...

...

24, ఏప్రిల్ 2011, ఆదివారం

మాలికాపదచంద్రిక -2

మాలిక పత్రిక రెండవ సంచిక విడుదలయ్యింది. ఈ సంచికలో  మాలికాపదచంద్రిక శీర్షికతో నేను నిర్వహిస్తున్న క్రాస్‌వర్డ్ పజిల్‌ను ఇక్కడ చూడండి. పూరించడానికి ప్రయత్నం చేయండి. 

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

గది - గుడిపాటి కథ!

ఇటీవల తిరువనంతపురంలో కేంద్రసాహిత్య అకాడెమీలో నిర్వహించిన కథాసదస్సులో పలువురి మన్ననలను పొందిన గుడిపాటి కథ గది కథాజగత్‌లో మీ కోసం! ఏకాకి గది చుట్టూ అల్లిన ఈ కథలో నగరంలోని సంఘర్షమయ జీవితాన్ని, గ్లోబలైజేషన్ ప్రభావాన్ని, ఆలోచనా వైరుధ్యాల్ని, అంతరంగాల సంక్లిష్టతల్ని, ఎన్‌కౌంటర్ సంస్కృతిని ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా చిత్రీకరించబడిన ఈ కథపై మీ అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాం.

18, ఏప్రిల్ 2011, సోమవారం

భద్రాచలం యాత్ర... వాళ్ళక్క కథ?

సుప్రసిద్ధ సినిమా దర్శకుడు, రచయిత వంశీ కలం నుండి వెలువడిన కథ భద్రాచలం యాత్ర... వాళ్ళక్క కథ? కథాజగత్‌లో చదవండి. మా పసలపూడి కథలు అనే సంపుటం నుండి ఈ కథ గ్రహించబడింది.    

17, ఏప్రిల్ 2011, ఆదివారం

అంతర్జాలంలో తెలుగు వికసించేనా?

సిలికానాంధ్ర వారి సదస్సుకు హాజరు కాలేదు కానీ వార్తాపత్రికలో చదివిన దాని ప్రకారం అంతర్జాలంలో తెలుగుకు మంచిరోజులు వస్తున్నాయని అనిపించింది. ఆ సదస్సు వివరాలు మీకోసం. 



16, ఏప్రిల్ 2011, శనివారం

సత్యభాస్కర్ కథ!

సత్యభాస్కర్ కథ కుంచెవాడు కథాజగత్‌లో ప్రకటింపబడింది. తప్పక చదవండి. 

14, ఏప్రిల్ 2011, గురువారం

మా ఊరి దొంగ!

చొప్పదండి సుధాకర్‌గారి హాస్య కథ మా ఊరి దొంగ కథాజగత్‌లో చదవండి. తెలంగాణా యాసలో సాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

13, ఏప్రిల్ 2011, బుధవారం

జగత్‌కుటుంబము


కథాజగత్‌లో కథారచయితల ఫోటోలు కొన్ని జతచేయడం జరిగింది. మరికొందరివి పెట్టవలసి ఉంది. ఫోటోలు పంపని వారు దయచేసి వెంటనే పంపవలసినదిగా మనవి.

12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తురుపుముక్క శుభాకాంక్షలు అందజేస్తోంది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షవీక్షణాలు మీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 41 సమాధానాలు!


1.  ఎంగిలి విస్తరాకులో వ్యాఘ్రము కనబడిందా?  - పులివిస్తరాకు 
3. తొలురిక్క నెల.ఆశ్వయుజం 
5. దక్షిణ భారత కాలగణన పద్ధతి యిది.శాలివాహన శకం
7. మంచి మతపు యంగీకారము.సమ్మతం 
9. జలవిహార్‌కు వెళ్ళినవాడు :)  - జలవిహారి 
10. మెగాస్టార్ తమ్ముడు. యిప్పుడు తీన్‌మార్ అంటూ డప్పుకు దరువు వేయమంటున్నాడు.పవర్‌స్టార్  
11. నిలువు 8లో బిందువు లోపిస్తే ఋషులాచరించేది. - తపము 
14.ముదిగొండ శివప్రసాదు వారి నవల తంజావూరు విజయం అయితే మల్లాది వసుంధర గారిది?  - తంజావూరు పతనం 
15.  భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన వ్యక్తి అట్నుంచి. -  ర్మవవిర 
16. నక్క గుణము :)  -  టక్కరితనము
నిలువు:
1. ప్రశాంతినిలయానికీ శివతాండవానికీ వున్న సంబంధం. పుట్టపర్తి
2. ఉబలాటపడే మాజీ మంత్రిణికుతూహలమ్మ 
4. హస్తినలో ధర్నా సెంటర్జంతర్ మంతర్ 
5. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య 19,యతి ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము ప్రాస పాటించ వలెను ప్రాస యతి చెల్లదు.... యింతకీ నేను చెబుతున్నది దేని గురించి?శార్దూల విక్రీడితం 
6. నల్లమోతు శ్రీధర్‌గారి ఒకప్పటి కలనయంత్రపు తెలివిడికంప్యూటర్ విజ్ఞానం (ప్రస్తుతం నల్లమోతు శ్రీధర్‌గారు కంప్యూటర్ ఎరా అనే పత్రికకు సంపాదకునిగా ఉన్నారు. పూర్వం కంప్యూటర్ విజ్ఞానం అనే పత్రికకు సారథ్యం వహించారు)
7. భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ అంటూ పాట పాడిన నటి  - సరిత
8. అడ్డం 11లో సున్న చేరిస్తే బలుపు అవుతుందాతంపము 
9. ఈ బ్లాగరువి అందమైన అక్షరాలు జగన్నాథ శర్మ (నవ్య వీక్లీ సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారు అందమైన అక్షరాలు పేరుతో ఒక బ్లాగును ప్రారంభించారు.)
12. ఏలూరులోని బలమైన ప్రదేశం పవరు పేట 
13. అలజడి కల్లోలము


9, ఏప్రిల్ 2011, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 41



ఆధారాలు:
1.  ఎంగిలి విస్తరాకులో వ్యాఘ్రము కనబడిందా? (2,6)
3. తొలురిక్క నెల.(4)
5. దక్షిణ భారత కాలగణన పద్ధతి యిది. (5,2)
7. మంచి మతపు యంగీకారము.(3)
9. జలవిహార్‌కు వెళ్ళినవాడు :) (5)
10. మెగాస్టార్ తమ్ముడు. యిప్పుడు తీన్‌మార్ అంటూ డప్పుకు దరువు వేయమంటున్నాడు.(3,2)
11. నిలువు 8లో బిందువు లోపిస్తే ఋషులాచరించేది. (3)
14.ముదిగొండ శివప్రసాదు వారి నవల తంజావూరు విజయం అయితే మల్లాది వసుంధర గారిది? (4,3)
15.  భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన వ్యక్తి అట్నుంచి.(4)
16. నక్క గుణము :) (6)
నిలువు:
1. ప్రశాంతినిలయానికీ శివతాండవానికీ వున్న సంబంధం.(4)
2. ఉబలాటపడే మాజీ మంత్రిణి(5)
4. హస్తినలో ధర్నా సెంటర్ (3,3)
5. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య 19,యతి ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస పాటించ వలెను ప్రాస యతి చెల్లదు.... యింతకీ నేను చెబుతున్నది దేని గురించి?(3,4)
6. నల్లమోతు శ్రీధర్‌గారి ఒకప్పటి కలనయంత్రపు తెలివిడి (4,3)
7. భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ అంటూ పాట పాడిన నటి  (3)
8. అడ్డం 11లో సున్న చేరిస్తే బలుపు అవుతుందా(3)
9. ఈ బ్లాగరువి అందమైన అక్షరాలు (4,2)
12. ఏలూరులోని బలమైన ప్రదేశం (3,2)
13. అలజడి(4)

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది కానుక!

ఆదూరి వెంకట సీతారామ మూర్తి గారి కథ గలగలాగోదారి ఉగాది కానుకగా కథాజగత్‌లో అందిస్తున్నాం. చదివి ఆనందించండి.

శ్రీ ఖరనామ ఉగాది శుభాకాంక్షలు!


మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరికీ "ఖరనామ" నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమస్త శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

2, ఏప్రిల్ 2011, శనివారం

జయహో!!!

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో)



లంకావాసుల గూల్చగ
ఢంకా మ్రోగించి రండు అంకస్థలికిన్
శంకేల కప్పు మీదిక
పంకజలోచనుని కృపను భారత వీరా!