ఈ ఏడాది
కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రచురించిన 10వ తరగతి తెలుగు పాఠ్యగ్రంథం(ప్రథమ
భాష)లో విద్వాన్ విశ్వంగారి 'మాణిక్యవీణ' శీర్షికలోని ఈ క్రింది వచనకవితను ఒక పాఠంగా
ఇచ్చారు.
కానీ బాక్సులో చూపించిన భాగాన్ని తొలగించారు. బహుశా ఈ భాగాన్ని పిల్లలకు
అర్థమయ్యేలా వివరించే సామర్థ్యం నేటి ఉపాధ్యాయులకు లేదని ఈ పాఠ్య పుస్తకం సంపాదకుల
అభిప్రాయమేమో. అలాగే ఒక చోట "కాడువీడనప్పుడే" అన్న దానికి బదులు "కాడువీచినప్పుడే"
అని మార్చారు. దీని మతలబేమిటో? ఏది ఏమైనా విద్వాన్ విశ్వం శతజయంతి సంవత్సరంలోనైనా పదవ
తరగతి పాఠ్యాంశంగా ఆయన రచనను పరిచయం చేయడం దానికి పరోక్షంగా మా 'సాహితీవిరూపాక్షుడు
విద్వాన్ విశ్వం' పుస్తకం దోహదపడడం (ఈ పుస్తకం నుండే పై రచనను సేకరించారని రూఢిగా తెలిసింది)
సంతోషంగా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి