...

...

30, అక్టోబర్ 2011, ఆదివారం

అలనాటి పత్రికలు 46


క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 55ఆధారాలు:

అడ్డం:
1. విక్రం అనుష్కలు నటించిన చిత్రం (2)

2. కర్రవలె సాగిలపడి చేయు ప్రణామము (3,5)

7. కేకరములు మధ్యలో ఒక చేయి తొలగించినా మరో చేయి ఉంటుంది. (2)

8. బిచాణా ఎత్తి వేయడానికి మూటతోపాటుగా సర్దుకోవాల్సింది తిరగబడింది (2)

9. పూతరేకులలో లేపనము (2)

10. వనస్థలిపురములో మృగము వెనుదిరిగి కుచించుకుపోయింది. (3)

11. యింటిపేరులో మాలిన్యాన్ని కలిగివున్న తత్వవేత్త (2, 4)

13. కృష్ణమూర్తికి ఇష్టమైన గుంటూరు జిల్లాలోని పట్టణంలో మొదట దీర్ఘంలోపించింది (3)

15. నిలకడలేని స్త్రీ కనుకనే అటూఇటూ తిరిగింది (3)

17. అపసవ్య దిశలో అనుపాలన (3)

18. మండలానికి అధిపతి మార్తాండుడే! (2,4)    

20. అటు నుండి పక్షాంతము (3) 

21. సైన్యము పరిదిలో లేనిది (2)       

22. అనారోగ్యము (2)

24. అడ్డం 1కి సహచరి (2)

25. రారాజు రతిరాజు రాజరాజు కూడిన ఆయుర్వేద ఔషధి (8)

26. గూటియలులో వృక్షాశ్రయి (2)

నిలువు:
1. నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసిలతో జంధ్యాల ఆడించిన ఆట (3, 4)
2. ఏడాది (2)
3. తెడ్డు మెత్తనిది కాదు (2, 3)
4. అడవి, ఆకాశ, కాగడా, కొండ, గుండు, చెండు, నిత్తె, బొండు, బొడ్డు ఇత్యాది పదాలతో జతగూడే పుష్పము (2)
5. కుంభకోణం (2)
6. అడ్డం 1కి తాత (3)
7. రాముడుండాడు రాజ్జిముండాది నవలాకారుడు (5)
9. పూరణము, నింపు (2)
11. హైదరాబాదు శివారులోని ఒక గ్రామపంచాయతీ. జిల్లెళ్లమూడిని  తలపిస్తుంది. J (5)
12. దేవులపల్లి కృష్ణశాస్త్రి  రచించిన ప్రముఖ కావ్యసంపుటి (5)
14. అబలా సచ్చరిత్ర రత్నమాలా గ్రంథకర్త్రి (3, 4) 
16. సూర్యదేవాలయం ఉన్న ఒకానొక పర్యాటక ప్రదేశం  (5)
18. శనీశ్వరుడు (2)
19. తెలుగులో మొట్టమొదటి పూర్తి రంగుల చిత్రం చివర కొంచెం తడబడింది (4)
21. కాపలా (3)
22. టి.వి. యాంకర్. రాజీవ్ కనకాల భార్య (2)
23. తలక్రిందలైన రుమాలు (2)
     24. తరంగిణిలో కన్నడ చిలుక ఎగిరిపోయింది (2)


క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 54 సమాధానాలు!ఈ పజిల్‌ను నింపి పంపిన వారిలో కంది శంకరయ్యగారు అన్నీ సరిగ్గా పూరించగలిగారు.

చదువరిగారు వదిలివేసిన రెండు మినహా అన్నీ కరెక్టుగా ఉన్నాయి.

వినోద్ కుమార్‌గారు నిలువు 25 మాత్రం కనుక్కోలేకపోయారు. నిలువు 10లో ఒక దీర్ఘం ఎక్కువపడింది. టైపాటు కావచ్చు.

ఆదిత్య గారి పూరణల్లో అడ్డం 24లో నా బదులు వా పడింది. అదీ టైపాటు కావచ్చు.

ఇక ఫణి, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు బహుళపంచమి జ్యోత్స్నను కనుక్కోలేకపోయారు :)

అందరికీ అభినందనలు!29, అక్టోబర్ 2011, శనివారం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

27, అక్టోబర్ 2011, గురువారం

అలనాటి పత్రికలు 43


సాహిత్య సమాచారమ్


 కవితల పోటీ
                              
                 మచిలీపట్టణం "సాహితీమిత్రులు " సంస్థ 31 వ వార్షికోత్సవాల సందర్భంగా కవితల పోటీ నిర్వహిస్తోంది. పద్య కవితల పోటీకి ఆరు పద్యాలకు మించకుండా, వచన కవితల పోటీకి 30 పాదాలకు మించకుండా, మినీకవితల పోటీకి ఏ లఘుకవితా ప్రక్రియలైనా ఆరు మించకుండా పంపించవచ్చు. విజేతలకు సన్మానం,  సర్టిఫికేట్లతో పాటు  ప్రతి పోటీలోనూ మొత్తం రెండు వేల రూపాయల విలువైన బహుమతులు అందించబడతాయి.
                             

                    కవితలను జనవరి 10 లోగా  రావి రంగారావు , 20/151-1, మోనికా రెసిడెన్సి, కొబ్బరితోట, చిలకలపూడి, మచిలీపట్టణం - 521002  అనే చిరునామాకు పంపగోరుతున్నారు.... 


                        - సాహితీమిత్రులు, మచిలీపట్టణం. సెల్ : 9247581825

26, అక్టోబర్ 2011, బుధవారం

అలనాటి పత్రికలు 42


పై పత్రిక పేరు ముఖచిత్రం పై ఉన్న డిజైన్‌ను జాగ్రత్తగా పరిశీలించి చూడండి కనిపిస్తుంది. 

పరివర్తన

ఆ మధ్య కథాజగత్‌లో ఒకే పేరు మీద రెండు కథలు వచ్చాయి. నేను సైతం... అనే పేరుతో పంజాల జగన్నాథంగారు, డి.కె.చదువులబాబుగారు చెరో కథ వ్రాశారు. అలాంటి సందర్భమే ఇప్పుడు మరొకటి. పరివర్తన పేరుతో డా.సురేంద్ర కె. దారా గారి కథ కథాజగత్‌లో ప్రకటించాం. అదే పేరుతో ఇంతకు ముందే పి.వి.సుజాతారాయుడు గారి కథ ఒకటి కథాజగత్‌లో వచ్చింది. ఆ పరివర్తనకు ఈ పరివర్తనకు కల తేడాను చదివి తెలుసుకోండి.

25, అక్టోబర్ 2011, మంగళవారం

అలనాటి పత్రికలు 41


మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

అలనాటి పత్రికలు 40


23, అక్టోబర్ 2011, ఆదివారం

అలనాటి పత్రికలు 39


క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 54ఆధారాలు:

అడ్డం:
1. శ్రీశ్రీని భయపెట్టునది (3,3,2)

5. అగ్నిపర్వతములో నుండి వచ్చిన శిలాద్రవము (2)

7. నడుం విరిగిన (2)

8. పూతన ఒక ___ (3)

9. చింతామణి నాటకంలో ఒక పాత్ర (5)

12. సొరుగు (2)

13. దామోదరం సంజీవయ్య హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈయన పేరుమీద ఒక జిల్లా కూడా ఉంది (4)

15. దళసరి కానిది అట్నుంచి (3)

17. సరసముతో అభేదము (5)

18. సునందగారి అకౌంటు (3, 2)

19. చెదిరిన పుండు (3)

21. ఒకానొక గ్రామ దేవత. ఆరుద్ర ఈవిడ పేరుతో పదాలు సృష్టించాడు (4)

23. సుతరామూ కష్టపెట్టని కూతురు (2)

24. వెనుకకు మరలిన వారాంగన (5)

26. పొడుపు వెంట ఉండేది (3)

28. తిరగ బడిన పొలములు (2)

30. కుడినుండి ఎడమకు పార్వతి (2)

31. కృష్ణా జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు (3, 5)
నిలువు:
1. విడిది సబర్మతి ఆశ్రమంలో (2)
2. శూన్యం (3)
3. శర్కర (4)
4. తుమ్మెదలు (5)
5. శతసహస్రములను సాగదీస్తే లక్క (2)
6. 'రాబందులు రామచిలకలు' రచయిత్రి (4, 4)
10. పాండురంగడిని తిరగబడి ఆహ్వానించు (2)
11. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరును అని అర్థాన్నిచ్చే సామెత (4, 4)
12. అరలక్ష మాటల్లో ఆల్ఫాబెట్ (5)
14. ఓండ్ర (3, 2)
15. చేతికి ఇది వదిలిందంటే డబ్బులు ఖర్చైనట్టే లెఖ్ఖ (3) 
16. హరిద్రాచూర్ణము (3)
20. వజ్రాయుధం చేతబట్టిన ఇంద్రుడే కానీ ఇలా తడబడిపోయాడు (5)
22.  కొన మొదలు లేని బొమ్మరిల్లు (2)
23. పేరొందిన (4) 
25. 1995నాటి అంతర్జాల తెలుగుసాహిత్యపు గుంపు (3)
27. తలక్రిందలుగా క్రీడించు (2)
29. నిలువు 3 రుచికి విరుద్ధమైనది (2)