...

...

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు

ఎవ్వాని ధీశక్తి యెనలేని నవసృష్టి
            విజ్ఞాన క్షేత్రాన వెలయఁజేసె
 
ఎవ్వాని సవిమర్శ యెఱకువ సమదృష్టి
            విశ్వనాథాదుల వెఱపుఁబెట్టె
 
ఎవ్వాని కలము సాహిత్యతత్త్వశివభా
            రతదర్శనాదుల రచనఁజేసె
ఎవ్వండు బడలిక యెరుగని నిత్యశా
            స్త్రీయ సాహిత్య కృషీవలుండు

అతడు భూరివిజ్ఞానమహాద్రిమూర్తి
వేది వామనాకార త్రివిక్రముండు
సదమలాత్ముడు సాధుసమ్మదవిధాయి
న్యాయి ఘనుడు సర్దేశాయి యగ్రయాయి

-      కె.ఫణి ప్రసన్న కుమార్


21, సెప్టెంబర్ 2013, శనివారం

మంజుశ్రీ కథ!

మంజుశ్రీ అనే కలంపేరుతో రచనలు చేసే సీనియర్‌మోస్ట్ రైటర్ అక్కిరాజు రమాపతిరావుగారి కథ అరుణ కథాజగత్‌లో చదవండి. ఈ కథ ఇప్పటివరకూ కథాజగత్‌లో వచ్చిన కథలన్నింట్లోకి అతి పాత కథ! పాఠకులతోబాటు ఈ తరం కథా రచయితలు చదివితీరాల్సిన కథ ఇది.  

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

జ్ఞా.సిం.స.తి.రా. పై ఓంప్రకాశ్ నారాయణ అభిప్రాయం!

ఇలాంటి వ్యక్తి భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదుఅని మహాత్మాగాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాట, సర్దేశాయి తిరుమలరావుకూ వర్తిస్తుందని చెప్పడం - ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన రాసిన అక్షరమక్షరాన్ని చదివి అర్థం చేసుకున్నవాళ్లు, ఆయన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రమే మాట చెప్పడానికి సాహసిస్తారు. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావుపుస్తక సంపాదకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ విషయాన్ని పుస్తక ప్రారంభంలోనే ప్రస్తావించడంతో ఈ తరం వారికి కాస్త ఆసక్తి, మరికొంత సందేహం కలిగే అవకాశం ఉంది. పైగా సుమారు రెండు దశాబ్దాల క్రితం గతించిన వ్యక్తి గురించి ఇంత పెద్ద మాట అన్నారంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందనిపించడం సహజం. వీటన్నింటికీ చక్కని సమాధానమే 264 పేజీల పుస్తకం.
ఈ  వ్యాసాన్ని పూర్తిగా ఇక్కడ చదవండి.

18, సెప్టెంబర్ 2013, బుధవారం

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ముసురు!

డా.జడా సుబ్బారావు గారి కథానిక ముసురు కథాజగత్‌లో చదవండి. 

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

గౌరీశంకర్ కథ!

భమిడిపాటి గౌరీశంకర్‌గారి కథ నీవు ఇక్కడకు రావద్దు... కథాజగత్‌లో చదవండి.

11, సెప్టెంబర్ 2013, బుధవారం

శేషప్రశ్న

అత్తాకోడళ్ల మధ్య సయోధ్యను కుదర్చడానికి కొడుకు పన్నిన పన్నాగము ఏమిటి?

కన్నతల్లిపై చేయి చేసుకోవడానికి సత్యంకు దారితీసిన పరిస్థితులు ఏవి?

ప్రాణ స్నేహితుణ్ని అతని పరోక్షంలో పెళ్లాం ఎదుట బండబూతులు తిట్టడంలో మతలబు ఏమిటి?


మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మేడా మస్తాన్ రెడ్డిగారి శేషప్రశ్న కథాజగత్‌లో చదవండి.