ఒక పదాన్ని గానీ పదబంధాన్ని గానీ వెనుకనుండి చదివినా ముందునుండి చదివినా ఒకేలా ఉంటే దానిని ఇంగ్లీషులో palindrome అని అంటారు. ఉదా:- కిటికి, వికటకవి, మందారదామం వగైరా. ఇలాంటి palindromeతో కూడిన ఒక సంభాషణను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. దీనిని శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల మధ్య నడిచిన సంభాషణగా ఊహించి ఎంత చక్కగా అల్లారో చూడండి.
కృ.శా. : రారా శ్రీశ్రీ రారా!
శ్రీశ్రీ : యాటికిరా కిటియా!
కృ.శా. : సినిమాకురా పరాకు మానిసి!
శ్రీశ్రీ : రాలేనులేరా!
సరదాగా గమ్మత్తుగా లేదూ!
4 కామెంట్లు:
భలే గమ్మత్తుగా ఉంది.
థ్రిల్లింగ్ గా వుంది...
అబ్బ అద్భుతంగా ఉంది....ఎంతైనా వాళ్ళు మహానుభావులు.
చాలా బాగుంది :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి