...

...

17, డిసెంబర్ 2009, గురువారం

సాల్ గిరా...!

నేటితో నేను బ్లాగడం మొదలెట్టి ఏడాది పూర్తవుతుంది.
రేపు తురుపుముక్క రెండో సంవత్సరంలో అడుగిడబోతోంది.
ఈ సందర్భంగా వెనక్కి తిరిగి చూసుకుంటే...
వందకు మించిన టపాలు.
వాటిలో అంతో ఇంతో ఉపయోగ పడేవి, ఆసక్తి కలిగించేవి, ఆలోచింప చేసేవి ఒకటో అరో వుండి ఉండవచ్చు. 
మిగతావన్నీ నా మిడిమిడి జ్ఞానాన్ని, ఉత్తుత్తి పాండిత్యాన్ని, స్వంత పైత్యాన్ని ఎత్తి చూపించే టపాలే.
ఐతే ఈ యేడాదిలో కొన్ని వందల గంటల సేపు బ్లాగుల ప్రపంచంలో విహరించినాను.
నా సమయం వృథా కాలేదని ఘంటాపథంగా చెప్పగలను.
ఈ బ్లాగుల ద్వారా ఎంతోకొంత నేర్చుకున్నాను.
ఈ సందర్భంగా నా రాతలను ఓపికతో చదివిన పాఠకులు అందరికీ ధన్యవాదాలు.
లేఖిని అనే ఉపకరణం ద్వారా తెలుగులో నా ఆలోచనల్ని అంతర్జాలంలో పంచుకునే అవకాశం కల్పించిన వీవెన్ గారికి నా నెనర్లు.
ప్రత్యేకంగా నా టపాలపై కౌంటర్లు విసిరిన
ఒరెమూనా, భావకుడన్, సి.బి.రావు, కొత్తపాళీ, పూర్ణిమ, ఊకదంపుడు, వేదాంతం శ్రీపతి శర్మ, మల్లిక్, కస్తూరి మురళీకృష్ణ, వేదాంతం వెంకట సత్యవతి, చంద్రమోహన్, నేస్తం, చదువరి, భైరవభట్ల కామేశ్వర రావు, మలక్‌పేట రౌడీ, చింతా రామకృష్ణారావు, యోగి, ఆత్రేయ, రానారె, కంది శంకరయ్య, ఋషి, ప్రభాకర్ మందార, జయభారత్ సగిలి, చిలమకూరు విజయమోహన్, అమ్మ ఒడి, విహారి, పానీపూరి 123, వేమన, అరుణపప్పు, ధూం మచారా, భావన, అబ్రకదబ్ర, శరత్'కాలం', జీడిపప్పు, వంశీ ఎం.మాగంటి, కత్తి మహేష్ కుమార్, సుధ చిన్ని,ఎస్, బొల్లోజు బాబా, పునర్వసు, వినయ్ చక్రవర్తి గోగినేని, నాగసూరి, కల్పనా రెంటాల, రాం, PKMCT(ప్రవీణ్ శర్మ), ప్రవీణ్ ఖర్మ, అలీ,  సుభద్ర, స్వప్న@కలలప్రప్రంచం, జ్యోతి,
ఓం ప్రకాష్ నారాయణ వడ్డి, మారుతి, మాలాకుమార్,సృజనా రామానుజన్, కుమార్, రాణి, శ్రీలలిత, భవాని, కెక్యూబ్ వర్మ, రాజశేఖరుని విజయశర్మ,అజ్ఞాతలు, అనానిమస్‌లు మరియు తమ్ముడు ఫణి ప్రసన్న కుమార్ అందరికీ నా అభివాదాలు!


అంతే కాక నా అభిప్రాయాలను ప్రచురించిన
రాతలు - కోతలు, ఓంప్రకాష్ వర్క్స్, శ్రీపదములు, ఆంధ్రామృతం, తెలుగు తూలిక, జాజిమల్లి, డా.ఆచార్య ఫణీంద్ర,  వెంకటూన్స్, హాస్యం లాస్యం, రౌడీ రాజ్యం, పొద్దు స్లిప్పుల సర్వీసు, పొద్దు, పల్లవి అనుపల్లవిమంచికంటి, కలలప్రపంచం, రామాకనవేమిరా మొదలైన బ్లాగుల, వెబ్‌సైట్ల నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.


మరియు నా బ్లాగుకు ప్రచారం కల్పించిన కూడలి, జల్లెడ, హారం మొదలైన అగ్రిగేటర్ల యాజమాన్యానికి నా నమోవాకాలు.


నా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలద్వారా తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే వారినందరినీ క్షమించవలసినదిగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాతలు-కోతలు బ్లాగులో అభిమాని పేరుతో అచ్చుతప్పులను ఎత్తి చూపి కస్తూరి మురళీకృష్ణ గారిని ఇబ్బంది పెట్టినందుకు వారిని మన్నించమని వేడుతున్నాను.


మీ అందరి సహాయ ప్రోత్సాహాలు మున్ముందు ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాను.

5 కామెంట్‌లు:

భావన చెప్పారు...

All the best and Wishing you a tremendous success in following years.

kasturimuralikrishna చెప్పారు...

మీరేనా అభిమాని. నా పక్కలో బల్లెంలా, నా అచ్చుతప్పుల వికృతస్వరంలా!!!1 అభిమాని వ్యాఖ్యలకోసం ఎదురుచూసేవాడిని. అభిమాని మీరేనని చెప్పకుండా వుండాల్సింది. ఆ అఙ్నాత బంధం అలాగే కొనసాగితేబావుండేది. అయినా, శుభాకాంక్షలు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

సుంతయు సోకులేక మనసున్ మురిపించెడు వ్యాసరాశికై
సంతతమెల్ల బ్లాగరులు స్వాంతన గోరుచు సేయు శోధనల్
అంతము గావె నీ నవనవాంతరజాలపు తీపి బ్లాగునన్
ఇంతకు నింతగా వెలుగు నీ ఘన కీరితి భారతీ కృపన్

ఊకదంపుడు చెప్పారు...

కాలమూ , కౌంటర్లూ పక్కన పెడితే ..
తెలుగు కధకు, సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ విలువైనది.
ఇలగే కొనసాగించండి
జయోస్తు.



ఒకచే జగత్తునకధల
నొకచే పద్యములతీపి ఓర్పుగ మాకై
ప్రకటింపగ, జాలపుజగ
తికివియె తలమానికమగు తెల్పెద మురళీ.

భవదీయుడు
ఊకదంపుడు

ఊకదంపుడు చెప్పారు...

మురళీ గారు, పై సంబోధనను ఏకవచనంగా బావించవద్దని మనవి
భవదీయుడు
ఊకదంపుడు