నా కథ ఒకటి నవ్య వీక్లీలో 2008 ఫిబ్రవరి 27 సంచికలో ప్రచురింపబడింది. బహుమానం దాని పేరు. ఆ కథకు మంచి స్పందనే లభించింది. భద్రాచలంలో జరిగిన జాగృతి కథారచయితల సమ్మేళనంలోనూ, కడపలో జరిగిన అరసం మహాసభలలోనూ, విజయవాడలో జరిగిన ప్రపంచ రచయితల మహాసభలలోనూ పాల్గొనడానికి ఈ కథే కారణం అని నా ప్రగాఢ నమ్మకం. ఈ కథను తన కథాసాగరమథనంలో సమీక్షించిన తరువాతే కస్తూరి మురళీకృష్ణ గారితో పరిచయం ఏర్పడి అది గాఢ స్నేహంగా పరిణమించింది. ఇదే కథను కోపల్లె మణినాథ్‌గారు కథావిశ్లేషణపోటీ కొరకు విశ్లేషించారు. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కథావార్షిక 2008లో చదువదగిన కథల జాబితాలో చోటు చేసుకోవడం. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే నాలుగున్నరేళ్ల తరువాత నా కథ ప్రింటయింది. ఈ రోజు అంటే 30-12-2012 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా కథ తీగలాగితే... ప్రచురితమయింది. సరదాగా వ్రాసిన ఈ కథను చదివి మీ అభిప్రాయం చెప్పండి.
2 కామెంట్‌లు:
you should also thank sri sai brahmanandam gorti and me for inspiring u to write a story after so long. good story.
కథ సింపుల్ గా, సూటిగా చాలా బాగుంది. భూమి గుండ్రముగా వుండును అన్నట్టు మొదలుకే వచ్చి చేరింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి