...

...

30, జులై 2012, సోమవారం

చిత్రలో అశోక్‌కుమార్‌గారి సమీక్ష!

చిత్ర మాసపత్రిక ఆగష్టు 2012 సంచికలో కె.పి.అశోక్‌కుమార్ గారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకాన్ని సమీక్షించారు. తప్పక చదవండి.29, జులై 2012, ఆదివారం

పుస్తకం.నెట్‌లో నా వ్యాసం!

ప్రబుద్ధాంధ్ర పోరాటాలు అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేను వ్రాసిన వ్యాసాన్ని పుస్తకం.నెట్‌లో ప్రచురించారు. ఆ వ్యాసం ఇక్కడ చదవండి.

26, జులై 2012, గురువారం

పొట్టి కథ

ఏడెనిమిది వాక్యాల్లో ఒక చిన్న కథ వ్రాయవచ్చా? వచ్చని బి.వి.డి.ప్రసాదరావు గారు అంటున్నారు. వారి కథ బొడ్డు కథాజగత్‌లో చదివి ఆ కథ మీకు ఎంత మేర అర్థమయ్యిందో తెలియజేయండి.

22, జులై 2012, ఆదివారం

భీమరాజు వెంకటరమణ కథ!

చాలా రోజుల తర్వాత కథాజగత్‌లో కొత్త కథ ఒకటి వచ్చి చేరింది. భీమరాజు వెంకటరమణ గారి కథ సారీ... సారీ... వైదేహీ! కథాజగత్‌లో చదివి మీ అభిప్రాయం చెప్పండి.

19, జులై 2012, గురువారం

ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తించండి!


పై ఫోటోలో వున్నవారు ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత. వారిని గుర్తుపట్టగలరా? మరొక క్లూ. వీరి కథ ఒకటి కథాజగత్‌లో చదువవచ్చు!


రావూరి భరద్వాజగారిని గుర్తించగలిగిన రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి అభినందనలు!

8, జులై 2012, ఆదివారం

తిరుపతి ప్రోగ్రాము కొన్ని ఫోటోలు!

ప్రముఖ రంగస్థల పద్యనటులు శ్రీ అల్లాబక్ష్ గారికి వారి 82వ పుట్టినరోజు(01-07-2012)న 13వ తంగిరాల స్మారక పురస్కారం అందచేసిన సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు!

నట పాదుషా అల్లాబక్ష్!

పుట్టినరోజు వేడుక!

మనవరాలితో తాతయ్య!అల్లాబక్ష్‌తో తంగిరాల చక్రవర్తి దంపతులు!


అల్లాబక్ష్‌కు ఎడమవైపు సాయిసుందర్ కుడివైపు వేదవ్యాస రంగభట్టర్!

హ్యాపీ బర్త్‌డే టూయూ!

ఆత్మీయుల సత్కారం!

చక్రవర్తి ప్రసంగం!

అవార్డును అందిస్తున్న దృశ్యం!

అల్లాబక్ష్ ప్రక్కన కోడీహళ్లి మురళీమోహన్
అల్లాబక్ష్ గారి స్పందన!

శ్రీకృష్ణ రాయబారంలోని పడక సీను, హరిశ్చంద్రలోని కాటి సీను పద్యాలను శ్రావ్యంగా ఆలపిస్తున్న అల్లాబక్ష్!
ఆంధ్రప్రభలో సాహితీవిరూపాక్షుడు!

ఈ రోజు (08-07-2012) ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై కల్లూరు రాఘవేంద్రరావు గారి సమీక్ష వచ్చింది.