...

...

29, ఆగస్టు 2010, ఆదివారం

విజయవంతంగా ముగిసిన తెలుగుబాట!











తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా e-తెలుగు వారు నిర్వహించిన తెలుగు బాట కార్యక్రమం దిగ్విజయమయ్యింది. ఈ కార్యక్రమ విశేషాలు ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు లభించిన మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. లేకపోతే భమిడిపాటి ఫణిబాబు, శరత్‌కాలం శరత్, తాడేపల్లి లల్లితాబాల సుబ్రహ్మణ్యం, ఎస్.రాము లాంటి వారిని కలుసుకునేవాడిని కానేమో! మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వీవెన్, తుమ్మల శిరీష్ కుమార్, కాశ్యప్, చక్రవర్తి, సుజాత మరియు ఇతర e-తెలుగు బృందానికి నా అభినందనలు.

26, ఆగస్టు 2010, గురువారం

ఆరి సీతారామయ్య గారి కథ!

ఆరి సీతారామయ్య గారి కథ అవచారం కథాజగత్‌ లో చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

25, ఆగస్టు 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 25









ఆధారాలు: 
అడ్డం: 
1. తెరాస నాయకుల మెడలో ఉండేది ఇదే కదా!
3. ఆచార్య కొలకలూరి ఇనాక్ పేరు చెప్పగానే స్ఫురించే కథ!
5. పవిత్రురాలగు గోదాదేవి ధనుర్మాస వ్రతమును ఆచరించిన మాసము
7. ఏహ్యము, డోకు
9.  ఈ ఆదివారం e-తెలుగు వారు చేపట్టనున్న కార్యక్రమం.
10. శ్రీకృష్ణదేవరాయలవారికి దీనితో పాటుగ కవన కుతూహలం కూడా ఉండేదిట!
11. అతి కానిది నమిత ముక్కులో నక్కినదా?
14. పక్షుల గుంపు చేసే శబ్దమా లేక కలకంఠుల గలగలయా?
15. సూర్యభగవానుడే మన కర్మలకు ప్రత్యక్ష సాక్షి!
16. హిట్లర్ సినిమా దర్శకుడు ఈ అందరివాడు.
నిలువు:
1. కాగజ్ కే ఫూల్ దర్శక నిర్మాత!
2. రామదండు !
4. కందుకూరి వీరేశలింగం పంతులుగారి సంఘసంస్కరణ కార్యక్రమాలలో ఎన్నదగినది.
5. శంకరంబాడి సుందరాచారి వ్రాసిన మన రాష్ట్ర గీతం!
6. సముద్ర తీరంలో సూర్యోదయ దృశ్యము లేదా సూర్యాస్తమయ దృశ్యము ముగ్ధ అనే పేరుగల అమ్మాయి, మనోహర్ అనే అబ్బాయిల ప్రణయకావ్యంలా ఉంటుంది!
7. విజయానికి తొలి మెట్టు!
8. కరములో విధము!
9. నిడదవోలు మాలతి గారి బ్లాగు.
12. జంజాటము వంటిదే!
13.  నారదనారది సినిమా దర్శకులు!


మనసు మాట వినదు

 అందరికీ శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడటం అంటే ఏమిటో అనిశెట్టి శ్రీధర్ గారి కథ మనసు మాట వినదు అనే కథలో చదివి తెలుసుకోండి. ఈ కథను కథాజగత్‌ లో చూడండి.

22, ఆగస్టు 2010, ఆదివారం

"తెలుగు బాట"కి ఆహ్వానం!

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్నe-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని గురించి గుర్తు చేయడానికి, ప్రోత్సహించడానికి తెలుగు భాషా దినోత్సవం అయిన ఆగస్టు 29ని ఎంచుకుంది.



తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం 

★ ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★
హైదరాబాద్‌లో  తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక!

ఈ కార్యక్రమంలో పాల్గొనమని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీతో పాటు మీ స్నేహితులనూ తీసుకురండి. మరిన్ని వివరాలను తెలుగు బాట సైటు నందు చూడవచ్చు.

20, ఆగస్టు 2010, శుక్రవారం

ముంబై డబ్బావాలాల కథ!

ముంబై డబ్బావాలాల నేపథ్యంలో సాగిన కథ శ్రమ సౌందర్యంను కథాజగత్‌ లో చదవండి. ఈ కథను వ్రాసింది అంబల్ల జనార్దన్.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 24




ఆధారాలు: 
అడ్డం: 
1. కావేరీ నది!
3. నారదుడు రాక్షస ముని కాదు!
5. ఎన్‌టీయార్, సావిత్రులను మురిపించిన హిమగిరి సొగసులు ఈ చిత్రరాజంలోనిదే!
7. చొక్కాకు ఉండే మెడ పట్టీయా?
9.  సినిమా తార లకు ఒక హిట్ వస్తే చాలు ఇక వారికి _____ ఉండవు
10. కన్నడలో గోడంబి, తెలుగులో అగ్రబీజము!
11. అటునించి మూల్యము!
14. వెనుదిరిగే పని!
15. డేరా!
16. సత్తి(ఓ మంచి పనోడు) నటించిన తాజా చిత్రం.
నిలువు:
1. దాక్షిణ్యము!
2. దేవర కోటేశు రచయిత పతంజలి శాస్త్రిగారి ఇంటి పేరు!
4. భగవంతునికి అర్పించుకునే ఒకానొక మ్రొక్కు. ఇదే పేరుతో ఒక సినిమా 68లలో వచ్చింది.
5. కృష్ణభగవానుడికి ఇలా పేరు పడిపోయింది పాపం!
6. ఇటీవలే కాలధర్మం చెందిన చేతనావర్త కవి!
7. బతుకు పుస్తకం రాసిన మల్లయ్యగారి ఇంటి పేరు!
8. చిత్రం భళారే విచిత్రం చిత్రంలో నటించిందిరా ఈ జీవి!
9. భద్రగజము!
12. గొప్పగొప్పవారు తలక్రిందలయ్యారు.
13.  6నిలువులోని వారికి సోదరులు!

18, ఆగస్టు 2010, బుధవారం

మౌనమే నీ భాష

కథారచయిత్రి సి.ఉమాదేవి గారి కథ మౌనమే నీ భాష  ను కథాజగత్‌ లో చదివి మీ అభిప్రాయాలను చెప్పండి. అలాగే జ్యోతి వలబోజు గారి కథ ఇట్స్ మై చాయిస్  కథను కూడా చదవండి. ఇంకా కథాజగత్‌లో ఈ క్రింది కథలు త్వరలో ప్రకటింపబడతాయి.

1. సోదా - దేవరాజు మహారాజు, 2.నాన్న - తాడేపల్లి పతంజలి, 3.కథకుడి కథ - వి.వి.సుబ్బరాజు.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 23 సమాధానాలు!


అడ్డం: 
1. గిరీష్‌కర్నాడ్, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన నృత్యప్రధాన చిత్రం! - ఆనంద భైరవి
3. గీతాంజలి కావ్యకర్త ఇలా జగత్ప్రసిద్ధులు! - విశ్వకవి
5. చతుషష్టి కళలలో ముప్పైతొమ్మిదవది ఇహఫలనిష్క్రమణకు వ్యతిరేకమా! - పరకాయప్రవేశం
7. softwareకు ఊకదంపుడు గారి అచ్చతెనుగు అనువాదం మెత్త ___ - ఉడుపు (మెత్త ఉడుపు =software) 
9.  రౌతు!  - అశ్వారోహుడు 
10. ఊర్ధ్వపుండ్రము - తిరునామము
11. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి చేసే సాహిత్య ప్రక్రియ :) - తవిక
14. బాపుకు దోస్తు! - ముళ్ళపూడి రమణ
15. స్టార్ నైట్ లోని నైట్! - విభావరి
16. మన రానాలు సర్వసాధారణంగా చేసే వాదము! - వితండవాదము
నిలువు:
1. శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ సినిమాలో బిర్యాని మిస్సయింది. - ఆవకాయ్ (ఆవకాయ్ బిర్యాని సినిమాను శేఖర్ కమ్ముల నిర్మించారు)
2. హ్యాపీడేస్ ఫేమ్ సోనియా, కృష్ణుడు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకొన్న చిత్రం! - వినాయకుడు
4. ఘనవల్లిక, మెఱుపుతీగ! - విద్యుదున్మేషము
5. మౌంటెనీరింగ్! - పర్వతారోహణము
6. ఈ నైఘంటికుడు హాస్యావధానం చేస్తాడా? - శంకరనారాయణ ( పి.శంకరనారాయణ ప్రముఖ నిఘంటు కర్త. తెలుగు - ఇంగ్లీష్, తమిళ్ - ఇంగ్లీష్ మొదలైన నిఘంటువులు వీరివి ప్రసిద్ధాలు. టి. శంకరనారాయణ ప్రముఖ జర్నలిస్టు. హాస్వావధానాలతో వీరు వెలుగులోకి వచ్చారు)
7. వారధి నిర్మాణానికి రాముల వారికి సాయమందించిన బుడుత జీవి! - ఉడుత
8. తిరిపెము. - పుతిక ( పుతిక అంటే భిక్షము)
9. శ్రీశ్రీ విప్లవ కవి కాక ముందు! - అభ్యుదయకవి
12. ఎంత స్వాతంత్ర్యమైనా ఇలా కలగాపులగం కావాలా? - విచ్చడిలవి (విచ్చలవిడి)
13.  కొన్ని పదార్ధాలు ఒక్కసారిగా ఘనపరిమాణము పెరిగి పెద్ద శబ్దంతో అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ. - విస్ఫోటము

ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన ఊకదంపుడు, భమిడిపాటి సూర్య లక్ష్మి, కంది శంకరయ్య గార్లకు అభినందనలు.

15, ఆగస్టు 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 23






ఆధారాలు: 
అడ్డం: 
1. గిరీష్‌కర్నాడ్, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన నృత్యప్రధాన చిత్రం!
3. గీతాంజలి కావ్యకర్త ఇలా జగత్ప్రసిద్ధులు!
5. చతుషష్టి కళలలో ముప్పైతొమ్మిదవది ఇహఫలనిష్క్రమణకు వ్యతిరేకమా!
7. softwareకు ఊకదంపుడు గారి అచ్చతెనుగు అనువాదం మెత్త ___
9.  రౌతు!
10. ఊర్ధ్వపుండ్రము
11. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి చేసే సాహిత్య ప్రక్రియ :)
14. బాపుకు దోస్తు! 
15. స్టార్ నైట్ లోని నైట్!
16. మన రానాలు సర్వసాధారణంగా చేసే వాదము!
నిలువు:
1. శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ సినిమాలో బిర్యాని మిస్సయింది.
2. హ్యాపీడేస్ ఫేమ్ సోనియా, కృష్ణుడు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకొన్న చిత్రం!
4. ఘనవల్లిక, మెఱుపుతీగ!
5. మౌంటెనీరింగ్!
6. ఈ నైఘంటికుడు హాస్యావధానం చేస్తాడా?
7. వారధి నిర్మాణానికి రాముల వారికి సాయమందించిన బుడుత జీవి!
8. తిరిపెము.
9. శ్రీశ్రీ విప్లవ కవి కాక ముందు!
12. ఎంత స్వాతంత్ర్యమైనా ఇలా కలగాపులగం కావాలా?
13.  కొన్ని పదార్ధాలు ఒక్కసారిగా ఘనపరిమాణము పెరిగి పెద్ద శబ్దంతో అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ.

బ్లాగ్మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ తురుపుముక్క స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!

13, ఆగస్టు 2010, శుక్రవారం

మంత్రాలకు చింతకాయలు రాలునా!

ఆలూరి పార్థసారథి గారి కథానిక మంత్రాలకు చింతకాయలు రాలునా! కథాజగత్‌  లో చదవండి. ఒక్కొక్కసారి చదువుకున్న వాళ్ళుకూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎంత నీచానికి ఒడిగడతారో ఈ కథలో తెలుసుకోవచ్చు.

9, ఆగస్టు 2010, సోమవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 22


ఆధారాలు: 
అడ్డం: 
1. వేలూరి శివరామశాస్త్రి కలం నుండి వెలువడిన ప్రసిద్ధ కథ!
3. అడ్డం14.రచించిన నవల!
5. బుచ్చిబాబు నవల చివరకు మిగల్లేదు :-)
7. మాయాబజార్ సురేకాంతం కూతుర్ని ఇలాగే పిలుస్తుందా?
9.  ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికములా?
10. కాస్త నాజూగ్గా లగెత్తు!
11. సుగ్రీవుని భార్యకు చెందినది.
14. డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు అంటే ఎవరికి తెలుస్తుంది?
15. తెలుగు తిథుల్లో పదమూడవ రోజు.
16. రేనాటి సూర్యుడు! ఉయ్యాలవాడ విప్లవసింహం!!
నిలువు:
1. పత్తేదారు
2. జానపదుల అన్నప్రాశనము
4. చిగురు
5. కాసుల పురుషోత్తమ కవి విరచిత శతకంలోని మకుటం ఇలా ప్రారంభమౌతుంది.
6. మన రాజధానిలో ముఖ్యులు విడిది చేసే ప్రభుత్వ అతిథి గృహము.
7.ఇంచుమించు.
8. కన్నడ దేశి కవి సర్వజ్ఞుడు వాడిన ఛందస్సు
9. తోయజాక్షి!
12. స్వాతి పత్రిక అసోసియేట్ ఎడిటర్!
13.  నేతి మిఠాయిలకు మారు(మ్రోగే)పేరు!

8, ఆగస్టు 2010, ఆదివారం

కవితాభిషేకం! -34



     ఆంధ్రులభావనాట్యస్థానములలోన,
           నాడు నీకావ్యకన్యకలఁ గాంచి
      అనిఁ గన్నుమాయ కింకను దోఁచు నీసమి,
           త్కంఖాణఖురళికాంకములఁ జూచి
      కలితశౌర్యజ్వాలఁ గరఁగించి పోసిన,
            జయశాసనస్థిరాక్షరము లరసి
      పెద్దనార్యునిమనోవీధి కందక దాటి,
            దిశలఁ దాండవమాడు తేజమొంచి

      చిరము నీరాజ్యలక్ష్మి వర్షించు బాష్ప,
      పూర మదె తుంగభద్రాఖ్యఁ బూని పారు
      చుండు నెపుడు బళ్ళారిమండలమున
   
      ఆంధ్రకవిచంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!!
     మహితాంధ్రభోజనామకరత్నము వహించి
            క్రాలు విశాలవక్షస్‌స్థలంబు
      పరభీకరప్రభావమ్ము బయ ల్చిమ్ము,
            సరిలేని కోరమీసములజంట
      చతురభ్దివలయితక్ష్మాభారమునకుఁ బెం
            పున నిక్కి కనుచుండు భుజయుగంబు
      దురమున నిప్పుక ల్గురిసి దీనులయందు
            దయలు వర్షించు నేత్రద్వయంబు
 
     అష్టదిగ్గజవాగమౄతార్ద్ర మగుచుఁ
      బావనంబైన నీసభాభవనవిభవ
      మక్కటా! జీర్ణ నగర కుడ్యాంతరములఁ
      బండి నిద్రించెనే కృష్ణపార్థివేంద్ర!
      భాషాసముద్రకుంభజుఁడ వీవయ్యును
            విద్వవత్కవుల గారవించినావు
      ప్రతిపక్షరాజభార్గవనాఁడవ యయ్యు
            వెన్నిచ్చుచో విడిపించినావు
      వైరికిరీటశుంభత్పదాబ్జుఁడ వయ్యు
            బెద్దనపదము సేవించినావు
      అర్థార్థిజనకల్పకానోకహుఁడవయ్యు
            సత్కృతులకుఁ జేయి సాచినావు 
      ఔర! శ్రీకృష్ణరాయ నీయంతవాని
      దివికి నర్పించుకొన్న మాదేశజనుల
      భాగ్యహీనత నొక్కి చెప్పంగలేక
      చిలువరాయఁడు వేయినాల్కలు వహించె 
     ఆయతవర్ణనావిభవ మచ్చుపడం బనిఁబూని విష్ణుచి
      త్తీయము వ్రాసినావు కవిధీరుల గుండెలు తత్తరిల్ల నేఁ
      డీ? యొకడేని మీసముపయిం జెయివైచి రచించు సత్కవి
      ధ్యేయుడు? క్లిష్టకావ్యమనకేమి? యశక్తులు కృష్ణభూపతీ! 

     కవిసింహములు నీకుగా సృష్టిగావించు
            కృతిపుత్రికలను దుఃఖితలఁజేసి
      ఆవాడసింధురాజాగ్రణు ల్పుత్తెంచు
            కానుకబండ్లు వెన్కకు మరల్చి
      ముదురువెన్నెలఁజిందు ముత్యాలగద్దియు
            పరరాజధూర్తుల పాలుసేసి
      నిరతంబు పగర నెత్తురుటేరుల మునుంగు
            కత్తి కాఁకటిచిచ్చుఁ గలుగఁజేసి 
      కుడియెడమలను నీతోడఁ గూడు తిరుగు
      సుకవికులకోకిలమ్ముల శోకజలధి
      ముంచి యలబృహస్పతివ్రాఁత మంచి దగుట
      దివికిఁ బోయితె శ్రీకృష్ణదేవరాయ! 
     ఆశీర్వదించినారా వ్యాసవాల్మీకి
            బృందారకమునీంద్రు లెదురువచ్చి?
      కన్నావె కవిభయంకరుఁగాళిదాసు భో
            జుండన్నవాడె విశ్రుతగుణుండు?
      రంభ నీతోడఁ గేరడ మాడునే దానఁ
            గోపించునే నలకూబరుండు?
      బలభేది వేయుఁ గన్నుల జూచి నిను గౌర
            వించుచున్నాఁడె కోవిదులలోన?
     తిరిగి నీనెయ్యపుం గవీశ్వరుల గోష్టి
      జరుగుచున్నదె దేవేంద్రపురమునందు?
      యెచటనుండిననేమి శ్రీకృష్ణరాయ!
      భరతపుత్రుల నొకకంట నరయుమయ్య! 
                                         గుఱ్ఱం జాషువా 
(ఈమాట ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక సౌజన్యంతో) 
(ఇంతటితో ఈ శీర్షిక సమాప్తము)

7, ఆగస్టు 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 21 సమాధానాలు!



యెన్నం ఉపేందర్ కథ!

యెన్నం ఉపేందర్ గారి బోర్డు తిప్పేసారు కథను కథాజగత్‌  లో చదవండి.

కవితాభిషేకం! -33


పండుగులోని విందువలెఁబండితబృందము నల్గడన్ సభా మండపమాక్రమించి సుకుమారకవిత్వము జెప్పుచుండ వే దండకరాభిరామ భుజదర్పవిలాసుఁడు కృష్ణరాయ భూ మండలభర్త పొల్పెసఁగు మాడ్కిఁదలంచిన మేను పొంగదే! -సి.వి.సుబ్బన్న శతావధాని

6, ఆగస్టు 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 21




ఆధారాలు: 
అడ్డం: 
1. వేంకటేశ్వర సుప్రభాతం ఈ ఛందస్సులో ఉన్నది!
3. ఏ.వి.యస్ వానర సైన్యం!
5. మరీ దూరం కాదు. సమీపమే!
7. తలపులు ముసిరినవి హత్తించు సుమా!
9. తులసిదళం నవలకు పేరడీగా వెలువడిన నవల!
10. కన్యాశుల్కంలో గిరీశానికి అన్నయ్య వరుస. సార్థక నామధేయుడు!
11. విహంగమము
14. గురుత్రయము!
15. పంజాబు నగరము!
16. కాలినడకన తిరుమలకు వెళ్ళే భక్తులను కూసింత బెదరగొట్టేది :)
నిలువు:
1. అడవికోడి కేమి తెలుసు ____ రుచి?
2. విద్యుత్ స్తంభము
4. పద్మ నయని మరో విధంగా!
5. తనకే సర్వస్వం తెలుసునని భ్రమించే అజ్ఞానిని ఇలా పిలవచ్చా!
6. థర్టీ ఇయర్స్!
7. చింత చచ్చినా చావనిది!
8. బొక్కసము నింపుటకు మూలుగు అక్కరలేదు.
9. సహస్రఫణములు విశ్వనాథ వారివి!
12. శీర్షాసనం వేసిన దాశరథి రంగాచార్య నవల!
13.  మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు - నవంబరు మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయుదురు. తాజా ఆకుల రసమును పిల్లలకు బేదిమందుగా వాడెదరు..... ఇంకా తెలియలేదా? చదువరి గారిని చిట్కా అడగండి :)

కవితాభిషేకం! -32


ఆముక్తమాల్యదా కోమల ప్రౌఢోక్తి
                భావనావీధుల ప్రణయమూని
మనుచరిత్ర రసార్ద్రమంజిమ భావించి
                పారిజాతములోని సౌరుగొంచు
స్తుతమతియైనట్టి ధూర్జటికవినాథు 
                మాధురీమహిమంబు మదిదలంచి
రామరాజ శ్లేష రమణీయ సంగీత 
                విన్యాసలహరిలో వేడ్కదోగి

పింగళి కళా ప్రపూర్ణత రంగరించి
కందుకూర్యష్టకముల విందుగొంచు
రామకృష్ణు పదన్యాస రక్తి దవిలి 
నాటి జన్మంబె కోరు దేనాటికైన

             -ఆశావాది ప్రకాశరావు