...

...

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు

ఎవ్వాని ధీశక్తి యెనలేని నవసృష్టి
            విజ్ఞాన క్షేత్రాన వెలయఁజేసె
 
ఎవ్వాని సవిమర్శ యెఱకువ సమదృష్టి
            విశ్వనాథాదుల వెఱపుఁబెట్టె
 
ఎవ్వాని కలము సాహిత్యతత్త్వశివభా
            రతదర్శనాదుల రచనఁజేసె
ఎవ్వండు బడలిక యెరుగని నిత్యశా
            స్త్రీయ సాహిత్య కృషీవలుండు

అతడు భూరివిజ్ఞానమహాద్రిమూర్తి
వేది వామనాకార త్రివిక్రముండు
సదమలాత్ముడు సాధుసమ్మదవిధాయి
న్యాయి ఘనుడు సర్దేశాయి యగ్రయాయి

-      కె.ఫణి ప్రసన్న కుమార్