమ్మద్ ఖదీర్‌బాబు కథలు పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. థాయ్‌లాండ్, మణికొండ, జూబ్లీహిల్స్ నేపథ్యంలో సాగే కథలకంటే కావలి బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే కథల్నే ఖదీర్ బాబు నుండి పాఠకులు కోరుకుంటారని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఒక రకంగా ఈ పుస్తకంలోని కథలు ఎబ్బెట్టు కథలు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి