...

...

24, మార్చి 2014, సోమవారం

బహుమతి

2013 నోముల పురస్కారం పొందిన వల్లభాపురం జనార్దనగారి బహుమతి కథ ఇప్పుడు కథాజగత్‌లో! 
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bahumati---vallabhapuram-janardhana

18, మార్చి 2014, మంగళవారం

ఊగులోడు


ఆర్.రాఘవరెడ్డి కథ ఊగులోడు కథాజగత్‌లో

17, మార్చి 2014, సోమవారం

మెదడుకు మేత! -11

కల్పలతలో అడిగిన మరికొన్ని ప్రశ్నలు.

1.రాజులు రత్నాలు వనితలు వజ్రాలు ఒక్కమాటలో ఇమిడ్చి వ్రాయండి.

2.రత్నమును వనితను లక్ష్మిని భూమిని కెమ్మోవిని ఒకమాటలో ఇమిడ్చి వ్రాయండి.


3.ఈ క్రింది వాక్యమును పూర్తిగా వ్రాయండి.
కి
చూడరు
బడుటకు
చూడరు.
లో
బల
వంతుని
ము
చేతి
తమ
వచ్చు
శత్రువుల
వారు






4.ఒక చిత్తరవులో విష్ణుమూర్తి మరియు తలుపు తెరిచియున్న గృహము కలదు. ఈ పట్టణమేది?

5.నిముషములో ఒకసారి ముహూర్తములో రెండుసార్లు కనిపిస్తుంది కాని రాత్రియందు కాని పగలుయందు కాని కానరానిది ఏమిటి?




















మెదడుకు మేత! -10 సమాధానాలు

1.సుధీవరుడు

2.శంభుదాసుడు

3.కొందరిపై కోపము కొందరిపై దయ కలవారు సర్వసములు కారు.

4.పంచములకైనను పదుగురికి యేడుగడ యగువాని జన్మ వేయినోళ్ల పొగడ దగినదని ముమ్మాటికిని చెప్పదగును.

5.రాజమహేంద్రవరము 

పై సమాధానాలను చెప్పడానికి ప్రయత్నించిన ఊకదంపుడు, రెడ్డివారి విజయజ్యోతి గార్లకు అభినందనలు!

14, మార్చి 2014, శుక్రవారం

మెదడుకు మేత! - 10


1) ఒక విద్వత్శ్రేష్ఠునికి లోబడి జాలరి ఒకడును పెండ్లికొడుకొకడును కలరు. విద్వాంసుని తలనరికినగాని జాలరి బయల్పడడు. జాలరి తల నరికినగాని పెండ్లికొడుకు బయల్పడడు. జాలరి తల నరుకక పెండ్లికొడుకు తలనరికిన వాడే ధీరుడు. ఇదంతయూ అయిదక్షరముల మాటలో ఇమడ్చవలెను.  

2)భక్తుడొకడు శివలింగమునకు నమస్కరించుచున్నట్లు ఒక పటమునందు చిత్తరువు వ్రాయబడి వుంది. ఇదొక కవీశ్వరుని పేరు. అతడెవరు?

3)ఈ క్రింది వాక్యమును పూర్తిగా వ్రాయుము.

            
కోపము దయ
కలవారు సర్వ = లు కారు 
కొందరి కొందరి





4)ఈ క్రింది వాక్యమును పూర్తిగా వ్రాయుము.

5ములకైనను 1,2,3,4,5,6,7,8,9,0గురికి 7గడయగువాని జన్మ
100000 10
 నోళ్ల పొగడదగినదని మాఱుమాఱుమాఱులకు చెప్పదగును.

5) ఒక పటమునందు సింహాసనాసీనుడగు పురుషుడొకడును, మేఘములమీదనెక్కియున్న పురుషుడొకడును పెండ్లికొడుకు ఒకడును 'ము' అను అక్షరమును చెక్కబడి ఉన్నవి. ఈ పట్టణమేది? 

పై ప్రశ్నలు సుమారు 110 సంవత్సరాలక్రితం ప్రచురింపబడిన కల్పలత అనే పత్రికలో ఇచ్చినవి. వీటి సమాధానాలు చెప్పగలరేమో ప్రయత్నించండి.

7, మార్చి 2014, శుక్రవారం

స్టోరీ ఆఫ్ ద మంత్!

ఫిబ్రవరి నెలలో కథాజగత్‌లోఎక్కువ మంది చదివిన కథ ఏదో తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.
గూగుల్ అనలిటిక్స్ గణాంకాల ఆధారంగా