...

...

29, జనవరి 2011, శనివారం

శాలువా!

 "మనకేమి జమీందారులం. పది ఎకరాల మామిడి తోట, పదిహేనెకరాల మాగాణీ, పాతికెకరాల మెట్ట. వ్యవసాయానికి కొత్త వరవడి దిద్ది రాజనాలు పండించిన రైతుబిడ్డను. ఊరిపెద్దగా, ఉత్తమ రైతుగా గౌరవించి ముఖ్యమంత్రి కప్పిన శాలువా నా భుజం మీద ఉన్నంతవరకు ఈ ఊరి బాధ్యత మనం మోయాల్సిందే. బాధ్యతన్న తరువాత కొన్ని బాధలు తప్పవు. అంతమాత్రానికే మన జమీందారీ పోద్దా?" అన్నాడు శంకరయ్య.
 
    "పేరుకేమో జమీందారు, పూటకు మాత్రం కరువు. వెనకటికొకడు వక్క పుటుక్కున కొరికాడంట. 'ఈ బల్లిపల్లి సంస్థానంలో ఇంత నిర్భయంగా ఎవడ్రా వక్క కొరికింది?' అన్నాడట సంస్థానాధీశుడు. కొరికినోడు 'నేనే స్వామీ' అన్నాడట భయపడుతూ. 'అయితే సగమిట్టా పంపించు' అన్నాడట ఆ సంస్థానాధీశుడు" శంకరయ్యకు ఒకటే నవ్వు. పార్వతమ్మ కూడా నవ్వుతూ "మన సమస్థానమూ అంతే. తోట, మాగాణి అంతా అడుమానం పెట్టి అప్పు తెస్తివి. అది తీరేది కాదు. భూమి మనకు దక్కేది కాదు. పోనీ పిల్లవాడికైనా మన బాధ చెప్పుకుందామంటే ఒప్పుకోకపోతివి."
 
    శంకరయ్య పార్వతమ్మ వైపు సాలోచనగా చూస్తూ "నేను వాడికి తండ్రినే. కొడుకును కాదు. వాడు ఏదడిగినా తండ్రిగా ఇంతకాలం ఇస్తూనే వచ్చాను. ఇవ్వడంలో వున్న ఆనందం తీసుకోవడంలో వుండదు. అందుకే నేను ఎప్పుడూ ఇస్తూనే వుంటాను. ఆఖరున ఈ ఊరిని కూడా వాడికే ఇస్తాను."
 
పిడుగు పాపిరెడ్డిగారి కథ శాలువాలోనిది ఈ సన్నివేశం. కథను పూర్తిగా చదవడానికి కథాజగత్ చూడండి.

26, జనవరి 2011, బుధవారం

రాయలమ్మ

గణతంత్ర దినోత్సవ కానుకగా మేము అందిస్తున్న కథ రాయలమ్మ కథాజగత్‌లో చదవండి. ప్రముఖ నాటక రచయిత ఎస్.మునిసుందరం గారి కలం నుండి వెలువడిన ఈ కథ రాయలవారి నేపథ్యంలో సాగింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి

20, జనవరి 2011, గురువారం

అత్యాశ


పెట్రోలు ధరలు పెరిగినప్పుడల్లా ఇలా నిరసన తెలియజేయడానికి సైకిల్‌పై మన నాయకులు యాత్రలు చేస్తారు బాగానే ఉంది కానీ ఇలా ప్రతీరోజూ వీళ్ళు సైకిల్‌పై పార్లమెంటుకో, శాసనసభకో, సెక్రెటేరియట్‌కో వెళితే ఎంతో కొంత పర్యావరణాన్ని కాపాడటానికి దోహదం చేసినవారవుతారు కదా!

19, జనవరి 2011, బుధవారం

మాలికా పద చంద్రిక!

కొత్తగా ప్రారంభమైన అంతర్జాలపత్రిక మాలిక పత్రిక లో నేను తయారు చేసిన పజిల్ ప్రకటించారు. దయచేసి చూడండి పూరించడానికి ప్రయత్నించండి.

17, జనవరి 2011, సోమవారం

కనువిప్పు

యువ రచయిత కొవ్వలి రామకృష్ణ పరమహంస గారి కథ కనువిప్పు కథాజగత్‌లో చదవండి.

14, జనవరి 2011, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 38

మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి కుటుంబసభ్యులు అందరికీ తురుపుముక్క మరియు కథాజగత్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు అందజేస్తున్నది.
 

ఆధారాలు:
1.  శాసన సభలో నాదెండ్ల మనోహరుని హోదా!(2,4)
3. ఈ అపశకునపు పక్షి లక్ష్మీదేవి వాహనమా? (4)
5. యుద్ధంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే ఒక పురస్కారం బాలయ్య సినిమాకు టైటిలయ్యింది.(3,2,2)
7. వైరాగ్యము లేక ప్రతికూలము అటునుంచి.(3)
9. కంచర్ల గోపన్న తానీషాకు చెల్లించాల్సిన శిస్తు సొమ్ముతో మరీ కట్టించినది.(3,2) 
10. ప్రకాశించే బుద్ధి గలవాడు.(5)
11. భారత దేశ భౌతిక పటంలో మోసమున్నదా?!(3)
14.రామదాసు రామునికి వాడిన ఒక విశేషణం. తామరాకులవలె విశాలమైన నేత్రములు కలవాడా అని.(3,4)
15. శ్రీకృష్ణుడు. ముర అనే రాక్షసుడిని సంహరించినవాడు కదా!(4)
16. ఒక రకంగా జిల్లాలకు రాజధాని.(2,4)
నిలువు:
1. కొటారము. తెలుగింటి స్టోరు రూము!(4)
2. పాయసము (శ్రీ+పదహారవ వంతు).(5)
4. ఉత్తరాది ఆంజనేయుడు (6)
5. కృష్ణా ట్రిబ్యూనల్ ముందు మనవాళ్ళు వినిపించింది. కనీసం తెదేపా వారి దృష్టిలో :) (4,3)
6. అనుమతి లేని కట్టడాలకు మన బల్దియా వారి పరిష్కారం?(7)
7. కావ్యము కాదు పొట్టిది.(3)
8. రవి స్ఫుటములో ఉన్నదేదో హఠాత్తుగా బయటపడింది.(3)
9. బుౙపత్తిరి రామునికి ప్రియమైనదా?(6)
12. ఇది చూచి ఇచ్చను కాముకుల్ చిచ్చులో బడుదురు క్షితితలమున అంటాడు వేమన్న.(5)
13. దయగలిగిన గుండెకాయ.(4)

12, జనవరి 2011, బుధవారం

శేషారత్నం కథ!

ప్రముఖ ఆకాశవాణి కళాకారిణి శ్రీమతి పి.వి.శేషారత్నం గారి కథ సంకల్పం కథాజగత్‌లో చదివి ఆనందించండి.

9, జనవరి 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 37 సమాధానాలు!

ఎవరిదానీడ?

     ఆ రాత్రి మెత్తగా తనకు తగులుతున్న చల్లగాలికి కంపించిపోతోంది ఆమె.

     ఆ గాలి తనలో మరింత వేడినిపెంచుతున్నట్టు అనిపిస్తోంది.

   మేఘాలపై కదులుతున్న చంద్రుడు కూడా తనలాగే అసహనంగా కనిపిస్తున్నాడు ఆమెకి. పరిమళాలు వెదజల్లుతున్న పూలు నిట్టూర్పులు విడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి. విరిపూల తీయతేనెలాస్వాదిస్తున్న గండు తుమ్మెదలు చేస్తున్న ధ్వనులు ఆమెలో అలజడులు సృష్టిస్తున్నాయి. గున్నమామిడి గుబురులలో కొంగ్రొత్త చివుళ్లను తిని మత్తెక్కిన కోకిలలు చేస్తున్న కుహూరావాలు ఆమెకు మైకం కలిగిస్తున్నాయి.

     కళ్ల కాటుక తనని చూసి నవ్వుతున్నట్టనిపించింది. నాసిక క్రింద ఎర్రని పెదాలు కంపిస్తున్నాయి. శంఖంలాంటి కంఠం నుంచి చెమట బిందువులు ధారగా లోయలోకి ప్రవహిస్తున్నాయి. ఆమె విరహవేదనలో దహించుకు పోతోంది.

     ఎప్పుడు ఎక్కడనుండి వచ్చాడో సుచీంద్ర మృదులను రాత్రంతా కవ్విస్తూనే ఉన్నాడు. ప్రణయానందాన్ని జుర్రుకునే మధుర తరుణంలో మరో నీడ. ఇద్దరి మధ్య చేరి రసభంగమయింది.  ఎవరిది ఆ నీడ?  తెలుసు కోవాలంటే కథాజగత్‌లో పారుపూడి వెంకట సత్యనారాయణగారి కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన? చదవండి.

8, జనవరి 2011, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 37


ఆధారాలు:
1.  మానాప్రగడ నరసింహమూర్తి, నేదునూరి గంగాధరం,కర్నాటి లక్ష్మి నరసయ్య,మామిండ్ల సాయిలు, బి.విఠలాచార్యలకు గల సామ్యము.(4,2)
3. పంతుల జోగారావుగారి కథలసంపుటి అసాధారణమైనదీ, అరుదైనదీనూ. (4)
5. భీష్ముడొక అశ్వవటువు.(3,4)
7. కడుంగడు సుఖమునొందిన నిష్ఠురత్వము కలుగునా?(3)
9. నడిరేయి అటుతిరిగింది.(5) 
10. ఆ మధ్య కాళహస్తిలో కూలిపోయింది ఇదేనా?(5)
11. రవిక!(3)
14.ఎంత ప్రత్యక్ష సాంగత్యమున్నా ఇలా చివరలో తడబడాలా?(2,5)
15. హైదరాబాదీయుల అఖిల భారతీయ పారిశ్రామిక ప్రదర్శన!(4)
16. ప్రపౌత్రులు!(6)
నిలువు:
1. బ్రౌన్ లైబ్రరీ హనుమచ్ఛాస్త్రి!(4)
2. గండీరి అనబడు ముళ్ళచెట్టు తడబడింది.(5)
4.బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి అంటూ ఘంటసాల వినిపించిన కథ ఈ సినిమాలోనిది. (3,3)
5. తీవ్రమైన ఓటమి!(2,5)
6. మిరపకాయ్ రవితేజకు జోడీ(2,5)
7. త్రిపుచ్ఛం దీనికి ఒక ఉదాహరణ.(3)
8. మంచి వాయువు పీలిస్తే లంబాడి అగుపించిందా?(3)
9. జయభేరిని మ్రోగించేది నేనుకాదు బాబూ మాగంటి రాజబాబు :-) (6)
12. బాంధవ్యము.(5)
13. చివర్లో హాస్యనటుడిని కలిగిన చాకలి.(4)

భరత సుతుడా మేలుకో! -22(చివరి భాగం)

209.ప్రభుత గోవుల గాఁచవలెనని
       రాజ్యాంగము వ్రాసికొనియును
       గోవుఁజంపెడు ప్రభుతలొచ్చెను
       భరత సుతుడా మేలుకో!

210.గుడులకమ్మెడు ఆవునేతిలొ
       పశుల క్రొవ్వుల నూనె కలిపెడు
       దుష్టరాక్షస తతిని గూల్చగ
       భరత సుతుడా మేలుకో!

211.వైద్యుడప్పుడు హరిసమానుడు
       అతడె ఇప్పుడు లచ్చిబానిస
       వృత్తి విలువల స్థాపనమ్ముకు
       భరత సుతుడా మేలుకో!

212.కవిత్వేతర కారణాలతొ
       కవికి గలిగెడు ఖ్యాతియెట్లన
       తీగనెరుగని మల్లెపందిరి
       భరత సుతుడా మేలుకో!

213.కాళ్ళు చేతులు కళ్ళనెరుగని
       మనిషివలె మన బ్రతుకులున్నవి
       తల్లి భారతి దుఃఖమెఱుగగ
       భరత సుతుడా మేలుకో!

214.నీవు ఏడ్చిన నాకు అశ్రువు
       నేను ఏడ్చిన నీకు అశ్రువు
       కారినప్పుడె మానవత్వము
       భరత సుతుడా మేలుకో!

215.నవ్వు ఏడ్పుల సంగమమ్మీ
       జీవితమ్మని ఎఱుగు కొరకని
       క్షమను శాంతిని ప్రోది చేయగ
       భరత సుతుడా మేలుకో!

216.ఎన్ని చెప్పిన దుఃఖమాగదు
       ఎంత రాసిన ఆర్తి తీరదు
       ఏమి చేతునొ తెలియకున్నది
       భరత సుతుడా మేలుకో!

217.ధర్మమును, శీలమ్ము సత్యము
       జ్ఞానధైర్యములను గుణమ్ములు
       పంచప్రాణాల్ భరత మాతకు
       భరత సుతుడా మేలుకో!

218. ఏది నిత్యం ఏదనిత్యం
        అని వివేచన చేసిచూడగ
        అనిత్యత్వమె నిత్యమైనది
        భరత సుతుడా మేలుకో!

219.తనువనిత్యం అయిననూ మరి
       ధర్మనిత్యత చాటుకొరకని
       తనువునిచ్చిన అదియె నిత్యం
       భరత సుతుడా మేలుకో!


శుభం.

- వరిగొండ కాంతారావు
    9441886824

6, జనవరి 2011, గురువారం

భరత సుతుడా మేలుకో! -21

200.మనలనేలిన వెధవయొక్కడు
       మన చరిత్రను మార్చి చెప్పగ
       సిగ్గులేకను నమ్ముచుంటిమి
       భరత సుతుడా మేలుకో!

201.భూమి భారతి చౌడుబారగ
       విషపు వృక్షములెన్నొ ఎదిగెను
       వేరు దేశపు విత్తనాలవి
       భరత సుతుడా మేలుకో!

202.ఇచట మనిషే పుట్టలేదట
       ఆదిపురుషుడు వలసవాడని
       నొక్కి చెప్పిరి ఆంగ్లేయులు
       భరత సుతుడా మేలుకో!

203.దస్యులార్యులు తన్నుకొనగా
       దస్యులోడిరి పారిపోయిరి
       ఆంగ్లవిద్యలు నుడువుచున్నవి
        భరత సుతుడా మేలుకో!

204.పంచముడు హరిజనుడు దళితుడు
       పేర్లు మారగ సంతసించిరి
       బ్రతుకు తీరున మార్పెలేదుగ
       భరత సుతుడా మేలుకో!


205.పుటుకలోపల ఉచ్చనీచము
       లెంచకూడదు భరతభూమిలొ
       'వాసుదేవు'న కర్థమెరుగగ
        భరత సుతుడా మేలుకో!

206.క్రియాశూన్యుగ భరతసుతుగని
       నల్లబడునిక వెండికొండలు
       ఇంకిపోవును మూడు సంద్రాల్
       భరత సుతుడా మేలుకో!

207.నల్లవారలు తెల్లబడుటకు
       ధనము బోలెడు ఖర్చు చేతురు
       'నల్లనయ్య'యె దేవుడిచ్చట
        భరత సుతుడా మేలుకో!

208.తిరుమలేశుని పూజ చేసెడు
       భాగ్యమొదవిన అయ్యవారలు
      వీధికుక్కకు కేలుమోడ్తురు
      భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు

5, జనవరి 2011, బుధవారం

భరత సుతుడా మేలుకో! -20

188.స్త్రీని వస్తువు జేయుచుండెడు
       నాగరీకము మతము పోకడ
       రెండువిధముల ఎగ్గు మనిషికి
       భరత సుతుడా మేలుకో!

189.ఆడయైనచో మగకు చాలట
       ఆడువారికి సైతమితియె
       వావివరుసలు వలదువలదట
      భరత సుతుడా మేలుకో!

190.స్త్రీని జంపెడు దుష్టమోహపు
       రాక్షసత్వము పేరు ప్రేమట
       ప్రేమకర్థము మరచిపోతిమి
       భరత సుతుడా మేలుకో!

191.దేవుడిచ్చిన వరము కనుటను
       విషయమతివలు మరచిపోయిరి
       కనుట స్త్రీలకు చిన్నతనమట
      భరత సుతుడా మేలుకో!

192.మగకు మగకూ ఆడకాడకు
       పెండ్లిచట్టము వచ్చుచున్నది
       జంతువింతకు జారకున్నది
       భరత సుతుడా మేలుకో!

193.స్త్రీలు పురుషులు రూపభేదమె
       ఆత్మ రెండిటియందు ఒక్కటె
       ప్రేమ దేవుని పథకమెఱుగుము
      భరత సుతుడా మేలుకో!

194.మానమెఱుగని రీతి ఒడలును
       తారలెందరొ జూపుచుండగ
       మానవతులకు మానభంగము
       భరత సుతుడా మేలుకో!

195.పడక గదియో వెండితెరయో
       తేడా తెలియక పోవుచున్నది
       యువత రాక్షస క్రీడ మొదలిడె
       భరత సుతుడా మేలుకో!

196.ఆడతనమును విప్పి చెప్పెడు
       బట్టకట్టెడు అతివ పురుషుని
       లోని మృగమును తట్టిలేపును
       భరత సుతుడా మేలుకో!

197.వెన్నుపూసలు దెబ్బతీసెడు
       ఎత్తుమడమల కాలిజోళ్ళను
       అతివలెందుకొ ఇష్టపడుదురు
       భరత సుతుడా మేలుకో!

198.ఆడదంటే అంగవిభవమె
       అన్నభావన ప్రబలిపోయెను
       అబల రక్షణ పురుష ధర్మము
      భరత సుతుడా మేలుకో!

199.మానవత్వము మంట గలువగ
       మనిషి మృగముగ మారిపోయెను
       మృగము సిగ్గుతొ చావనున్నది
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 
 

భరత సుతుడా మేలుకో! -19

180.పాత పొత్తము మనము చదువము
       చదువు వానిని మూర్ఖుడందుము
       మూర్ఖుడెవడో తెలుసుకొనుటకు
       భరత సుతుడా మేలుకో!

181.బ్రతుకు తెరువే చదువు అయినది
       పొట్టపోతయె తెలివి అయినది
       జంతుధర్మమ్మనగనిదియే
       భరత సుతుడా మేలుకో!

182.మార్కులొక్కటి ర్యాంకులొక్కటి
       మాత్రమే మరి చదువు అనియెడు
       కొండ చిలువల బడిని చంపగ
       భరత సుతుడా మేలుకో!

183.ప్రశ్నాపత్రములమ్ముకొని యెడు
      నీచునైనను టీచరందురు
      నిప్పు చెదలకు లొంగిపోయెను
      భరత సుతుడా మేలుకో!

184.చదువ జాలక బ్రతుక జాలక
       అపజయమ్మును చవిచూడజాలక
       చచ్చువారల కాచుకొరకని
       భరత సుతుడా మేలుకో!

185.విద్యగఱపెడు అయ్యవారల
       ఉచ్చనీచములెఱుగకుండిన
       జాతి మొత్తము భ్రష్టుపట్టును
       భరత సుతుడా మేలుకో!

186.మనసు ఎరుగని వెర్రివానికి
       పేరు చివరన పెక్కు డిగ్రీల్
       మేలుపుత్తడి తొడుగు శవమునకు
       భరత సుతుడా మేలుకో!

187.మెదడు వానిది వానగుంటయె
       మనసు మొత్తము మురికి కూపము
       జాతిహితముకు ఉపన్యాసము
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 

4, జనవరి 2011, మంగళవారం

కలిసుందాం రా!

లండన్‌కోటు కథ ద్వారా పాఠకలోకానికి పరిచయమైన సగ్గు రాజయ్యగారి డైరెక్టుకథ కలిసుందాం రా కథాజగత్‌లో చదవండి. అలాగే త్వరలో కథాజగత్‌లో వెలువడబోయే ఈ క్రింది కథలకై మీ దృష్టిని సారించండి.
1.పిడుగు పాపిరెడ్డి - శాలువా


2.పారుపూడి వెంకట సత్యనారాయణ -కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన

3.పి.వి.శేషారత్నం - సంకల్పం

4.రేగులపాటి కిషన్‌రావు - సౌజన్యం

5.రేగులపాటి విజయలక్ష్మి - కీడు జరుగుతుందా?

6.కొలకలూరి స్వరూపరాణి - ఫ్రిజుడిటీ

7.కొవ్వలి రామకృష్ణ పరమహంస - కనువిప్పు 


8.శ్రీవిరించి - పుడమి-పోడిమి


9.పి.వి.బి.శ్రీరామమూర్తి - పరిధి దాటిన వేళ

10.హోతా పద్మినీదేవి - పశ్చాత్తాపం   

భరత సుతుడా మేలుకో! -18

169.పాలకడలిలొ పుట్టినాడట
       ఆదివైద్యుడు ధన్వంతరి
       అల్లోపతియే వైద్యమిప్పుడు
       భరత సుతుడా మేలుకో!

170.వేలయేండ్లకు మున్నె చరకుడు
       నేటి యం.డి.వలె ఫిజీషను
       శుశ్రుతుండొక గొప్ప సర్జను
       భరత సుతుడా మేలుకో!

171.సుషేణుండను వైద్య నిపుణుడు
       యుద్ధరంగమునందు లక్ష్మణు
       కాచినాడని ఎఱుగు కొరకని
       భరత సుతుడా మేలుకో!

172.నాసత్యా దస్రులనబడు
     కవలలశ్విను దేవతలుగద
     వైద్యమందున వారు దిట్టలు
     భరత సుతుడా మేలుకో!

173.పంచకరణుల శాస్త్రజ్ఞానము
       నాటివైద్యుల కుండినదియని
       ఎఱుగమైతిమి నమ్మమైతిమి
       భరత సుతుడా మేలుకో!

174.భ్రమలు గొలిపెడు సభాభవనము
       ధర్మరాజుకు మయుడు ఇచ్చెను.
       త్రిపురములు నిర్మించినపుడతడె
       భరత సుతుడా మేలుకో! 

175.మిహిర భాస్కర ఆర్యభట్టులు
       లెక్కకు మిక్కిలి శాస్త్రజ్ఞులు
       భారతావని బుట్టియుండిరి
       భరత సుతుడా మేలుకో!


176.అణువె సృష్టికి మూలమను
      సిద్ధాంతమున్నది భారతావని
      మూలపురుషుడు కణాదుండట
      భరత సుతుడా మేలుకో!


177.'ఖ'లో యుండెడివన్ని 'గోళ'ము
        లనుచు తెలిపిన భారతావని
        బల్లపరుపున భూమియనునా?
        భరత సుతుడా మేలుకో!


178.నవగ్రహమ్ముల మధ్య సూర్యుని
       ప్రతిష్ఠించిన ఆర్షధర్మము
       భూమి సృష్టికి కేంద్రమనునా?
       భరత సుతుడా మేలుకో!


179.తుప్పుపట్టని విజయస్థంభము
       కాకతీయుల ద్వార శిల్పము
       శాస్త్రజ్ఞానము కుదాహరణలు
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు 

3, జనవరి 2011, సోమవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 36 సమాధానాలు!అడ్డం:
1. సుప్రసన్న,సంపత్కుమార,పేర్వారం,నరసింహారెడ్డిల ఆలోచన చేత చుట్టబడినది.(6) - చేతనావర్తము (దిగంబరకవిత్వానికి పోటీగా కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం,నరసింహారెడ్డి అనే నలుగురు కవులు చేతనావర్తమనే వాదాన్ని ముందుకు తెచ్చారు. చేతనావర్తమనగా ఆలోచనచే కప్పబడినది అని అర్థం)
3. పాతబస్తీలోని ఈ ప్రాంతంలో కాళీపట్నం మేష్టారుని వెదకండి.(4) - కాలాడేరా (ఈ పదంలో కారా అనే అక్షరాలు ఉన్నాయి. కాళీపట్నం రామారావుగారు కారా అనే పొట్టిపేరుతో ప్రసిద్ధులు)
5. హిందీ మన దేశ భాష. మరి ఆంగ్ల భాష? (5,2) - అంతర్జాతీయ భాష
7. బ్రహ్మ కోసం నలువది రోజులు తపస్సు చేస్తే చాలా? (3) - నలువ(ఆధారంలో వెదికితే దొరికిపోతుంది)
9. మాతా శిశు సంక్షేమం కొరకు ఏర్పరచిన కేంద్రము. (6) - అంగనవాడి 
10. సత్యశీలత వంటిదే!(5) - సత్యనిష్ఠత 
11.నడుమ ఉత్వంలోపించిన సస్య విశేషము.(3) - మినము (మినుములో మధ్య అక్షరంలో ఉత్వము తొలగించండి)
14. ఓ తాతా నీవు ఈ వాహనము కలిగినవాడవు.(7) - హంసవాహనుడవు (బ్రహ్మకు ఉన్న పేర్లలో తాత ఒకటి. అతని వాహనము హంస)
15. ఎండ్రకాయ దాక్కొన్న దిరిసెన చెట్టు.(4) - పీతనం (ఈ పదంలో పీత అనే అక్షరాలున్నాయి)
16.న్యూయార్క్ నగరంలోని దర్శనీయ కట్టడం.(3,3) - లిబర్టి విగ్రహం
నిలువు:
1. బొలీవియా విముక్తి పోరాటంలో మరణించిన గెరిల్లా పోరాట యోధుడు మన చేకూరి వారిని అక్కున చేర్చుకున్నారా?(4) - చేగువేరా (ఈ పేరులో చేరా అంటే చేకూరి రామారావుగారిని వెదకవచ్చు)
2. కంటకవల్లరులు.(5) - ముళ్ళతీగలు( వల్లరి అంటే తీగ అని అర్థం)
4. మన రాజకీయనాయకులు పెక్కురిలో ఇది లోపించినది.(6) - రాజనీతిజ్ఞత (ఒప్పుకొంటారా:-))
5. ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలతో పాటు  చీకట్లో కాంతిరేఖలు కూడా చూపించిన ఆదర్శ రచయిత.(3,4) - అంతటి నరసింహం( డా.అంతటి నరసింహంగారు ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు అనే అంశంపై పరిశోధన చేశారు. అలాగే  చీకట్లో కాంతిరేఖలు అనే నవలను రచించారు)  
6. అభిదాన రత్నమాల - తెనుఁగర్థముగల సంస్కృత నిఘంటువు. దీనికి మరియొక పేరు. (3,4)  - షడ్రస నిఘంటువు
7. మధ్య.(3) - నడిమి  
8. నవాసములో సంభవం.(3) - వసము
9.కొలిమియో కుంపటియో ఏదో ఒకటి.(6) - అంగారధానిక   
12. నవాబు గారి కొత్త భవంతి.(2,3) - నయా హవేలి (ఉర్దూపదాన్ని సూచించేందుకు నవాబుగారు అనే హింట్ ఇవ్వబడింది)
13. ఆరుద్ర కవిత్వంతో మేవా(ముస్లిం ఎంప్లాయీస్ వెల్‌ఫేర్ అసోసియేషన్)కు పని యేమిటి?(4) - త్వమేవాహం (త్వమేవాహమ్ ఆరుద్ర వ్రాసిన కవిత్వం)

ఈ పజిల్‌ను ప్రయత్నించిన చదువరి,భమిడిపాటి సూర్యలక్ష్మి,మహెక్ గార్లకు అభినందనలు! కంది శంకరయ్యగారికి కృతజ్ఞతలు!

2, జనవరి 2011, ఆదివారం

పుస్తక సమీక్ష - 20 సైన్స్ ఫిక్షన్ కథలు!

[పుస్తకం పేరు:సైన్స్ ఫిక్షన్ కథలు, రచన:కస్తూరి మురళీకృష్ణ, పేజీలు:80, వెల:రూ50/-, ప్రతులకు:నవోదయా బుక్ హౌస్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా,కాచిగూడా క్రాస్‌రోడ్స్, సుల్తాన్ బజార్, హైదరాబాద్-27]

రచయితగా ఒక ఇమేజ్‌కి బద్ధుడిని కాకూడదని, మూస రచనల ఊబిలో చిక్కుకోకూడదని విభిన్న ప్రక్రియలలో ప్రయోగాత్మకంగా చేస్తున్న రచనలలో భాగమే ఈ సైన్స్ ఫిక్షన్ కథలు అనే అర్థం వచ్చేట్లు రచయిత తన ముందుమాటలో వ్రాసుకున్నారు. అందుకు తగినట్టే ఈ పుస్తకం పాఠకులను మూస కథలనుండి దూరంగా పూర్తిగా కొత్తదైన ఒక 'వాతావరణం' లోకి తీసుకువెళ్తుంది.

వైజ్ఞానిక శాస్త్రరంగంలో జరుగుతున్న ప్రయోగాలకు, పరిశోధనలకు కొంత ఊహను జోడించి ఈ కథలను సృజించారు మురళీకృష్ణ. వీరికి ఫాంటసీకి, ఫిక్షన్‌కు మధ్య గల తేడా స్పష్టంగా తెలుసు. అయినా ఈ కథల్లో ముఖ్యంగా టైటన్లతో కరచాలనం, మిథ్యా సుందరి కథల్లో అక్కడక్కడ కొంత ఫాంటసీ తొంగి చూస్తూ ఉంది.  

మిథ్యాసుందరి, వైరస్ యుద్ధం, షాడో యూనివర్స్ నీడ, కీక్...కీక్...కీక్..., కాలం చూసిన సత్యం కథలు మన భూగ్రహం మీద నడిస్తే  మిగిలిన ఐదు కథలూ మనలను వేరే గ్రహాలకు తీసుకువెళతాయి. ప్రయోగం కథలో బుధగ్రహంలో మానవ నివాసయోగ్యతపై సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తే టైటన్లతో కరచాలనం కథలో శనిగ్రహానికి ఉపగ్రహమైన టైటన్ గ్రహంలో మానవాళికి అవసరమైన ఆహారధాన్యాలను పండించి వాటిని మన భూమికి దిగుమతి చేసుకునేట్లు రచయిత ఊహిస్తున్నారు.  నేనెవరిని కథలో మనిషి లక్షణమైన అసూయను రోబోకు ఆపాదిస్తే, కీక్...కీక్...కీక్... కథలో భావావేశాలకు అతీతం కాని మనుషులు రోబోలకు బానిసగా మారిపోయే వైనాన్ని చూపిస్తున్నారు రచయిత.    డార్క్ మాటర్ సిద్ధాంతాన్ని షాడో యూనివర్స్ నీడ కథలోనూ, వార్మ్ హోల్ గురించి పునఃసృష్టికి పురుటినొప్పులు కథలోనూ పాఠకులకు కొంత అవగాహన కల్పిస్తున్నారు.   వైరస్ యుద్ధం కథ ఇప్పటికే కొంత అనుభవంలోకి వచ్చిన కథ. ఈ మెయిళ్ల ద్వారా వైరస్‌ను, స్పైవేర్‌ను కంప్యూటర్లలోకి చొప్పించి విలువైన సమాచారాన్ని పాస్‌వర్డ్‌లను దొంగిలించి హ్యాకింగ్ ద్వారా దేశభద్రతకు సంబంధించిన విలువైన సమాచారం చేతులు మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మిథ్యాసుందరి కథ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువకులు కంప్యూటర్ గేములకు బానిసలుగా మారిన తీరును, వీటిని నిర్వహిస్తున్న గుత్తాధిపత్య సంస్థలు ప్రజలను నిర్వీర్యులుగా తయారు చేస్తున్న వైనాన్ని ఎత్తి చూపిస్తూంది.  టైం మెషీన్‌ద్వారా రెండు లక్షల సంవత్సరాల వెనక్కి గతంలో ప్రయాణించి అప్పటి విచిత్రజీవులతో చేసిన సాహసాన్ని వివరించే కథ కాలం చూసిన సత్యం. మానవ జాతిపతనంపై తన ఆక్రోశాన్ని ఆవేదనని చివరి కథ బెంటెల్గీస్‌లో బాలుడులో ఒక పాత్ర ద్వారా ఇలా పలికిస్తున్నారు మురళీకృష్ణగారు. "విశ్వంలో ఉన్న అత్యంత ప్రమాదకర జీవి మానవుడు. ఇతర జీవులు ప్రకృతిపై ఆధారపడి బ్రతుకుతాయి. ప్రకృతినుంచి ఎంత తీసుకుంటే అంత ప్రకృతికి తిరిగి అందిస్తాయి. కానీ మానవుడు స్వార్థపరుడు. ప్రకృతిని నిర్దేశించడం గొప్ప అనుకుని సర్వనాశనం చేసుకునే మూర్ఖుడు. విశ్వంలోని జీవులు ఆహారం కోసమే చంపుతాయి. కానీ భయంకరమైన మారణాయుధాలు తయారు చేసుకుని తమని తాము నాశనం చేసుకునే నీచులు మానవులు. పైగా వీళ్ళకి ఉన్న రోగం ఎదుటివాడిపై అధికారం చెలాయించడం." 

ఏది ఏమైనా  ఒక 'స్థాయి'గల పాఠకులు మాత్రమే చదివి అర్థం చేసుకోగల కథలు ఇవి. అయితే దానికి కారణం సబ్జెక్టే కానీ రచయిత ముమ్మాటికీ కాదు.                        
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 36

ఆధారాలు:
1. సుప్రసన్న,సంపత్కుమార,పేర్వారం,నరసింహారెడ్డిల ఆలోచన చేత చుట్టబడినది.(6)
3. పాతబస్తీలోని ఈ ప్రాంతంలో కాళీపట్నం మేష్టారుని వెదకండి.(4)
5. హిందీ మన దేశ భాష. మరి ఆంగ్ల భాష? (5,2)
7. బ్రహ్మ కోసం నలువది రోజులు తపస్సు చేస్తే చాలా? (3)
9. మాతా శిశు సంక్షేమం కొరకు ఏర్పరచిన కేంద్రము. (6)
10. సత్యశీలత వంటిదే!(5)
11.నడుమ ఉత్వంలోపించిన సస్య విశేషము.(3)
14. ఓ తాతా నీవు ఈ వాహనము కలిగినవాడవు.(7)
15. ఎండ్రకాయ దాక్కొన్న దిరిసెన చెట్టు.(4)
16.న్యూయార్క్ నగరంలోని దర్శనీయ కట్టడం.(3,3)
నిలువు:
1. బొలీవియా విముక్తి పోరాటంలో మరణించిన గెరిల్లా పోరాట యోధుడు మన చేకూరి వారిని అక్కున చేర్చుకున్నారా?(4)
2. కంటకవల్లరులు.(5)
4. మన రాజకీయనాయకులు పెక్కురిలో ఇది లోపించినది.(6)
5. ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలతో పాటు  చీకట్లో కాంతిరేఖలు కూడా చూపించిన ఆదర్శ రచయిత.(3,4)
6. అభిదాన రత్నమాల - తెనుఁగర్థముగల సంస్కృత నిఘంటువు. దీనికి మరియొక పేరు. (3,4)
7. మధ్య.(3)  
8. వనవాసములో సంభవం.(3)
9.కొలిమియో కుంపటియో ఏదో ఒకటి.(6)  
12. నవాబు గారి కొత్త భవంతి.(2,3)
13. ఆరుద్ర కవిత్వంతో మేవా(ముస్లిం ఎంప్లాయీస్ వెల్‌ఫేర్ అసోసియేషన్)కు పని యేమిటి?(4)

భరత సుతుడా మేలుకో! -17

156.గతము మరచుట మేలు అనియెడు
       అయ్యవార్లకు కొదువలేదిట
       గతము చచ్చిన జాతి చచ్చును
       భరత సుతుడా మేలుకో!

157.పోరలను ఉరిదీయు బడిలో
       తల్లిదండ్రులె వేయుచుందురు
       ప్రహ్లాదుని తండ్రె మేలట
      భరత సుతుడా మేలుకో!

158.విద్యయందున విషము వలదని
       పూర్వజులు మరి చెప్పియుండగ
       నేడు విషమే విద్యయైనది
       భరత సుతుడా మేలుకో!

159.శిశువు పశువుగ మారిపోగల
       చదువు చెప్పెడు బడులు కలవిట
       హీనవిద్యతొ మనిషి నాశము
       భరత సుతుడా మేలుకో!

160.అక్షరమ్ముల విలువ నెఱుగక
       ఏబదారున కోతవెట్టిరి
       అల్పజ్ఞానులు ఘనతనొందిరి
       భరత సుతుడా మేలుకో!

161.డూమూవూలకు లొంగి సంస్కృత
       పదములె తెలుగయ్యె, నట్లే
       కొత్త పదములు చేర్చుకొనుటకు
       భరత సుతుడా మేలుకో!

162.వ్రాయు భాషకు పలుకు సంజ్ఞలు
       ఆంగ్లభాషలొ విడిగ నుండును
       తెలుగు భాషకు రెండు ఒక్కటె
       భరత సుతుడా మేలుకో!

163.మాట శబ్దము వ్రాత చిహ్నము
       మాట వ్రాతలు క్షరాక్షరములు
       వ్రాయబడినది భావి నిధి గద
       భరత సుతుడా మేలుకో!

164.వ్రాయుమాటకు స్థాయిగావలె
       భావి వారికి అర్థమవవలె
       అట్లు కానిచొ రచన వ్యర్థము
       భరత సుతుడా మేలుకో!

165.సృజన చేసెడి వాడె అర్థము
       చెప్పు స్థాయిలొ రచన యుండిన
       కవితొ పాటుగ రచన చచ్చును
       భరత సుతుడా మేలుకో!

166.అనుభవించిన వాడె రచనను
      చేయవలెనను నియమముండిన
      గర్భవతి కథ నరుడు వ్రాయడు
      భరత సుతుడా మేలుకో!

167.అనుభవమ్మే అర్హతనినచొ
      మానభంగము కథను వ్రాయగ
      పొందవలెగద మానభంగము
      భరత సుతుడా మేలుకో!

168.వేదమన్నది జ్ఞాన పేటిక
       మూత తెరిచెడు శక్తి కలిగిన
       సంస్కృతమ్మును పారవేస్తిమి
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు