...

...

31, అక్టోబర్ 2010, ఆదివారం

శుభాకాంక్షలు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా తెలుగు బ్లాగుమిత్రులందరికీ శుభాకాంక్షలు.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 31 సమాధానాలు!


భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి అభినందనలు!

30, అక్టోబర్ 2010, శనివారం

మజ్బూర్!

రంజాన్ పండగ పొద్దు జానికి మామి ఇచ్చిన షీర్‌ఖుర్మా ఎందుకు చేదుగా అనిపించింది? తెలుసుకోవాలంటే స్కైబాబ కథ మజ్బూర్ కథాజగత్‌లో చదవండి.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 31


ఆధారాలు: 
అడ్డం: 
1. రక్షకభటుల జబర్‌దస్తీ! లాఠీదెబ్బలు తిన్నవారు ఇది నశించాలి అని గోలపెడతారు.
3. రఘు, శంకరుల అల్పాచమానము :)

5. 'ఆధునిక సాహిత్యం స్త్రీవాద భూమిక' అనే గ్రంథం రచించినది కేతవరపు వారి అమ్మాయా?
7. అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్లా ఇలా చూడకు దేన్నీ అంటాడు శ్రీశ్రీ.
9. కాశ్మీరు సుందరి అనారాగుప్తా కథ ఆధారంగా తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా! ఇదే పేరుతో కోదండరామిరెడ్డి సినిమాకూడా వుంది.
10. సినీనటి జయప్రద అసలు పేరు?
11. సాయంత్రమున మనకు ఉపయోగపడేది. 
14. కట్టమంచివారి సుప్రసిద్ధ కావ్యము.
15. అటునుంచి ఈ వోటుతో గట్టెక్కిన యడ్యూరప్ప?
16. గత్తర బిత్తర!
నిలువు:
1. కన్యాశుల్కములోని ఒక సైడు పాత్ర!
2. కత్తిపద్మారావు ఇంటి పేరుకీ హైదరాబాద్ బాంబు పేలుళ్లకీ బుద్ధుడి జన్మస్థలానికీ ఉన్న లంకె.!
4. కల రాజు మణి ఈ పదాలతో సరస్వతి.
5.  కారణ వర్గము(square)తో శివుడు.!
6. గుర్రం జాషువా కుమార్తె ఉప్పుతో కూడిన బంగారు తీగ కదా? 
7. పరమాణు సంఖ్య రెండుగా గల ఉత్కృష్ట వాయువు.
8. పోగాలము దాపురించినచో చేపలు దీనికి చిక్కుకుంటాయి!
9. ఆడ జడ్జి! మేడం జస్టీస్!!
12. తిరుపతిలో ప్రతియేటా మేనెలలో జరిపే ప్రతిష్టాత్మకమైన జాతర తలక్రిందలై కుచించింది.
13. ఈ పురుగుకి మహీలత అనే అందమైన పేరొకటి! 

24, అక్టోబర్ 2010, ఆదివారం

రో(బో)శయ్య


పై వార్త చదవగానే చదువరిగారి ఈ టపా గుర్తుకు వస్తున్నదా?

22, అక్టోబర్ 2010, శుక్రవారం

డామిట్! కథ అడ్డం తిరిగింది!

పినిశెట్టి శ్రీనివాసరావు గారి డామిట్! కథ అడ్డం తిరిగింది! అనే కథను కథాజగత్‌లో చదవండి.

21, అక్టోబర్ 2010, గురువారం

మీరు పుస్తకాన్ని ప్రచురించారా?


ఈ మధ్యకాలంలో మీరేమైనా పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందా? అయితే ఈ టపా మీకోసమే!
రాజారాం లైబ్రరీ ఫౌండేషన్, కలకత్తా వారి పథకం కింద 2008,09,10 సంవత్సరాలలో మొదటిసారి ప్రచురించిన పుస్తకాల కొనుగోలుకై ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన మీ ఉపయోగం కోసం క్రింద ఇస్తున్నాను.



16, అక్టోబర్ 2010, శనివారం

విజయ దశమి శుభాకాంక్షలు!!!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు వారి కుటుంబసభ్యులు అందరికీ తురుపుముక్క విమి పర్వదినాన శుభాకాంక్షలను తెలియజేస్తున్నది.

నిజమా!?!

ఈ రోజు పేపర్‌లో చదివిన ఈ వార్త ప్రలోభాలకు లొంగిపోయే మనిషి నైజాన్ని బయట పెడుతోంది. 


ఏమైనా ప్రజలను ఆందోళకు గురిచేసే అంశాలను ఇలా డీల్ చేసుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చునని సంగతి తెలిసింది హ్యుందాయ్ ఆక్సెంట్ కారు కావాలనుకొంటే మీరూ ప్రయత్నించండి మరి :)

14, అక్టోబర్ 2010, గురువారం

వస్తున్నాయొస్తున్నాయి...

రాబోయే రోజుల్లో కథాజగత్‌లో మీరు చదవబోయే కథల వివరాలు.  
1.పినిశెట్టి శ్రీనివాసరావు - డామిట్! కథ అడ్డం తిరిగింది. 2.సగ్గురాజయ్య - కలిసుందాం రా! 3.బాలి - రుక్కుతల్లి 4.దాట్ల దేవదానం రాజు - లోపలి సడి 5.శ్రీదేవి మురళీధర్ - అమ్మమ్మగారిల్లు

12, అక్టోబర్ 2010, మంగళవారం

కొత్తపాళీ కథ!

సీనియర్ బ్లాగర్  కొత్తపాళీ (ఎస్.నారాయణస్వామి) గారి కథ ఖాండవ వనం కథాజగత్‌లో ప్రకటించాం. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

11, అక్టోబర్ 2010, సోమవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 30 సమాధానాలు!


కొన్ని వివరణలు: 
అడ్డం: 
3. నాగరాజు, నాగసుబ్రహ్మణ్యంలు అన్నదమ్ములుగా నటించిన సినిమా! - లవకుశులుగా నటించిన బాల నటుల పేర్లు ఇవి.
5. హైదరాబాదు నగర శివారులో ఉన్న లేళ్ల పార్కు! - ఈ పార్కు పూర్తి పేరు మాహావీర్ హరిణ వనస్థలి అని గుర్తు చేసిన భమిడిపాటి సూర్యలక్ష్మిగారికి ధన్యవాదాలు.
16.నిలువు 4 లోని వాడే - శుభ్రకరుడు కదా! - తెలుపు అనే శబ్దానికి ధవళము, శుభ్రము అనే పర్యాయపదాలున్నాయి.
నిలువు:
6. వరలక్ష్మీదేవికి ఇ రాలిచ్చుబ్బులు కలవా? (పాపము శమియించు గాక)   - లిబ్బుల జవరాలు
12. రామాయణ అరణ్యకాండలో ఒక ఘట్టము. - మారీచ వధ - ఈ ఘట్టం అరణ్యకాండలో జరిగిందని బాలకాండలో కాదని తెలియజేసిన కంది శంకరయ్యగారికి కృతజ్ఞతలు.


10, అక్టోబర్ 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 30



ఆధారాలు: 
అడ్డం: 
1. ఊరగాయకు ఉపయోగించే ఒకానొక కాయ!
3.నాగరాజు, నాగసుబ్రహ్మణ్యంలు అన్నదమ్ములుగా నటించిన సినిమా!
5. హైదరాబాదు నగర శివారులో ఉన్న లేళ్ల పార్కు!
7. చదువుము ఇక్కడ సైన్యం దాగివుంది!
9. ప్రయోజనము, పరమార్థము!
10. సుపుత్రుడు మన్మథుడే!
11. చేతిగుడ్డ కాస్త నాజూగ్గా!
14.విద్యలు ముదిరితే వేదాలవుతాయా?!
15. టిక్కు టిక్కు బండి! ____ బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి? - గడియారమే కదా?
16. నిలువు 4 లోని వాడే - శుభ్రకరుడు కదా!
నిలువు:
1. మేషము!
2. మధుకరము!
4. అడ్డం16 లోని వాడే - వంద కిరణాలు కలిగినవాడట!
5.  పుల్లంటుఱాయి!
6. వరలక్ష్మీదేవికి ఇల వరాలిచ్చుజబ్బులు కలవా? (పాపము శమియించు గాక)
7. నెమలికి పించము రువ్విన జిడ్డు తగులుతుందా?
8. అల్లకల్లోలమైన గోమాతలు!
9. ఎకెసెక్కెపు మాటలు!
12. రామాయణ అరణ్యకాండలో ఒక ఘట్టము.
13. అగస్త్యుడు -  కుంభసంభవుడు కదా! 

9, అక్టోబర్ 2010, శనివారం

కనుక్కోండి చూద్దాం!కి - సమాధానం!!



కనుక్కోండి చూద్దాం! శీర్షిక ఇచ్చిన పంక్తులు విద్వాన్ విశ్వంగారి సుప్రసిద్ధకావ్యం పెన్నేటి పాట లోనిది. పెన్నా నది ప్రవహిస్తున్న(?) రాయలసీమ ప్రాంతంలోని కరువు పరిస్థితులను పై వాక్యాలు మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాయి. కారణాలు ఏవైనా ఈ కావ్యానికి రావలసినంత పేరు రాలేదు. ఈ అద్భుత కావ్యంపై రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి అభిప్రాయం ఇలా  ఉన్నది.

నా మిత్రులు విద్వాన్ విశ్వంగారి తీవ్ర నిర్వేదమే ఈ పెన్నేటి పాటగా పరిణమించినది.విశ్వంగారిది మానవ హృదయము. ఊహకన్న, భావనకన్న అనుభవమే మూలాధారముగా వెడలిన పరవశ రచన వీరి 'పాట'. 'పీనుగుల పెన్న', 'వట్టియెడారి','నక్కబావలు', 'నాగుబాములు','బొంతగద్దలు','రేణిగంపలు',"పల్లేరుగాయలు','తుమ్మతోపులు' ఇత్యాది అసంఖ్య సామగ్రితో విశ్వంగారి కవితావిరూపాక్షుడు తాండవించినాడు; భాష, అర్థము, భావము, చందస్సు అన్నియు ఆ తాండవమునకు ప్రక్క వాద్యాలు వాయించినవి. 'పిన్పాట' పాడినవి! ఒక మాటలో, ఒక చేయూపులో, ఒక తలయాడింపులో, ఒక తిరుపులో ఈ నటరాజు రాయలసీమలోని భూతభజ్జీవితమునందలి చిన్న పెద్ద ఖండికలెన్నో విసరివైచినాడు. 



కనుక్కోండి చూద్దాం!


ఈ క్రింద పేర్కొన్న కవితా వాక్యాలు ఏ కావ్యం లోనిది? ఎవరు వ్రాశారు? దేని గురించి చెబుతున్నారు?

నాగ కన్యక లిచట
          కనపడరు కాని,
నాగుబాములు చక చక
          సాగు నిచట;
గరుడ గంధర్వ కామినుల్
          కానవడరు గాని,
బొంత గద్దలు
          గుంపు గట్టు నిచట!

ఏలాలతాజాల డోలిక లిట లేవు,
          తిప్పతీగెల తలతిక్కెగాని,
తరుణ ప్రవాళ లతా కుంజములు లేవు,
          రేణిగంపల పొదరిండ్లెగాని;
లలి లవంగ కుడుంగ లాలిత్యములు లేవు,
          తుమ్ముతోపుల ముండ్లదొరులె గాని;
నారికేళాది వనాంతరస్థలి లేదు,
          చిట్టీత డొంకల చేటెగాని;

ఇట గులాబీలు
          తలసూప వెపుడు; వట్టి
తంగెడుల్ బోద గడ్డిగాదములె
          పెరుగు;
సరస సుకుమార తృణ
          సమాచ్చదము లేదు,
పాడు పల్లెరుగాయల
          బీడెగాని!

7, అక్టోబర్ 2010, గురువారం

నవీన్ కథ!

తాను వ్రాసిన నవల పేరునే ఇంటి పేరుగా స్థిరపరచుకున్న ప్రఖ్యాత రచయిత అంపశయ్య నవీన్ గారి కథ తలుపుతట్టని అదృష్టం కథాజగత్‌లో ప్రకటించాము. కథను చదివి ఈ కథకు ఈ పేరు పెట్టడంలో కల ఔచిత్యమేమిటో ఎవరైనా చెప్పగలరా?

5, అక్టోబర్ 2010, మంగళవారం

కథకుడి కథ!

"బూరయ్య కంగు తిన్నాడు. దొరబాబుకు చెప్పిన కథ చెప్పి వుంటే బావుండేదనిపించింది. మంచి అవకాశం చేజారి పోయిందని బాధ పడ్డాడు." ఆ కథ ఏమిటో తెలుసుకోవాలని వుందా? అయితే వెంటనే కథాజగత్‌లో ప్రకటించిన వి.వి.సుబ్బరాజుగారి కథ కథకుడి కథ చదవండి.