...

...

18, డిసెంబర్ 2011, ఆదివారం

కథా విశ్లేషణ పోటీ!తెలుగు కథ శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 200 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా థాజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను ఇక్కడ కామెంటు రూపంలో ఇవ్వడమే. వచ్చిన ఎంట్రీలలో  ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నాము. 


ఈ పోటీ 18 డిసెంబర్ 2011 నుండి 31 జనవరి 2012 వరకు వుంటుంది.  31-01-2012 సాయంత్రం 6.00గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది.


నియమ నిబంధనలు:

1. మీ విశ్లేషణను మీ బ్లాగులోనే టపా రూపంలో ప్రకటించాలి. మీ ఎంట్రీలో కథ పేరు కథా రచయిత పేరు స్పష్టంగా పేర్కొనాలి. ఆ కథకు చెందిన లింకును కూడా మీ టపాలో తప్పనిసరిగా ఇవ్వాలి.

2. మీ విశ్లేషణ సుమారు 200 - 500 పదాల మధ్య వుండాలి.

3. మీ టపా సాధ్యమైనంత వరకూ మీరు విశ్లేషించబోయే కథకు పరిమితమై వుండాలి. వ్యక్తిగతంగా ఎవరనీ కించపరిచేదిగా వుండరాదు. అలాంటి ఎంట్రీలు పోటికి పరిశీలింపబడవు.

4. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా విశ్లేషించ వచ్చు. అయితే ప్రతి కథను విడివిడిగా విశ్లేషించి విడివిడి టపాల్లో పెట్టాలి.


5. మీ టపాతో పాటు మీ బ్లాగులో కినిగె.కాం వారి బ్యానరు విధిగా ప్రకటించాలి.
 ఈ బ్యానరుకు సంబంధించిన కోడ్ క్రింద ఇవ్వబడింది.


<a href="http://kinige.com"><img
src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >
<br />కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా </img></a>
పై కోడ్‌ను కాపీ చేసి మీ బ్లాగులో ఉపయోగించుకోవాలి.


6. ఈ పోటీగురించి మీ బ్లాగులో ప్రకటించ వచ్చు కానీ అది కంపల్సరీ మాత్రం కాదు.

7. ఈ పోటీ వున్నంత కాలం, మరియూ ఫలితాలు ప్రకటించే వరకూ మీ ఎంట్రీలను,  కినిగె .కాం వారి బ్యానరును మీ బ్లాగునుండి డిలిట్ చేయరాదు.

8. మీ ఎంట్రీలలోని కంటెంట్‌ను తురుపుముక్కలోగానీ, కథాజగత్‌లో కానీ లేదా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉపయోగించుకునే( ఆ రచయితకు క్రెడిట్ యిస్తూ) హక్కు మాకు వుంటుంది.

9. మీ ఎంట్రీకి చెందిన లింకును ఈ టపాలో కామెంటు రూపంలో పంపాలి. అలాగే mmkodihalli@gmail.com కి ఇ-మెయిల్ చెయ్యాలి. లేకపోతే మీ ఎంట్రీ పరిశీలింప బడటానికి అవకాశం వుండకపోవచ్చు.

10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.   


బహుమతుల వివరాలు:

మొదటి బహుమతి : 2000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

రెండవ బహుమతి : 1000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

మూడవ బహుమతి : 500/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి.


ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 31-01-2012. త్వరపడండి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి