...

...

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

జ్ఞా.సిం.స.తి.రా. పై ఓంప్రకాశ్ నారాయణ అభిప్రాయం!

ఇలాంటి వ్యక్తి భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదుఅని మహాత్మాగాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాట, సర్దేశాయి తిరుమలరావుకూ వర్తిస్తుందని చెప్పడం - ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన రాసిన అక్షరమక్షరాన్ని చదివి అర్థం చేసుకున్నవాళ్లు, ఆయన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రమే మాట చెప్పడానికి సాహసిస్తారు. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావుపుస్తక సంపాదకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ విషయాన్ని పుస్తక ప్రారంభంలోనే ప్రస్తావించడంతో ఈ తరం వారికి కాస్త ఆసక్తి, మరికొంత సందేహం కలిగే అవకాశం ఉంది. పైగా సుమారు రెండు దశాబ్దాల క్రితం గతించిన వ్యక్తి గురించి ఇంత పెద్ద మాట అన్నారంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందనిపించడం సహజం. వీటన్నింటికీ చక్కని సమాధానమే 264 పేజీల పుస్తకం.
ఈ  వ్యాసాన్ని పూర్తిగా ఇక్కడ చదవండి.

కామెంట్‌లు లేవు: