...

...

31, మార్చి 2010, బుధవారం

విందైన వంటకం!

ఎస్వీ.కృష్ణజయంతిగారి హాస్య కథ 'విందైన వంటకం' కథాజగత్‌లో ప్రకటింపబడింది. ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రికవారు నిర్వహించిన హాస్యకథల పోటీలో మొదటిబహుమతి గెల్చుకుంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం ఈ కథ. పైకి హాస్యకథగానే కనిపించినా సగటు ఇల్లాలి ఆవేదన ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి. 

28, మార్చి 2010, ఆదివారం

రైల్లో సుందరి

తాజాగా డా.వాసా ప్రభావతిగారి కథానిక రైల్లో సుందరి కథాజగత్ వెబ్‌సైట్‌లో ప్రకటించాము. తప్పక చదవండి.

27, మార్చి 2010, శనివారం

స్వయంవరం

అల్లూరి గౌరిలక్ష్మిగారి కథానిక స్వయంవరం వర్తమాన కథా కదంబం కథాజగత్ వెబ్‌సైట్‌లో చదవండి. ఈ కథ పదేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో విపుల పత్రికలో ప్రచురింపబడింది. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలపండి. అలాగే ఈ క్రింది కథలు త్వరలో కథాజగత్‌లో ప్రకటింపబడనున్నాయి.


1.వాసా ప్రభావతి - రైల్లో సుందరి 

2.ఎస్వీ.కృష్ణజయంతి - విందైన వంటకం  
3.శశిశ్రీ - రాతిలో తేమ  
4.బద్ది నాగేశ్వర రావు - ఆంతర్యాలు  
5.గూడూరి సీతారాం - నారిగాని బతుకు  
6.శైలజా మిత్ర - సరికొత్త సూర్యోదయం  
7.బి.వి.ఎన్.స్వామి - పగలు, రాత్రి... ఒక మెలకువ  
8.పంజాల జగన్నాథం - నేను సైతం 
9.కన్నోజు లక్ష్మీకాంతం - పాపం! నారాయణరావు 

10.తిరుమలశ్రీ - ఎలిబీ
11.వరిగొండ కాంతారావు - అంతిమం 
12.అంబికా అనంత్ - కొడిగట్టరాని చిరుదీపాలు 
13. నాగసూరి వేణుగొపాల్ -రిగ్గింగ్ 
14. పాతూరి అన్నపూర్ణ - ముళ్ళకంచె
15.తాడిగిరి పోతరాజు - నిరవధిక నిరీక్షణ

24, మార్చి 2010, బుధవారం

కడుపాత్రం

తవ్వా ఓబుల్‌రెడ్డిగారి కథానిక కడుపాత్రం కథాజగత్‌లో ప్రకటించాము. మరుగున పడిపోతున్న జానపద కళారూపాలపై ఆధారపడి బతికే కుటుంబాల వ్యధార్థభరిత జీవితాలను ఈ కథలో శ్రీ ఓబుల్‌రెడ్డిగారు చక్కగా చిత్రించారు. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

23, మార్చి 2010, మంగళవారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తురుపుముక్క శుభాకాంక్షలు అందజేస్తోంది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షవీక్షణాలు మీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.

18, మార్చి 2010, గురువారం

మనిషి - కథల సంపుటిమిత్రుడు యస్.డి.వి అజీజ్ గారి కథల పుస్తకం మనిషి ఎట్టకేలకు ప్రకటింపబడింది. ఈ పుస్తకాన్ని మా సంస్థ అబ్జ క్రియేషన్స్ ద్వారా ప్రచురించాలని అజీజ్‌గారు ఆశించారు. కానీ వ్యక్తిగత కారణాలవల్ల అది వీలు పడలేదు. చివరకు పాలపిట్ట బుక్స్ వారు ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని తురుపుముక్క పాఠకులకు టూకీగా పరిచయం చేయాలనిపించి ఈ టపా వ్రాస్తున్నాను. మూడు దశాబ్దాలకు పైగా రచనావ్యాసంగంలో ఉన్న యస్.డి.వి.అజీజ్ సుమారు 200పైచిలుకు కథలు వెలువరించారు. దాదాపు అన్ని పత్రికలు వీరి కథల్ని ప్రచురించాయి. ఈ కథల్లో 18 కథల్ని ఎంపిక చేసుకుని ఈ పుస్తకరూపంలో మనలకు అందిస్తున్నారు. ఈ కథల్లో మనకు రచయిత అంతరంగం, సమాజం పట్ల వీరికి ఉన్న అవగాహన స్పష్టంగా గోచరిస్తున్నాయి. సర్వోత్కృష్టమైన మనిషి జన్మనెత్తినందుకు మనం మనజీవితాన్ని ఏదోరకంగా సార్థకత చేకూర్చాలన్న కోరికను  ఈ కథల్లో రచయిత బలంగా చెపుతున్నారు. ఈ సంపుటంలో వీరి మొదటి కథ ఎర్రకాగితాలు మొదలుకొని  మొన్న కర్నూలును ముంచెత్తిన వరద తాలూకు అనుభవాల కథ ఉప్పెన దాకా రచయిత రచనానైపుణ్యం మనకు కనిపిస్తుంది. ఎక్కడా విసుగు కలిగించకుండా చదివించే ఈ కథల్లో మనకు ఎటువంటి ఆసక్తిని కలిగించే సంఘటనలుగానీ ఉత్కఠతను రేపే మలుపులు కానీ కనిపించవు. కానీ మంచి కథను చదివామన్న తృప్తి మాత్రం మిగులుతుంది. ఈ పుస్తకాన్ని కీ.శే.హేమలతాలవణం గారికి అంకితమివ్వడం ఉచితంగా ఉంది. ఇంకో విశేషమేమిటంటే నాకు మొదటిసారి ఒక పుస్తకానికి ముందుమాట వ్రాసే అవకాశం ఈ పుస్తకం కల్పించింది. నా అభిప్రాయాలతో పాటు డా.కొలకలూరి ఇనాక్ గారి పీఠిక కూడా ఈ పుస్తకంలో ఉంది.  ఈ పుస్తకంలోని కథల్ని వివరంగా పరిచయం చేయడం లేదు. ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును చూస్తే సరిపోతుందనే చందంగా ఈ సంపుటిలోని కథలు ఎలావుంటాయో తెలియాలంటే ఒక కథను చదివితే సరిపోతుంది కదా! ఈ సంపుటిలోని ఒక కథ రుణం నా కథాజగత్‌లో ఇదివరకే ప్రకటింపబడింది. మీలో చాలామంది ఇదివరకే ఆ కథను చదివేవుంటారు. చదవనివారు ఇప్పుడైనా చదవండి. ఈ పుస్తకానికి దానికి మించిన పరిచయం మరొకటి అవసరం లేదు. ఈనెల 21న కర్నూలు పట్టణంలో ఆవిష్కరింపబడుతున్న ఈ పుస్తకం వెల 60 రూపాయలు. ప్రతులకు పాలపిట్ట బుక్స్,16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సి, సలీంనగర్,మలక్‌పేట్, హైదరాబాద్ 500 036,సెల్:+919848787284 ను సంప్రదించండి.

16, మార్చి 2010, మంగళవారం

వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు!మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వికృతినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.  ఈ ఏడాది మీఅందరికీ సకల శుభములు కలగాలనీ, సుఖసంతోషాలతో అందరూ పురోగతిని సాధించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. 

ఈ ఉగాది కానుకగా కథాజగత్‌లో శ్రీ యస్వీ కృష్ణ గారి కడలికెరటం కథ అందిస్తున్నాము. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

7, మార్చి 2010, ఆదివారం

శ్రీకృష్ణ సంకీర్తనములు ఆఖరిభాగము


ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు 
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప91.జనములు నిను భక్తి - జగతిసేవింపని
   దినములు వ్యర్థమై - తిరిగిపోవుగాదె?
   తనువులస్థిరమనుచు - తమ మదిని దెలియక
   ధన కనక స్త్రీలను - దగిలి చెడుదురు కృష్ణా!                    
llకృష్ణll


92.కొంచెపు వాడనుచు - కోపగింపకు స్వామి!
   ఎంచకుము తప్పులను - ఇన్దిరేశా! కృష్ణా!
   కొంచమధికములు నీ - కృపకు గలేదే దేవా!
   అంచితముగ నన్ను - ఆదరింపుము కృష్ణా!                    
llకృష్ణll


93.పరనారి ముఖపద్మ - పయకుమ్భ మధ్యమును
   అరసి మోహింతురు - అజ్ఞానులై దేవా!
   నిరతి భక్తిగ నిన్ను - నిజమరసి సేవించు
   పురుషులకు నిరయములు - పూని అంటునె కృష్ణా           
llకృష్ణll


94.యమధర్మరాజునకు - అలుకగనేటికి
   కమలాక్ష! లక్ష్మీశ! - కామిత ఫలదా!
   విమలయౌ నామమును - వినుతి చెసేయుచును
   అమరనే దలచెదను - అనిశము కృష్ణా!                           
llకృష్ణll


95.కొన్ని మానిని బుట్టు - కొన్ని గ్రుడ్లను బుట్టు
   కొన్ని ధరణిని బుట్టు - కొన్ని భువి చమటలను
   అన్ని జన్మలకన్న - అరయ మానవ జన్మ
   సన్నుతింపగ శ్రేష్ఠ - జన్మము భువిలోన                          
llకృష్ణll


96.మానవ జన్మంబు - మహిని గల్గిన యపుడె 
   హీనుడై చెడిపోక - హితమైన మతి గలిగి
   జ్ఞానవంతుడగుచు - జ్ఞప్తీని సతతమును
   శ్రీనాథు శ్రీకృష్ణు - సేవించి మనుడయ్య                           
llకృష్ణll


97.భూధర! హర వినుత! పురుషోత్తమ నీదు
   పాదయుగళంబును - పాయక గొల్చెదను
   శ్రీధర! శ్రీకృష్ణ! - శ్రీనాథ యనుచును
   మోదమున భజియిన్తు - ముద్దు కృష్ణయ్య                       
llకృష్ణll


98.దుష్టుండ చాల నే - దుర్బుద్ధి గల వాడ
   దుష్ట చారిత్రుడను - ద్రుమార్గుడని యండ్రు
   నిష్టుడై నిను గొలువ - కష్టమని శరణంటి
   ఇష్టముగ చే బట్టి - ఏలుకొను కృష్ణయ్య                          
llకృష్ణll


99.దేహధర్మములకు - దీడై చెడిపోక
   మోహము లెగగోసి - బాహుళ్యమును బాసి
   శ్రీహరి! శ్రీకృష్ణ! - పాండు రంగయ్య
   పాహిమామ్యనుచును - భజియించి మనుడయ్య              
llకృష్ణll


100.అంభోజ నేత్రా! - అబ్ధిగంభీరా!
    జంభాసుర వైరి - సన్నుత చారిత్ర!
    కుంభీద్ర వరద - వైకుంఠవాసా! కృష్ణా!
    డింభకుడ! రక్షింపు - దేవ! పరమాత్మా!                        
llకృష్ణll


101.కర యుగ్మమున శం -ఖ చక్రములు గలిగి

    ఉరమున వజ్రాలు - మెఱయగ పతకమును
    శిరమున రత్నాల - చిన్ని కిరీటమును
    సిరినాయకుడైన - శ్రీహరి కృష్ణయ్య                              
llకృష్ణll


102.అప్పా! యని నిన్ను - ఆదరమున బిల్తు

    తప్పులెల్లను సైచి - దయ బ్రోవు దేవా!
    ముప్పున నీ స్మరణ - మోదమున స్మరణకు
    తప్పక గలిగింపు - తండ్రి కృష్ణయ్య                               
llకృష్ణll


103.శరణము నీ దివ్య - చరణ పద్మములు

    తరణములు భవ జలధి - దాటుటకెల్లన్
    హరణములు దురితౌఘ - ఆపదలకు, ఆ
    భరణములు ఆర్తులకు - భద్రముగ కృష్ణా!                      
llకృష్ణll


104.నీ పాద కమలములు - నిత్యము గొల్చుటయు

    నీ పాదార్చకుల తా - నేస్తమ్ము నాకున్
    అపారమైనట్టి - అఖిలభూత ప్రేమ
    తాపస మందార! దయసేయు కృష్ణా!                            
llకృష్ణll


105.మంగళము కేశవ! మాధవ! కృష్ణా

    మంగళము అచ్యుత! మధుకైటభాన్తక
    మంగళము నిత్యము - రంగుగశ్రీహరికి
    మంగళమనరయ్య - మహిత పూజ్యులారా                      
llకృష్ణll


106.జనులార! హరికీ - ర్తనములు భక్తిని 

    వినిన పఠించినను - వేడుక వ్రాయన్
    ఘనతర భోగభా - గ్యములను బొందుచు
    ఘనమైన ముక్తిని - కడకు సాధింతురు                         
llకృష్ణll


107.హరిహర బ్రహ్మ చై - తన్య త్రిమూర్తులు

    పురముఖ ద్వారమున - పూజ్యులై యుండగ
    బరగును గ్రమమ్ము - ధర కోడీహళ్ళి
    పురమున నివసింతు - పుణ్యాత్ములారా                        
llకృష్ణll


108.చెలువాంబ రామార్యు - శ్రేష్ఠా గర్భమున

    చెలువున బుట్టితిని - చెన్నరాయప్పనుచు
    చెలిమి నీకీర్తనల - చెన్న కేశవ స్వామి
    కలకాలమును బ్రోచి - కాంక్షలిచ్చుత                             
llకృష్ణll


109.కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!

    అప్రమేయ వరద! హరి! ముకున్ద!
    మిమ్ము జూడగంటి - మీ కృప గనుగొంటి
    అఖిల సౌఖ్య పదవు - లంద గంటి

110.శ్లో. కాయేన వాచా - మనసేన్ద్రియైర్యా
      బుధ్యాత్మ నావా -ప్రకృతే స్వభావాత్
      కరోమి యద్యత్య - కలం పరస్మె
  శ్రీమ్మన్నారాయణౌ యేతి సమర్పయామి

ఓమ్ తత్సత్
శ్రీకృష్ణార్పణమస్తు
శ్రీకృష్ణ సంకీర్తనములు  సంపూర్ణము