...

...

12, అక్టోబర్ 2009, సోమవారం

క్షమాపణల బాటలో మరో మేధావి!

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి పై పాట రాయడమనే తప్పిదానికి భాద్యత వహిస్తూ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రజా ఉద్యమానికీ, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు ఈ రోజు పేపర్లో వార్త కనిపించింది. మానసిక స్థితి బాగాలేకపోవడం వల్ల, వయసు పైబడడంతో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై పాట కట్టాడట! ఇంతకు ముందు వి.ర.సం. నేత ఎన్.వేణుగోపాల్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి తో తనకుగల అనుబంధాన్ని తెలుపుతూ వ్రాసిన వ్యాసం దుమారాన్ని రేపటం, పర్యవసానంగా ఆయన్ని విరసం నుండి బహిష్కరించటం, ఆ పిమ్మట ఆయన క్షమాపణలు చెప్పటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలో వంగపండు... నిజంగా వీరు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారా? అలా అయితే ఫరవాలేదు కానీ ఒత్తిడితో ఆ పని చేస్తే వారికి నా సానుభూతి. తాము నమ్మింది తప్పో ఒప్పో దానికే జీవితాంతం ధైర్యంగా కట్టుబడి ఉండటం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది కానీ తతిమ్మా వాళ్ళని కాదు.

2 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

క్షమాపణ కూడా నాటకమే. విప్లవకారులు కాకపోయినా విప్లవకారుల్లా నటించేవాళ్ళకి క్షమాపణ చెపుతున్నట్టు నటించడం కష్టమా?

Srujana Ramanujan చెప్పారు...

True