...

...

29, నవంబర్ 2011, మంగళవారం

ఈ సాహితీవేత్తను గుర్తించగలరా?పై ఫోటోలోని వ్యక్తిని గుర్తించండి. ఆయన బిరుదులను పేర్కొనండి.

సరే! ఈ క్రింది ప్రహేళిక చూడండి.

వీరి పేరులో 12 అక్షరాలున్నాయి.

1,3 అక్షరాలతో ఒక రాశి పేరు, 

4,12 అక్షరాలు కలిపితే బలరాముడు, 

5,7,6 అక్షరాలకు కు అనే అక్షరం జోడిస్తే కంజాతపత్రము,

11,2 అక్షరాలతో పశువుల ఒక తెగులు,

8,9 అక్షరాలతో విగ్రహం అనే అర్థాలు వస్తాయి.  ఇప్పుడైనా ఈయన ఎవరో కనుక్కోగలరా? :)

మరొక అవకాశం! ఈ సారి గుర్తించగలరు అని భావిస్తాను. వీరి పై ఫోటోతో పాటుగా కొంచెం వయసు మళ్ళిన తరువాత తీసిన ఫోటోను యిస్తున్నాను.


ఈ సాహితీ వేత్త పేరు, ఆయన బిరుదులను పేర్కొనండి.  

28, నవంబర్ 2011, సోమవారం

కరుణించిన దైవం

వెంపటి హేమగారి కథ కరుణించిన దైవం కథాజగత్‌లో ప్రకటించబడింది. చదివి మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. 

27, నవంబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 58
అడ్డం:
     1. పైన ధరించు చొక్కాయి,  లాంగు కోటు (4)

4. ఆడంబరము, ఆర్భాటము లేదా దర్పములో నవ్వును తొలగిస్తే పుస్తకానికి పైన ఉండేది (2)

5. తూచుట (3)

8. నోరువెడల్పుగల చిట్టి మట్టిపాత్ర (2)

9. నడవను అంటున్న వసారా (3)
11. పసిడితో ఏతము (2)
13. తోబుట్టు వైనట్టి తొయ్యలి నేమందురు? (4)

15.  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతిని అందుకున్న వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన గత దశాబ్దపు చిత్రం (4,1)

18. నాస్తికతలో నాస్తి నాస్తి (2)  

19. పల్లవము (6)

21. మోహన్ లాల్‌ కు చెందిన మళయాళం టీవీ ఛానెల్ (3)

22. ఫుల్లు మూను (2, 4)

24. సీలు లేని తహసీలు (2)

26. జింక చర్మము (5)

27. నందమూరి హరికృష్ణ సోదరుణ్ణి పిలవండి (4)

30.  వగరు, రొప్పు (2)

32. డిస్కౌంటు, ముదరా (3)

34.  స్త్రీల ఈ శరీరభాగాన్ని శంఖంతో పోలుస్తారు (2)

35.  కంతి గల బొట్టు (3)

36.  పేగు(2)

37. ఆడుచీమ (4)

నిలువు:
1. ఉజ్జాయింపు (3)
2. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ __ మేల్ తలపెట్టవోయ్ అంటున్నారు గురజాడ (2)
3. కావు అడవిని వెదకండి (2)
4. మేథ मे ట్రిక్స్ చేసి చూపించి ఇటీవల కన్నుమూసిన రచయిత (5, 6)
6. సినిమాలో రాత్రి (2)
7. ముత్యం అంటేనే స్వచ్ఛతకు మారుపేరు. మరి ఇది మరింత నిర్మలత్వాన్ని సూచించదూ (4, 3)
10. ముచికుంద నదిలో కంబము (2)
12. ఏలెడివాడు (3)
14. లేవడి (3)
16. రవంత, కొంచెము, ఇనుమంత, ఇంచుక (2)
17. అమ్మ ___ ___ మేనమామకు తెలియదా? (4, 3)
20. మంగళసూత్రము (2)
21. చితక్కొట్టిన మాంసం (2)
23. చంద్రుని కూతురా? ఏమో! (3)
     
    24. క్రిందనుండి అనుకూలము (2)
     
    25. హత్య (3)
     
    28. కారా మాష్టారు నిర్వహించిన క్రతువు (2)
     
    29.  దీని పొగకే సిగమెక్కితే, గుగ్గిలం పొగ కెట్లూగాలి? (2)
     
    31. సలసల కాగే తడక (2)
     
    33. తీతువుపిట్టకు తెలిసిన రుచి (2)
     
    34.  పురి, పెన (2) 

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 57 సమాధానాలు!


ఈ పజిల్‌కు సమాధానాలు పంపిన కృష్ణుడు, ఆ.సౌమ్య, ఫ(రమ)ణి, భమిడిపాటి సూర్యలక్ష్మి, అన్వేషి, మందాకిని గార్లకు ధన్యవాదాలు. అభినందనలు! 

18, నవంబర్ 2011, శుక్రవారం

శంకరయ్య మాష్టారి కథ!

సమస్యాపూరణల ద్వారా బ్లాగ్లోకానికి సుపరిచితులైన శంకరాభరణం కంది శంకరయ్యగారు సుమారు రెండు దశాబ్దాల క్రితం వ్రాసిన దత్తత అనే కథానికను కథాజగత్‌లో అందిస్తున్నాము. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.త్వరలో కథాజగత్‌లో ఈ క్రింది కథలు ప్రకటించబడతాయి.


1) అమ్మ కొడుకు - టి.శ్రీరంగస్వామి
2) ఈ కథ అసహజం కాదు - వసంత ప్రకాష్
3) అభయం - రావిపల్లి నారాయణరావు
4) చిరుగు బొంత - సోమవఝల నాగేంద్రప్రసాదు  

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 57
ఆధారాలు:

అడ్డం:
     
     1. కథాజగత్ లో పంతుల విజయలక్ష్మిగారి కథానిక (3)

3. ఎగాదిగా, నిలువెల్లా లేదా టాప్ టు బాటం. (7)

7. హుస్సేను చొక్కాలో పొగ త్రాగు సాధనము (2)

8. వ్రాసెదననంటున్న బాట(2)

9. ఆద్యంతమూ మజా కలిగిన కొత్త సినిమా (5)

11. నపుం సకుడే (2)

13. సైపరాని తప్పిదమే మరో రూపంలో (5, 2)

16. దేశవాళీ ఆవు కాదు. జెర్సీ ఆవు దీనికి ఉదాహరణ. (5, 2)

17. మహేల జయవర్ధనే పేరుతో వేడుక (2)

19. పాత శనిగాడి పిడుగుపాటు (5)

20. ఆస్తిలేదా సంపద కొఱకు కోర్టులో పెట్టెడి కేసు (2)

23. కేళి (2)

24. మన పురణాలలో వెయ్యి చేతులు కలిగినవాడు (7)

25. కాసారము (3)
 నిలువు:
1. పినాకపాణి దీనికి ఒక ఉదాహరణ (4, 3)
2. క్రొక్కారు మెరుగులో ఉర్దూ చీటి (2)
3. ఏ దేవుడయినా ఇంతే. శరణు జొచ్చినవాడికి కొమ్ముకాచే రకం (3, 4)
4. సుహాసిని సగం మొగుడు (2)
5. చండప్రచండము (2)
6. బస్తీ దొరసాని పాటలోని మేకప్పు (3)
10. ఇదీ భూమిపైన ఉన్న 'గడ్డ'యే. మండలి వెంకట కృష్ణారావుగారి ఇలాకా (5)
12. దేవేగౌడకు సుపుత్రుడు కర్ణాటకకు మాజీ సి.యం. (5)
14. నిరక్షరాస్యుడు (3, 4)
15. స్టేజీ డ్రామా (4, 3)
18. ఎక్కడివర కూ? (3)
21. వృత్తాంతము లేదా వర్తమానము (2)
22. అయ్యను గౌరవంగా పిలువు (2)
23. అమెరికనుల తెలుగు సంఘము అడ్డం 23యేనా (2)17, నవంబర్ 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 56 సమాధానాలు!ఈసారి కంది శంకరయ్యగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు సరిగా నింపగలిగారు. మందాకినిగారు శకటును గుర్తించలేకపోయారు. అందరికీ అభినందనలు.

14, నవంబర్ 2011, సోమవారం

ఆయన కథే ఒక అవసరం

     ఈ రోజు సాక్షి దినపత్రిక (14 నవంబర్ 2011) సాహిత్యం పేజీలో స్వర్గీయ అవసరాల రామకృష్ణారావు గారి గురించి ఆయన కథే ఓ అవసరం అనే వ్యాసం ప్రచురించారు. చదవండి. ఆ వ్యాసంలోని ఒక పేరా మీకోసం ఇక్కడ.


     మన మధ్య లేని రచయితలకు మనం అర్పించే నిజమైన నివాళి వారి వారి రచనలు చదవడమే. పై పేరాలో పేర్కొన్న ఎవరి షుర్మాకెవరు కర్తలు కథ చదివారా? చదవక పోతే ఇక్కడ చదవండి.   

9, నవంబర్ 2011, బుధవారం

పాండవ పక్షపాతి


ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన నిండుకొలువు భువనవిజయంలో కవిపండితులను ఉద్దేశించి ధర్మరాజు తమ్ములు మంచివారా? శ్రీరాముని తమ్ములు మంచివారా? అని ప్రశ్నించాడట. దానితో సభ రెండుగా చీలిపోయి ఒక పక్షము ధర్మరాజు తమ్ములు మంచివారంటే మరొక పక్షము శ్రీరాముని తమ్ములు మంచివారని పరిపరి విధాలుగా వాదించ సాగారట. అష్టదిగ్గజ కవులు కూడ రెండుగా విడిపోయారట. తమ వాదాన్ని సమర్థించడానికి నానా తంటాలు పడ్డారట.  అయితే వారి వాదనలు సహేతుకంగా లేదని శ్రీకృష్ణదేవరాయలు తన ధర్మసందేహాన్ని తానే నిర్ణయించ దలచి ఇట్లన్నాడు. "రాముని కంటే రాముని తమ్ములు బలహీనులు. అందువల్ల వారు తమ అన్నగారి మాట వినితీరాలి. బహీనులయి బలవంతుని మాట వినడంలో ఏం గొప్ప ఉంది. ఇక ధర్మరాజు కంటే అతని తమ్ములు బలవంతులు, ప్రయోజకులూను. విశేషించి పాండవులకు అన్ని కష్టాలు ధర్మరాజు మూలంగానే వచ్చింది. అన్నగారి కంటే బలవంతులై కూడా అతని మూలంగా అష్టకష్టాలు అనుభవించీ భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజు మాట జవదాటలేదు. ప్రయోజకులైనవారు అప్రయోజకుడి మాట శిరసావహించడం గొప్ప విషయమే కదా? అంచేత ధర్మరాజు తమ్ముళ్ళే మంచివారని నా అభిప్రాయం." సభ కరతాళధ్వనులతో దద్దరిల్లింది. వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి "ప్రభువుల వారు ఆ అవతారమందే కాకుండా ఈ అవతారమందు కూడ పాండవ పక్షపాతియే కదా" అన్నాడట. శ్రీకృష్ణదేవరాయలు దానికి ఉబ్బిపోయి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాలా? :)    

(చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి మనోరమ పత్రిక నుండి)    

8, నవంబర్ 2011, మంగళవారం

ఎవరు?

ఈ క్రింది ఫోటోలోని వ్యక్తి ఎవరు?7, నవంబర్ 2011, సోమవారం

అనామిక


మనుషుల చేతి వేళ్లు ఐదింటిలో చిటికెన వేలుకు కనిష్ఠిక అని పేరు. దాని తరువాతి వేలును అనామిక అని అంటారు. ఆ వేలుకు అనామిక అని పేరు రావటానికి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకంలో యిలా సమర్థిస్తున్నాడు. 


శ్లో II  పురాకవీనాంగణ నాప్రసంగే I  కనిష్ఠి కాదిష్టిత కాళిదాసః
       ఆద్యాపితత్తుల్యక వేరభావా I  దనామిసార్థబతీబభూవా II


ఈ శ్లోకం తాత్పర్యం గమనిస్తే  ఏ వస్తువునైనా మనం లెక్కించేటప్పుడు ఎడమ చేతి వేళ్లు చాపి కుడిచేతి చూపుడు వేలుతో ఒకటి అని ఎడమచేతి చిటికెన వేలు మడిచి, రెండు అని దాని తరువాతివేలును మడిచి క్రమంగా లెక్కపెడతాము. పూర్వకాలమందు కవులను లెక్క పెట్టవలసి వచ్చినప్పుడు కాళిదాసు పేరు మొదట చెప్పి చిటికెన వేలు (కనిష్ఠిక)ను ముడుచుచు వచ్చారు. అది మొదలుకొని నేటి వరకు కాళిదాసుతో సమానుడైన కవీశ్వరుడు రెండవవాడు లేకపోవుటచే చిటికెన వేలు తరువాత ఉన్న వేలును మడిచి లెక్క చెప్పుటకు కవి దొరకలేదు. ఆ వేలుకు నామకుడు ఎవ్వడూ  దొరకలేదు కాబట్టే ఆ వేలుకు అనామిక అనే పేరు సార్థకమైనదని ఆ కవి చమత్కారంగా చెప్పాడు.  పనిలోపనిగా కాళిదాసు గొప్పతనాన్ని కవి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.

(చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి మనోరమ పత్రికనుండి)

ఈమె ఎవరు?పై ఫోటోలో ఉన్నవ్యక్తిని గుర్తించగలరా?


గీత_యశస్వి గారు సరిగా గుర్తించగలిగారు. ఈవిడ టంగుటూరి సూర్యకుమారి గారు. ఈ క్రింది ప్రకటన చూడండి.
6, నవంబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 56ఆధారాలు:

అడ్డం:

1. రావిశాస్త్రిగారి అసంపూర్ణ నవల (3, 3)

4. రాచకొండవారి తొలి నవల (4)

6. ఈ మల్లారెడ్డి వీచిక అనే పత్రికను నడిపారు (3)

7. కాకిగూడులోని  కాననము (2)

8. మురళీమోహన్‌కు చెందిన సంస్థ. నాది కాదు :) (4)

10. చదరంగంలో పావు (3)

11. వెదురు చాప మొదలగు వానితో ఏర్పర్చిన మరుగు (2)

12. నాగరికత కాని దానిలో స్టోరీ లేదు (4)

17. అభ్యంగనము (3)

19. పరిమితంలో మొదటి మూడింటికే పరిమితం చెస్తే వ చ్చే కొందరి ఇంటిపేరు (3)

20. ఉచితముగా (3)

21. రేపటికొడుకు సినిమాలోని లాలిపాట (4)

23. కన్నడిగుల మాత (2)

24. తిరగబడిన సౌత్‌ వెష్టు (3)

25. కష్టజీవి కాదు (4)

27. __ రాకడ లేదు, ఘడియ పురసత్తు లేదు. (2)

    28. శ్రీలంక క్రికెట్టు వీరుడు ఈ జయవర్ధనే (3)
    29. ఇటీవల రామాయణం వ్రాసిన సహజకవి ఈ రెడ్డిగారు (4)
    30. గడియారం వారి ఛత్రపతి శివాజీ చరిత్ర (6)
నిలువు:
1. గగనం, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమా కథలను తనవిగా క్లెయిమ్ చేసుకున్న రచయిత్రి (3,4)
2. ఎమ్బీయస్ ప్రసాద్‌గారి హాస్యకథల్లోని హీరో (3)
3. యజమాని లేదా బ్రాహ్మణుడు (3)
4. కలకలం వంటిదే (4)
5. విహరించే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (3)
7. కాటుకలో కరిచిన గాయము (2)
9. కప్ప (2)
11. సుందరి మిలాఖత్ తరువాత (4)
13. తాండూరు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి (4)
14. సప్తస్వరాల్లో మేటి (3)
15. గుణ్ణం గంగరాజు సినిమా (2)
16. శ్రీనాథ కవిసార్వభౌముని కావ్యం (3, 4)
18. ఒక హిందుస్తానీ సంగీత రచన, చిన్నపాట (2)
22.  కొమ్మ (2)
23. మలయాద్రి (4)
24. తీగ (2)
25. తెలుగులో పజిళ్ళ నిర్మాత అల్లంరాజు వారు (3)
     
    26. ఏకశిలలో కుండ (3)
     
    27. గలాటా (3)


క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 55 సమాధానాలు!


ఈ సారి ప్రయత్నించింది ఇద్దరే. మందాకినిగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు. యిద్దరూ పాక్షికంగా పూరించగలిగారు. వీరికి నా అభినందనలు!

4, నవంబర్ 2011, శుక్రవారం

పామును తరిమిన చీమలు

 వెంటనే స్వామి రెండు చేతులను అందుకున్నడు పెద్దసారు. "ఇది మన 'చిగురుటాకులు' నాటిక చేసిన పనే సార్. ఏది ఏమన్నాగాని మనం వెయ్యాల్సిందే. రోడ్డు గూడా సక్కగ లేని ఈ ఊరికి మన మాటసాయం ఎంతో అవసరం'' అన్నడు.  


మరి ఈసారి వేసిన నాటకం ఎందుకు బెడిసికొట్టింది? 


తెలుసుకోవాలంటే పెద్దింటి అశోక్‌కుమార్‌గారి పామును తరిమిన చీమలు కథను కథాజగత్‌లో చదవండి.

అలనాటి పత్రికలు 50


2, నవంబర్ 2011, బుధవారం