వర్తమాన కథాకదంబం కథాజగత్ రెండువందల కథలను ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు నిర్వహించిన కథావిశ్లేషణ పోటీ ఇంతటితో ముగిసింది. ఈ పోటీకి వచ్చిన స్పందన క్రితం సారి నిర్వహించిన పోటీతో పోలిస్తే సంతృప్తికరంగానే వుంది. ఈ పోటీ మూలంగా కథాజగత్ ను మొదటిసారిగా సందర్శించిన వారి సంఖ్య బాగా పెరిగింది. పోటీలో పాల్గొన్న వారు చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. మొత్తం 27కథలపై 29 విశ్లేషణలు 16మంది బ్లాగర్ల నుండి పోటీకి వచ్చాయి. పాల్గొన్న అందరికీ తురుపుముక్క అభినందనలను తెలియజేస్తోంది. శుభాకాంక్షలను అందిస్తున్నది. అందరికీ 50రూపాయల విలువ గల ఇ- పుస్తకాన్ని ప్రోత్సాహక బహుమతిగా పంపిస్తున్నాము. పోటీ ఫలితాలు అతి త్వరలో తెలియజేస్తాం. ఈ పోటీకి సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పోటీకి ప్రాచుర్యం కల్పించిన మాలిక, కూడలి,సంకలిని, సమూహము మొదలైన అగ్రిగేటర్ల నిర్వాహకులకు, పొద్దు పత్రిక వారికి,వసుంధర అక్షరజాలం వారికీ, గూగుల్ గుంపులు తెలుగు కథలు, తెలుగు సాహితీ వలయం, సాహిత్యనిధి నిర్వాహకులకు, ప్రస్థానం, ప్రజాశక్తి పత్రికా సంపాదకులకు మా కృతజ్ఞతలు! బహుమతులను స్పాన్సర్ చేసిన కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, ముఖ్యంగా చావా కిరణ్ గారికి మా నెనరులు. మునుముందు మీ అందరి ప్రోత్సాహం తురుపుముక్క, కథాజగత్లపై యిలాగే వుండగలదని ఆశిస్తున్నాం.
...
31, జనవరి 2012, మంగళవారం
26, జనవరి 2012, గురువారం
25, జనవరి 2012, బుధవారం
24, జనవరి 2012, మంగళవారం
23, జనవరి 2012, సోమవారం
21, జనవరి 2012, శనివారం
19, జనవరి 2012, గురువారం
ఆ రచయితను నేనే!
సాహితీ కిరణం మాస పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు గారి కలం నుండి వెలువడిన కథ ఆ రచయితను నేనే కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
17, జనవరి 2012, మంగళవారం
అనుకున్నదొక్కటి
డా.పులిచెర్ల సాంబశివరావు గారి హాస్య కథ అనుకున్నదొక్కటి...! కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
11, జనవరి 2012, బుధవారం
అమ్మ కొడుకు
శ్రీలేఖ సాహితి సంస్థ ద్వారా మూడున్నర దశాబ్దాలుగా సాహిత్య సేవ చేస్తున్న డా.టి.శ్రీరంగస్వామిగారి కలం నుండి వెలువడిన కథ అమ్మకొడుకు కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
9, జనవరి 2012, సోమవారం
ఖాళీ
అన్వేషణ ... అన్వేషణ ...
ఏదో కావాలి.... ఇప్పుడు తన దగ్గరున్నది కాక - తన దగ్గరలేనిది ఇంకేదో కావాలి. ఉన్నది ఏమిటో పూర్తిగా తెలియదు. లేనిదీ, తనకు కావల్సిందేమిటో స్పష్టంగా అర్థంకాదు.
అర్థంకానిదీ ... ఆత్మను తృప్తం చేయగలిగేదీ ఏదో కావాలి ... ఇంకా ..,
ఆ 'ఏదో' కోసమే ఈ అన్వేషణ ...,
ఎక్కడ అన్వేషిస్తావు ... పుస్తకాల్లో ... డిగ్రీల్లో ... డబ్బులో ... మనుషుల్లో ... స్నేహితుల్లో ... సహచరుల్లో ... స్పర్శలో ...దేశాల్లో ... ప్రాంతాల్లో ...,
అమెరికా ... కెనడా ... జర్మనీ ... రష్యా ... చైనా ...శ్రీలంక ... మలేషియా ... వారణాసి ... ఢిల్లీ ... కాశ్మీర్ ... కేరళ ... అడవులు ... కొండలు ... లోయలు ... పర్వతాలు ... ఆకాశాంతర ప్రాంతాలు ... సముద్ర తీరాలు ... దండకారణ్యాలు ...,
ఎక్కడ ... ఎక్కడుంది ... మనిషిక్కావలసింది...,
మనిషికి కావలసినదేదో తెలుసుకోవాలంటే రామా చంద్రమౌళిగారి కథ ఖాళీ చదవాల్సిందేమరి. దీంతో పాటు కథాజగత్‌లో మరో రెండు కథలు!
అవశేషం - చంద్రలత ,
ఈ కథ అసహజం కాదు - వసంత ప్రకాష్
Labels:
katha jagat
8, జనవరి 2012, ఆదివారం
5, జనవరి 2012, గురువారం
4, జనవరి 2012, బుధవారం
3, జనవరి 2012, మంగళవారం
కల్పన
సామాన్య గారి కథ కల్పన కథాజగత్‌లో చదవండి. చదువుకొని నేరుగా ఉద్యోగాలలోకి వెళ్లిపోయి ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్నా, వివాహం ద్వారా 'మాతృత్వం'లోకి లాగబడి, కేవలం భార్యలుగా, తల్లులుగా మారిపోతున్న ఆధునిక యువతుల జీవిత పర్యవసానాన్ని రికార్డు చేసిన కథగా విశ్లేషకులచే గుర్తింపబడిన ఈ కథను చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.
Labels:
katha jagat
బహువీక్షణం
2011లో తురుపుముక్క బ్లాగులోఎక్కువమంది వీక్షించిన టపాలు ఇవి. (Bloggerలో కొత్తగా ప్రవేశ పెట్టిన Stats ఆధారంగా)
కథా విశ్లేషణ పోటీ!
ధిక్కార స్వరంపై జ్యోతిగారి అభిప్రాయం!
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు?
దీనిభావమేమి?
కథా విశ్లేషణ పోటీ!
ధిక్కార స్వరంపై జ్యోతిగారి అభిప్రాయం!
ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు?
దీనిభావమేమి?
1, జనవరి 2012, ఆదివారం
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 62
పైన గాడ్జెట్ లో యిచ్చిన ఆధారాలతో పజిల్ ను నింపండి. పూర్తి చేసిన తరువాత మీ సమాధానాలను వ్యాఖ్యల రూపంలో ఇక్కడ పోస్ట్ చేయండి.
మీ సమాధానాలు పంపడానికి చివరి తేదీ 7/1/2012.
ఫలితాలు 8/1/2012 తేదీన ప్రకటించబడుతుంది.
Labels:
క్రాస్‌వర్డు పజిల్,
పజిల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)