...

...

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

15, సెప్టెంబర్ 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 49


ఆధారాలు:  
అడ్డం:

1. అడవి బాలకి కాదు వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలామందే ఉన్నారు (4)
3. సదాను పోలిన నటి (పేరులో) వెనుదిరిగింది (2)
7. అబద్ధము కానిది అటునుంచి (2)
8. ఎక్కడికి? లిటరరీ మీటింగుల కే నా? (3, 4)
1 0. బాపినీడు నడిపిన ఓ పత్రిక గజిబిజి అయ్యింది (3)
12. సర్వసాధారణమైన విషయం కాబట్టే తడబడింది (11)
13. అటునుంచి దగ్గు (3)
14. భారతీయుడు సినిమాలో కథానాయిక (3, 4)
15. పానము లేని పానపాత్రము వెనుకనుంచి (2)
17. పేరాశలో విషయ పరిచ్ఛేదము (2)
18. తి. తి. దే తాజా మాజీ ఛైర్మన్గారు కొంచెం తడబడ్డారు పాపం (11) 

నిలువు:
1. గలివర్ ట్రావెల్స్ మాతృక అనదగిన మొదటి తెలుగు నవల. పంతులుగారిది  (4, 4, 3)
2. హాని కలిగించడానికి ఇది విషం కాదు కదా! అమృతం లాంటి తేనె (2)
3. పెరుగుట విరుగుట కొఱకే ధర తగ్గుట హెచ్చుట కొఱకె జాబితాలో మొదటిది. మొదట్లోనే కాస్త తత్తరపడింది (4, 4, 3)
4. జంఘాల శాస్త్రిగారి పిక్క ఒకటి తలక్రిందలయ్యింది J (2)
5. కాంతం కథల యతిపద్మరాగమానవకంఠీరవ రావుగారు J (5, 6)
8. జనాదరణ పొందిన ఈలపాట రఘురామయ్య గారి శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా పాట. చివరలో హ్రస్వమే (3, 4)
9. రాజ్యాంగ న్యాయశాస్త్రము ఆంగ్లంలో (6, 1)
10. మొదటి రెండు వదలి పారాయణము చేయుము (3)
11. కింగ్స్ టన్రాజధానిగా గల ద్వీపము (3)
16. పాడియావు ధర్మాన్ని చూపుతుందా? ( 2)
17. దారము పేను (2)


11, సెప్టెంబర్ 2011, ఆదివారం

దివిటీ పట్టుకవస్తా


పై కవితను రాసింది ఎవరో ఊహించండి. నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడిన ఈ అభ్యుదయ కవిత ఏ కవి కలం నుండి వెలువడింది?

10, సెప్టెంబర్ 2011, శనివారం

నువ్వేనేను, నేనేనువ్వు


పులిగడ్డ విశ్వనాథరావు గారి కథ నువ్వే నేను, నేనే నువ్వు కథాజగత్‌లో చదవండి. ఈ కథపై బాపుగారి ప్రశంస ఇంతకు ముందు టపాలో చదివారు కదా! ఇప్పుడు ఈ కథపై ప్రఖ్యాత రచయిత మంజుశ్రీ(అక్కిరాజు రమాపతిరావు)గారి అభిప్రాయం ఇక్కడ చదవండి.

"కథకు ఏది ఆయువు పట్టో, ఏది ప్రాణమో మీకు బాగా తెలుసునని ఈ కథ ద్వారా నాకు తెలిసింది. చాలా ఆర్ద్రతతో మీరు రాశారు. చదివిన వాళ్ళకు కూడా ఆ స్పందన స్పర్శ అనుభూతినిస్తుంది. మాటకారి తనానికీ, కారుణ్య రస ఆత్మావలోకానికీ సాధారణంగా పొందిక ఉండదు. ఆ పొందిక కూర్చడం కష్టం. కథ కొసకంటా వచ్చేసరికి కళ్ళు చెమరింపచేయగలగడం సామాన్యం కాదు. అసామాన్యమే. మీరీ కథలో ఒక కొత్త సొగసును చూపారు. తెచ్చారు. ఒక కొత్త శిల్పం - ఒక కొత్త బాణీ - కొత్త వస్తువు - కొత్త కథనం. అన్నీ బాగున్నాయి. కథా రచనలో ఒక సంభ్రమాన్ని చివరిదాకా పోషించారు. మానవజీవితాన్ని ప్రేమించడం నేర్పడమే కథ అత్యంత విశిష్ట ప్రయోజనం. జీవితం పట్ల ఆశనూ, ఆశ్వాసాన్నీ మప్పడంకన్న  సాహిత్యానికి సార్థకత ఏముంది? ఏముంటుంది?"

మరి మంజుశ్రీగారి అభిప్రాయంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో ఈకథ చదివి నిర్ణయించుకోండి.  

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ముద్దుకృష్ణ


వైతాళికులు కవితా సంకలనకర్తగా పేరుగడించిన ముద్దుకృష్ణ 1933లో జ్వాల అనే పత్రికను నడిపారు. మూఢవిశ్వాసాలతో ఉన్న ఆనాటి సమాజాన్ని ఒక్క సారిగా ఊపివేసి, యువకుల్లో స్వతంత్రమైన ఆలోచనా శక్తికి దోహదం చేసిన ఆనాటి తెలుగు పత్రికలలో జ్వాల ఒకటి. ఎక్కువ కాలం ఈ పత్రిక వెలువడకపోయినా ఆ కాలంలో సంచలనాన్ని సృష్టించింది. ముద్దుకృష్ణ గారు ఇంకా అశోకం, టీకప్పులో తుఫాను, భీమా విలాపంలో భామా కలాపం మొదలైన నాటికలు వ్రాసి ప్రదర్శించారు. 

8, సెప్టెంబర్ 2011, గురువారం

ఆవిడగారు

కొఠారి వాణీచలపతిరావు గారి కామెడీ కథ ఆవిడగారు కథాజగత్‌లో చదవండి.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఈ అభ్యుదయ రచయిత ఎవరు?


పై ఫోటోలో ఉన్న రచయితను గుర్తించగలరా? 
ఈ రచయిత నడిపిన పత్రిక పేరేమిటి?