...

...

10, మే 2013, శుక్రవారం

ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడు!

శ్రీరంగం శ్రీనివాసరావు
విశ్వనాథ సత్యనారాయణ
గంటి శ్రీరామమూర్తి
తిరుమల రామచంద్ర
ఆర్.యస్.సుదర్శనం
జి.సత్యనారాయణ
వడలి మందేశ్వరరావు
పులిచర్ల సాంబశివరావు
డా.మురళీధర్
గుంటూరు శేషేంద్రశర్మ
ఆవంత్స సోమసుందర్
కొత్వాలు అమరేంద్ర
ఇస్మాయిల్
నిడుదవోలు వేంకటరావు
రామాచంద్రమౌళి
డా.ఆర్వీయస్ సుందరం
సాంధ్యశ్రీ
కొలకలూరి ఇనాక్
రావి రంగారావు
విహారి
గాధిరాజు సాల్మూరు
రేకళిగ మఠం వీరయ్య
హెచ్.యస్.బ్రహ్మానంద
కాకుమాను తారానాథ్
దాశరథి కృష్ణమాచార్య
దేవులపల్లి కృష్ణశాస్త్రి
శంకరగంటి రంగాచార్యులు
ములుమూడి ప్రసాదరావు
జానగాని కాటమయ్య
విజయ దత్తాత్రేయ శర్మ
ఎస్.గంగప్ప
సూర్యదేవర రవికుమార్
రోణంకి అప్పలస్వామి
ఆదవాని హనుమంతప్ప
కపిలవాయి లింగమూర్తి
ఇవటూరి యోగదుర్గ మల్లికార్జున
బి.నరసింహులు
కొత్తపల్లి వీరభద్రరావు
పాలకోడేటి జగన్నాథరావు
కోగిర జైసీతారాం
డా.తంగిరాల వెంకట సుబ్బారావు
వేదం వేంకటరాయ శాస్త్రి
శంకరగంటి రమాకాంత్
ఆచార్య జాస్తి సూర్యనారాయణ
డా.కాపు రామాంజనేయులు
డా.మాడభూషి భావనాచార్యులు ....

ఇలా వ్రాసుకుంటూపోతే ఈ జాబితాకు అంతే ఉండదు. 

పైన పేర్కొన్న వారందరికీ వున్న ఏకైక సామ్యము వారందరూ సర్దేశాయి తిరుమలరావుగారి విమర్శకు గురి అయినవారు కావడమే. వీరి ఎవరిపైనా తిరుమలరావు గారికి వయక్తిక ద్వేషం లేదు. పైగా కొందరంటే చాలా గౌరవం కూడా. వారివారి రచనల్లో ఏదో ఒక అంశాన్ని సర్దేశాయిగారు అంగీకరించక పోవడమే ఘాటైన విమర్శలకు మూలం. 1972-1990 మధ్యకాలంలో భారతి మాసపత్రిక సంచికలలో కలగూరగంప శీర్షికలో వచ్చిన వాదోపవాదాలు రసవత్తరంగా సాగాయి. ఈ చర్చోపచర్చలు చదవడానికి చాలా ఆసక్తిని కలిగిస్తాయి.


చాలా మందికి కొరుకుడు పడని ఈ విమర్శకుని గురించి తెలుసుకోవాలంటే త్వరలో మేము వెలువరిస్తున్న జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు చదవాల్సిందే.