బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్)
కథ విశ్లేషణకి ఎంచుకున్న కథ ఇది.
సాధారణంగా ట్రైన్ ఆక్సిడెంట్ జరిగింది... అంటే....
ముందుగా వచ్చే ప్రశ్న ఎంతమంది మరణించారు?
ఆస్తి నష్టం ఎంత..?
ఆక్సిడెంట్ ఎలా జరిగింది..?
ఎవరైనా కావాలని చేసారా?
ఎవరైనా పెల్చేశారా?
ఇలా అంతు లేని ప్రశ్నలు... జవాబు లేని ప్రశ్నలు... ఉద్భవిస్తాయి కాని సంఘటనని పరిశీలించిన తరువాతే ఫలితాలు వెల్లడి తెలుస్తాయి.
ప్రయాణికుల భద్రతా... ప్రయాణికుల అసౌకర్యాలు.... ఎంక్యిరీస్ ఇలా ఎన్నో ఉపద్రవాల మధ్య రైలు ప్రమాదం గురించిన ప్రశ్నలు ఉద్భవిస్తాయి ....
కాని ఎవరి ప్రమేయం లేకుండా ప్రకృతి వల్ల కూడా రైల్వే ట్రాక్ డామేజ్ అవుతే కుడా మేజర్ accidents అయ్యే అవకాశం వుంది.
రచయిత ఆ విషయాన్ని చెప్పలనుకున్నారు.
రైలు పట్టాల మీద నడిచినంత సేపు బాగానే వుంటుంది.
అలా వెళ్ళటానికి వెనక ఎందరి కృషి వుంటుందో ఈ కథ తెలుస్తుంది.
రెండు పట్టాల మధ్య సరియైన సయోధ్య లేకపోతె రైలు పట్టాలు తప్పుతుంది.
కథలో రైల్వే సూపర్ వైజర్ రహమతుల్ల 60 డిగ్రీల మండు టెండలో తన డ్యుటీలో భాగంగా రైల్వే ట్రాక్ చెక్ చేస్తున్నపుడు... ముందుగా
కొన్ని రైలు పట్టాల మధ్య కంకర సరిగా లేక పోవటం గమనిస్తాడు. అందుకు రైల్వే ట్రాక్ లో కొంత భాగం సిమెంట్ స్లీపెర్స్, కొంత భాగం స్టీల్ స్లీపెర్స్ వుండటం వల్ల కంకరకి పట్టు ఉండక జారిపోటం, మట్టి మిగిలిపోవటం అవుతుంటుంది.దానికి కారణం (కంకర) బాలస్ట్ తక్కువ కావటం, పని ఒప్పుకున్నా కాంట్రాక్టర్ పని సగం లో వదిలేసి వెళ్ళిపోటం అని అనుకుంటాడు
"అసలు తన చేతి కింద ముప్పైమూడు మంది గ్యాంగ్‌మెన్లు ఉన్నా ఎప్పుడు సగానికి పైగా ఇతర పనులకు పురమాయిస్తాడు తన జూనియర్ ఇంజినీర్ (జే.ఇ) లింగారెడ్డి. మిగతా వాళ్లలో లీవు పెట్టిన వాళ్లు, పనికి ఎగనామం పెట్టిన వాళ్లు పోనూ గ్యాంగ్ బలం ఏడెనిమిది మంది కంటే మించదు. ఇంత తక్కువ మందితో పని నెట్టుకు వస్తున్నా పై అధికారులనుండి మాటలు పడటం తప్పలేదు" అని అనుకుంటాడు
మరి కొంత దూరం వెళ్ళినపుడు రైల్ పట్టాలు వంగిపోయి, వంకర్లు తిరిగి వుండటం చూస్తాడు. బక్లింగ్ అంటారు దాన్ని. అదే సమయం లో అదే ట్రాక్ పైకి ఎ.పి express వచ్చే సమయం అవటం వచ్చే ఉపద్రవాన్ని ఎలా ఆపాలో అర్థం కాదు రహమతుల్లకి .. అయినా వెంటనే స్పందించి కూలీ లని పిలిచి, హేల్పెర్ లని పిలిచి డేంజర్ ఫ్లాగ్ ని రైల్ పట్టాల పై పాతిస్తాడు. ఆ పని పూర్తి కాకుండానే రైల్ వచ్చేస్తుంది. లక్కీ గ రామయ్య పాతిన డిటో నేటేర్స్ ని పేల్చు కుంటూ రైల్ ఆగి పోతుంది. ఒక్క రెండు మూడు మీటర్స్ దాటితే పెద్ద ప్రమాదం సంభవించేది. డ్రైవర్ సమయానికి స్పందించటం వాళ్ళ ఆ రైలు ఆగిపోతుంది.
రైల్లోని జనం ఊపిరి పీల్చుకుంటారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు...
ఆ తరువాత రైల్వే ట్రాక్ బాగు చేయటానికి రహమతుల్ల చాల కష్ట పడతాడు.
వంగిపోయిన రైల్ పట్టాలు కట్ చేసి వేరేవి అతుకు వెయ్యాలంటే చాల సమయం పడుతుంది.
పరిస్తితి అర్థం చేసుకున్న రహమతుల్ల వెంటనే జే. యి. తో ఫోన్ లో మాట్లాడి కట్టింగ్ మేచిన్ , వెల్డింగ్ మేచిన్ కావాలని అడిగి తెప్పించటం. పని వాళ్ళు, కట్ చేసిన రైల్ ముక్కల్లో (పట్టా ముక్కలు ) కొత్త రైల్ పట్టా అతుకు వేయటం... ఇలా చాల పనులు వేగవంతం చేసి... పట్టాలు బాగు చేసి express రైల్ ని క్షేమం గా గమ్యం చేరేటట్లు చేస్తాడు.
ఈ సమయంలో అనేక రైళ్ళకి రాక పోకలకి అంతరాయం కలుగుతుంది.
కాని సమయ స్ఫూర్తి తో superviser రహమతుల్ల చేసిన పని అక్కడున్న వారందరూ శ్లాఘిస్తారు.
ఆ ఆనందం తో మనస్పూర్తి గా సంతృప్తితో ఇంటికి వెళ్ళిన అతనికి ఆ తరువాత పై అధికారుల నుంచి మేమో వస్తుంది. డ్యూటీ సరిగా చేయనందుకు.... అనేక రైళ్ళ సమయాలకు ఆటంకం కలిగినందుకు
ప్రయానికులకి తీవ్ర అసౌకర్యం కలిగినందుకు. అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా వచ్చిన ఉత్తర్వు అది.....
కాని ఈ కథలో రహమతుల్ల చేసిన దేశసేవ, అలుపెరగని నిస్వార్ధం, పని మీద ఏకాగ్రత, ప్రమాదం జరగ కుండ చుసిన సమయ స్ఫూర్తి, కొన్ని గంటల పాటు మండు టెండలో విశ్రాంతి లేకుండా పని చేయటం, చేసే పనిలో సాధక బాధకాలు. అన్ని అతనికే తెలుసు.
ఇతని సేవని గుర్తించని ప్రభుత్వం తిరిగి అతని పైనే చర్య తీసుకోవాలనుకోవటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఉదయిస్తుంది.
జరిగిన సంఘటన పై విచారణ లేకుండా.... న్యాయ విచారణ లేకుండా అతనికి ఉతర్వ్యులు పంపటం ఈ కథకి కొస మెరుపు.
ఈ కథలో రచయిత రైలు కి సంబంధించిన అనేక పదాలు వాడారు.
సామాన్యులు ఆ పదాలని అర్థం చేసుకుంటే ఈ కథ లోని సారాంశం బోధ పడుతుంది.
చాల కథలలలో మాదిరి కుటుంబ కలహాలు, సూటిపోటి మాటలు అనవసర సంభాషణలు మనకి ఈ కథ లో కనిపించవు.
కథ లో వాడిన terminology చాల కొత్తగా వుంది..
ఈ కథ కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని అనటం లో సందేహం లేదు.
రచయిత ఈ కథలో వాడిన ఆంగ్ల పదాలు కొన్ని .......
బావుటా, డిటొనేటర్లు 'బ్యానర్ ఫ్లాగ్ డౌన్ లైన్, బ్లాక్‌స్మిత్ ఎస్.ఇ.,ఏ.డి.ఇ. మోపెడ్ ట్రాలీ కళాశిల,
ట్రాక్, స్ట్రెసస్ ,మూడో స్లీపరు క్లిప్పులు, కె.ఎం.పి.హెచ్, క్లిప్పులు, అలైన్‌మెంట్ ప్యాకింగ్ గ్యాస్ కటింగ్, హాక్‌సా బ్లేడ్ల, రైలు , డీ స్ట్రెస్సింగ్ ప్లాన్, వెల్డింగ్, కాషన్ఆర్డర్ .... ఇలా ఎన్నో అర్ధమయ్యే చిన్న చిన్న నూతన (ఆంగ్ల) పదాలు కథలో వాడుకున్నారు.....
ఈ కథ తెలుగుదే అయినా పైన ఉదహరించిన పదాలకు తెలుగులోనే చెబితే అర్థం మారిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఆంగ్ల పదాలయితీనే సరిగా వాడుకోవటం జరుగుతుంది.
ఈ కథ నిజంగా నూతన కథాంశం అనటం లో సందేహం లేదు.
రైలు అంటే రైలు బండి, రైలు పట్టాలు అనే అందరు అనుకుంటారు
కాని ఒక రైలు పట్టాల పైకి రావాలంటే ఎందరి కృషో అవసరమని ఈ కథ ద్వార అర్థమవుతుంది.
1 కామెంట్:
ఈ కథ చాలా కాలం క్రితం చదివిన జ్ఞాపకం.. మీరు రాసిన సంవత్సరం కూడా ఇస్తే బావుణ్ణు.. ఏది ఏమైనా మంచి కథ..రైల్వే శాఖ లోని సాధక బాధలను అద్దం పడుతుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి