మీరు సరిగ్గానే చదివారు.
కీర్తిశేషులు మధురాంతకం రాజారాం స్మృత్యర్థం ఏర్పాటయిన మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ(తిరుపతి) 1999 నుండి ప్రతి యేటా కథావార్షిక పేరుతో కథా సంకలనాన్ని ప్రచురిస్తున్నది.
డాక్టర్ వి.ఆర్.రాసాని, మధురాంతకం నరేంద్రగార్లు ఈ కథావార్షికలకు సంపాదకత్వం వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వివిధ తెలుగు పత్రికలలో వచ్చిన కథలలో కొన్నింటిని ఎంచుకుని ఈ కథావార్షికలో ప్రచురిస్తున్నారు.
ఈ సంస్థ కథావార్షిక ప్రచురించటంతో పాటు ప్రతి యేటా ఒక కథా సంపుటిని ఎంపిక చేసి ఆ కథారచయితకు కథాకోకిల పురస్కారం ప్రదానం చేస్తున్నది.
2008 సంవత్సరానికిగాను కథాకోకిల పురస్కారం చిలుకూరి దేవపుత్ర రచించిన బందీ అనే కథాసంపుటికి లభించింది.
2008లో వెలువడిన కథలలో తొమ్మిదింటిని ఎంపికచేసి, కథాకోకిల పురస్కారం పొందిన కథాసంపుటి నుండి బందీ అనే కథను వెరసి పది కథలను ఈ కథావార్షిక 2008లో ప్రచురించారు.
ఇంకా ఈ పుస్తకంలో ఆడెపు లక్ష్మీపతి గారి '2008 కథా సాహిత్య సింహావలోకనం' అనే సమగ్రమైన వ్యాసం ఉంది.
అంతే కాకుండా పుస్తకం చివరలో 2008లో వెలువడిన కథలలో చదువదగిన కథలు అంటూ ఒక 50 కథల జాబితా ఇచ్చారు.
ఆ యేడాది వచ్చిన వందల కథల్లో వడపోసి ఈ 50 కథలను ఎంపిక చేసారన్నమాట.
ఈ చదువదగిన కథల జాబితాలో నా కథ బహుమానం కూడా ఉంది.
అదీ సంగతి!
3 కామెంట్లు:
congrats!!!!
అభినందనలు
katha nijangaa baagundi
కామెంట్‌ను పోస్ట్ చేయండి