కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించు చుండును
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.
ఇదెలా సాధ్యమో ఎవరైనా వివరించ గలరా!
...
13, నవంబర్ 2009, శుక్రవారం
3, నవంబర్ 2009, మంగళవారం
బుడ్డా వెంగళరెడ్డి

ఎస్.డి.వి.అజీజ్ రచించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవల మా సంస్థ తరఫున ప్రచురించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆ పుస్తకం హైదరాబాదులోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో అంటే విశాలాంధ్ర, నవోదయ, తెలుగుబుక్ హౌస్, దిశపుస్తకకెంద్రం, ప్రజాశక్తి, సహచర బుక్‌మార్క్,సాహిత్యనికేతన్, ఆంధ్ర సారస్వత పరిషత్ మొదలైన చోట్ల లభిస్తుంది. ఆంధ్ర దేశంలో ఉన్న విశాలాంధ్ర, ప్రజాశక్తి వారి బ్రాంచీలలో కూడా లభ్యమవుతుంది. విదేశాలలో ఉన్న వారు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయదలిస్తే ఎ.వి.కె.ఎఫ్. వారి బుక్ లింక్‌ను చూడండి. వెల కేవలం యాభై రూపాయలు మాత్రమే కాబట్టి వీలున్న వారు ఈ పుస్తకాన్ని కొని చదవమని నా విన్నపం.
Labels:
Budda Vengala Reddy
2, నవంబర్ 2009, సోమవారం
పరాకు మానిసి!
ఒక పదాన్ని గానీ పదబంధాన్ని గానీ వెనుకనుండి చదివినా ముందునుండి చదివినా ఒకేలా ఉంటే దానిని ఇంగ్లీషులో palindrome అని అంటారు. ఉదా:- కిటికి, వికటకవి, మందారదామం వగైరా. ఇలాంటి palindromeతో కూడిన ఒక సంభాషణను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. దీనిని శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల మధ్య నడిచిన సంభాషణగా ఊహించి ఎంత చక్కగా అల్లారో చూడండి.
కృ.శా. : రారా శ్రీశ్రీ రారా!
శ్రీశ్రీ : యాటికిరా కిటియా!
కృ.శా. : సినిమాకురా పరాకు మానిసి!
శ్రీశ్రీ : రాలేనులేరా!
సరదాగా గమ్మత్తుగా లేదూ!
కృ.శా. : రారా శ్రీశ్రీ రారా!
శ్రీశ్రీ : యాటికిరా కిటియా!
కృ.శా. : సినిమాకురా పరాకు మానిసి!
శ్రీశ్రీ : రాలేనులేరా!
సరదాగా గమ్మత్తుగా లేదూ!
1, నవంబర్ 2009, ఆదివారం
కథాజగత్‌లో మరో రెండు కథలు!
వర్తమాన కథా కదంబం ఆధునిక తెలుగు కథానిక శత వార్షికోత్సవాల కానుక కథాజగత్ వెబ్‌సైటులో కొత్తగా రెండు కథలు చేరాయి. మొదటిది స్వాతి శ్రీపాద రచించిన ఎర అనే కథ. రెండవది డా.టీ.సంపత్‌కుమార్ వ్రాసిన మSheన్ అనే కథ. వీటిల్లో ఎర డైరెక్టు కథ కాగా మsheన్ స్త్రీవాద పత్రిక భూమికలో ఆగస్టు 2008లో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.
Labels:
katha jagat
25, అక్టోబర్ 2009, ఆదివారం
భరాగో కథ!
ప్రసిద్ధ కథా రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి కలం నుండి వెలువడిన 'నుపకారికి నపకారము!' అనే కథను తెలుగు కథల శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథా కదంబం "కథాజగత్"లో చదవండి.
అతి త్వరలో ఈ క్రింది కథలు కూడా కథాజగత్‌లో ప్రకటింప బడతాయి.
1.రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి
2.గృహ హింస - ఆచార్య కొలకలూరి ఇనాక్
3.హామీ...!! - ఎ.వి.యం
4.రెండు లోకాలు - డా. వేదగిరి రాంబాబు
5. బొమ్మలు - డా.బోయ జంగయ్య.
తప్పక చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.
అతి త్వరలో ఈ క్రింది కథలు కూడా కథాజగత్‌లో ప్రకటింప బడతాయి.
1.రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి
2.గృహ హింస - ఆచార్య కొలకలూరి ఇనాక్
3.హామీ...!! - ఎ.వి.యం
4.రెండు లోకాలు - డా. వేదగిరి రాంబాబు
5. బొమ్మలు - డా.బోయ జంగయ్య.
తప్పక చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.
Labels:
katha jagat
19, అక్టోబర్ 2009, సోమవారం
నాకు తెలిసిన బాలగోపాల్

ఇదే శీర్షికతో అంకురం బ్లాగులో శరత్‌చంద్ర వ్రాసిన టపా చూసిన తరువాత నాకు కూడా బాలగోపాల్ గురించి వ్రాయడానికి కాస్త ధైర్యం వచ్చింది. నా జీవితంలో బాలగోపాల్ గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం రెండు సార్లు కలిగింది. నేను అనంతపురంలో డిప్లొమా చదివే రోజుల్లో మొదటి సారి బాలగోపాల్‌ను చూశాను. లలిత కళా పరిషత్ పక్క సందులో ఉండే గిల్డ్ ఆఫ్ టీచర్స్ స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ రామనాథం సంతాప సభలో బాలగోపాల్ ప్రసంగం విన్నాను. ముందు వరసలో కూర్చుని(ఆ సభకు కార్యకర్తలు మినహా ఎక్కువ మంది హాజరు కాలేదు) అతి దగ్గరనుండి బాలగోపాల్‌ను చూసే అవకాశం కలిగింది. ఆ సభ విశేషాలు నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ చాలా వేగంగా ఉద్రేకపూర్వకంగా సాగిన బాలగోపాల్ ప్రసంగం నాకు ఇప్పటికీ మనసులో మెదులుతోంది. బహుశా అప్పటికి ఇంకా అతను ఎ.పి.సి.ఎల్.సి.లో ముఖ్యమైన బాధ్యతను చేపట్టలేదనుకుంటా. ఆ రోజు నుండి నాకు తెలియకుండానే బాలగోపాల్ ప్రభావం నాపై పడింది. తరువాత అప్పుడప్పుడూ పత్రికలలో బాలగోపాల్ గురించి, పౌర హక్కుల గురించి వార్తలు చదివే వాడిని. ఎ.పి.సి.ఎల్.సి.కి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడని వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. అతనో అన్‌సంగ్ హీరోగా నామనసులో వుండిపోయాడు. రెండోసారి బాలగోపాల్‌ను నేను కలిసింది ఆర్.టీ.సీ బస్సులో. అదీ అతని పక్క సీటులో కూర్చుని కలిసి ప్రయాణించే అదృష్టం కలిగింది. నేను హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్నాను. కాస్సేపటి తర్వాత బాలగొపాల్ బస్సు ఎక్కి నా పక్కన ఉన్న విండో సైడు సీటు వద్దకు వచ్చాడు. పొట్టి చేతుల కాటన్ చొక్కా వేసుకుని ఉన్నాడు. భుజాన ఒక గుడ్డ సంచి మరో చేతిలో పోస్టర్లు చుట్టి ఉన్న కట్ట పట్టుకుని అతి సాధారణంగా వస్తున్న బాలగోపాల్‌ను చూసి ఆశ్చర్యపోయాను. లేచి అతనికి దారి వదలి అతను తన సీటులో కూర్చోగానే నా సీటులో నేను కూర్చున్నాను. సంకోచంతో కూడిన ఉద్వేగం వల్లనో మరే కారణం చేతో నేను బాలగోపాల్‌ను పలకరించే సాహసం చేయలేకపోయాను. అతను కూడా నా వైపు ఒక చూపు చూసి తన పనిలో తాను మునిగిపోయాడు. మరుసటిరోజు తాను పాల్గొనే సభగురించి ఆలోచించుకుంటూ ఉండివుంటాడు. ఆరోజు అతన్ని పలకరించి పరిచయం చేసుకోక పోవడం నేను చేసిన తప్పుగా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. తరువాత బాలగోపాల్ కడపలో బస్సు దిగిపోయాడు. తరువాత అడపాదడపా టీ.వీ.చానళ్ళలో చర్చలలో అతడిని చూడటం, అతడు రాసిన వ్యాసాల్లో ఒకటో రెండో చదవడం మినహా బాలగోపాల్ గురించి నాకు తెలిసింది శూన్యమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే బాలగోపాల్ గురించి ఆయన మరణించిన తరువాతనే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. తాడిత పీడిత అణగారిన వర్గాల తరఫున ఆయన నిత్యం న్యాయం కోసం హైకోర్టులో అలుపెరుగని పోరాటం చేసేవాడనీ, మానవ హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ ప్రత్యక్షమై తన గొంతుకను విప్పేవాడనీ, కేవలం మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కాశ్మీర్, బీహార్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో కూడా మానవ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడనీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో సాధికారమైన వ్యాసాల పరంపరను వెలువరించాడనీ, డి.డి.కోశాంబిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశాడనీ ఇంకా ఎన్నో విషయాలు ఆయన మరణించిన తర్వాతే తెలిసింది. 12వ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంతాప సభలో బాలగోపాల్ నాకు పూర్తిగా అవగాహనకు వచ్చాడు. బాలగోపాల్ సమకాలీకుడినని చెప్పుకునేందుకు ఇప్పుడు నేను గర్విస్తున్నాను.
16, అక్టోబర్ 2009, శుక్రవారం
దీపావళి శుభాకాంక్షలు!!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)