...

...

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కథాజగత్‌లో మరో రెండు కథలు!

కథాజగత్‌లో ఇప్పుడు రెండు కథలు చేరాయి. మొదటిది బి.గీతిక గారి పునరావృతం మరొకటి బండ్లమూడి స్వాతి కుమారి గారి శిశిరానికి చోటీయకు. ఈ  కథలపై మీ అభిప్రాయం చెప్పండి.

20, ఫిబ్రవరి 2012, సోమవారం

కథావిశ్లేషణ పోటీ ఫలితాలు!!!


వర్తమాన కథా కదంబం కథాజగత్‌లో 200 కు పైగా కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క కథావిశ్లేషణ పోటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి 29 ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటిలో విజేతలను నిర్ణయించడానికి న్యాయ నిర్ణేతలుగా ప్రఖ్యాత కథా రచయితలు శ్రీ విహారిగారు మరియు శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు వ్యవహరించారు. వారు ఈ ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. వారి నిర్ణయం ఇలా వుంది. 

మొదటి బహుమతి వనజ వనమాలి గారికి సామాన్య గారి కథ కల్పనపై విశ్లేషణకు. 

రెండవ బహుమతి లక్ష్మీ మాధవ్ గారికి అడపా చిరంజీవిగారి కథ అంతర్ముఖం పై విశ్లేషణకు.

మూడవ బహుమతి శైలజామిత్ర గారికి అంబికా అనంత్‌గారి కొడిగట్టరాని చిరుదీపాలు కథపై విశ్లేషణకు. 

విజేతలకు మా అభినందనలు! మొదటి బహుమతిగా వనజ వనమాలి గారికి రూ 2000/- విలువజేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను, రెండవ బహుమతిగా లక్ష్మీ మాధవ్ గారికి 1000/- విలువ కల కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను, మూడవ బహుమతిగా శైలజామిత్రగారికి 500/- విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను పంపడం జరిగింది. ప్రోత్సాహక బహుమతిగా పాల్గొన్న వారందరికీ 50/- విలువ జేసే కథాజగత్ ఇ- పుస్తకాన్ని ఇదివరకే పంపడం జరిగింది. మొదటి బహుమతి మరియు ప్రోత్సాహక బహుమతులను స్పాన్సర్ చేసిన కినిగె డిజిటల్ టెక్నాలజీస్ వారికీ ముఖ్యంగా చావా కిరణ్‌గారికి, రెండవ మరియు మూడవ బహుమతులను స్పాన్సర్ చేసిన మిత్రుడు ఎ.మంజునాథ్ శెట్టి(గుత్తి)కీ నా ధన్యవాదాలు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన పెద్దలు విహారిగారికి మరియు మిత్రులు మురళీకృష్ణ గారికీ నా కృతజ్ఞతలు.

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

18, ఫిబ్రవరి 2012, శనివారం

అమ్మీ



"వును కోకీ, నా చిన్నప్పుడు మీ దేశం కథలు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎన్నో చదివాను. అందులో ఒక కథ 'తన భర్తని బాణంతో చంపి - వేటగాడు మటల్లో వేసి కాలుస్తుంటే - నా భర్త చనిపోయిన తరువాత నేను బ్రతికుండి ఏమి లాభం! నేను కూడా మంటల్లో పడి ఆ వేటగాడికి ఆహారమవుతానని ఒక్ పావురాయి నిప్పుల్లో దూకి చనిపోయిన కథ' చదివిన తరువాత నాకు మీ దేశం మీద ఎంతో గౌరవం పెరిగింది. అలాంటి ఇంత గొప్ప త్యాగభూమిలో హృదయంలేని స్వార్థపరులెలా పుట్టుకొచ్చారే తల్లీ?" అంది అమ్మీ. అమ్మీ మాటల్లోని ఔచిత్యాన్ని తెలుసుకోవడానికి  ఎస్.గణపతిరావుగారి కథానిక అమ్మీ కథాజగత్‌లో చదవండి.

11, ఫిబ్రవరి 2012, శనివారం

విద్వాన్ విశ్వం పుస్తకం వెలువడింది



నేను, డా.నాగసూరి వేణుగోపాల్ సహసంపాదకులుగా వ్యవహరించి రూపొందించిన పుస్తకం సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం వెలువడింది. విద్వాన్ విశ్వంను పరిచయం చేస్తూ పలువురు పలు సందర్భాలలో వ్రాసిన వ్యాసాలూ, వారి రచనలపై అభిప్రాయాలూ, విద్వాన్ విశ్వం వ్రాసిన పీఠికలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సందేశాలు ఈ పుస్తకంలో పొందుపరిచాము. 264 పేజీలున్న ఈ పుస్తకం వెల 200 రూపాయలు మాత్రమే. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, సాహిత్య భారతి మొదలైన దుకాణాలలో ఈ పుస్తకం లభ్యమౌతుంది. లేదా నాకు పైకం పంపితే పుస్తకాన్ని కొరియర్ ద్వారా పంపగలను. పుస్తకాభిమానులు ఈ పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.    

స్పర్శించే స్వరం


  ఆశబోతు, పొగరుబోతు. సమకాలీన వీరుడు. ఒక్క అక్షరం ముక్కతో సమాజాన్ని ఎదిరించినోడు. జీవితాన్ని యుద్ధమంత అందంగా జీవించినోడు. ప్రగతిశీల ఉద్యమాల బాటలో పూలై పూసినోడు. చీకటి జీవితంలో కూడా చిరునవ్వును వీడనోడు. ఆకాశానికి, భూమికి హద్దులు చెరిపేసినోడు. మాటలకు, రాతలకు మధ్య ఖాళీని పూరించినోడు, ప్రపంచాన్ని తిరగేసి సత్తా చాటాలనేటోడు. ఎగిరే జెండాలకు దరువైనోడు. బతుకుపుటల్లో కవిత్వపు మెతుకులు తిన్నోడు.
  తాగుబోతు, తిరుగుబోతు. సాహిత్యమంటే తీరని ప్రేమున్నోడు. సముద్రాన్ని ఎదురించి అలలకు తన తాత్వికత బోధించెటోడు. హిందీ అయినా, ఇంగ్లీషైనా అనువాదాల నిండా తన ముద్రను చెరిపేసుకోగలిగినోడు.
  మనిషిని ... మనసును తనకు మించి ప్రేమించగలిగినోడు. సమాజపు పొరలు దాటి బతకటం చేతైనోడు. హృదయానికి స్వేచ్ఛను, స్వచ్ఛతని ఇవ్వగలగినోడు.
  వాడు .. నిజంగా ... నిఝంగా వాడే. వాడి గురించి ఇలా రాస్తూపోతే అక్షరాలు ఎరుపెక్కుతాయ్ ... నల్లరంగు పులుముకొని నవ్వేస్తాయ్ ... మౌనంగా రోదిస్తాయ్ ... ద్రవాలై స్రవిస్తాయ్ ... ఆపై క్రీడిస్తాయ్. వాడిని గురించి ఇంకా తెలుసుకోవాలంటే కథాజగత్‌లో డా.ఎ.రవీంద్రబాబు వ్రాసిన స్పర్శించే స్వరం కథ చదవండి. 

9, ఫిబ్రవరి 2012, గురువారం

స్త్రీవాద కథ!

మన బ్లాగరు వనజ వనమాలి గారి డైరెక్టు కథ లోపం లేని చిత్రం కథాజగత్‌లో చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

రమ్యమైన భోజనం!

రుచికరమైన తిండికి మొహం వాచిన మగవాడు తన భార్యకు వంట చేయడం రాక పోతే పడే పాట్లను చిత్రించారు తమ్మెర రాధిక గారు తమ రమ్యమైన భోజనం కథలో. కథాజగత్‌లో ఈ కథను చదివి ఆనందించండి. 

6, ఫిబ్రవరి 2012, సోమవారం

ప్రేమ కవరు దొరికింది

డా. కె.గీతగారి ప్రేమ కవరు పోయింది కథ కథాజగత్‌లో చదవండి. అలాగే త్వరలో ప్రకటించబోయే ఈ క్రింది కథల కొరకై వేచి చూడండి.

1. అమ్మీ - ఎస్.గణపతిరావు
2. సంపెంగ - సడ్లపల్లె చిదంబరరెడ్డి

1, ఫిబ్రవరి 2012, బుధవారం

వానప్రస్థం

వానప్రస్థం పేరుతో కథాజగత్‌లో ఇది వరకు సాయి బ్రహ్మానందం గొర్తి గారి కథ చదివారు కదా. ఇప్పుడు అదే పేరుతో గన్నవరపు నరసింహమూర్తి గారి కథను చదవండి.