...

...

31, మే 2013, శుక్రవారం

సర్దేశాయి తిరుమలరావు పుస్తకం వెలువడింది!


డా. నాగసూరి వేణుగోపాల్ మరియు నా సంపాదకత్వంలో రెండవ పుస్తకం "జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు" వెలువడింది. సాహితీవిరూపాక్షుడువిద్వాన్ విశ్వం మాదిరిగానే ఈ పుస్తకంలో కూడా సర్దేశాయి తిరుమలరావుగారి ఎంపికచేసిన రచనలను (అంటే విమర్శలను, వ్యాసాలను, లేఖలను, నాటికలను, ఒక కథను) కొన్నింటిని, వాటితో పాటు తిరుమలరావుగారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, రచనలను పరిచయం చేసే వ్యాసాలను, ఇంటర్‌వ్యూను పొందుపరిచాము. భారతిలో సర్దేశాయి చేసిన రచనల జాబితా, తైలసాంకేతికరంగంలో వారి కృషిని తెలియజేసే పరిశోధనాపత్రాల జాబితా, వారి చేతిరాతను చూపేందుకు ఒక లేఖ, వారు సంపాదించిన అవార్డులు - రివార్డులు, కొన్ని ఫోటోలు అనుబంధంలో చేర్చాము. 264 పేజీలున్న ఈ పుస్తకం ధర రూ 150/-గా నిర్ణయించాము. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో ఈ పుస్తకం   లభ్యమవుతోంది. e- బుక్  మరియు ప్రింటెడ్ పుస్తకం  కినిగెలో కూడా లభ్యమవుతోంది. ఈ పుస్తకం కొని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.